bheemavaram
-
ప్రభాస్ కల్కి.. బుజ్జి ప్రస్తుతం ఎక్కడ ఉందంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచిన బుజ్జి కారు ప్రస్తుతం ఏపీలో హంగామా చేస్తోంది. ఇటీవల విజయవాడలో సందడి చేసిన బుజ్జి.. తాజాగా భీమవరంలో కనిపించింది. పట్టణంలో ఓ థియేటర్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. బుజ్జిని చూసిన ఫ్యాన్స్ తమ కెమెరాల్లో బంధించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. The Rebel’s City Bhimavaram welcomes #Bujji with boundless excitement! ❤️🫶#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/0kfWNzKffE— Kalki 2898 AD (@Kalki2898AD) July 5, 2024 -
టార్గెట్ వైఎస్సార్సీపీ ఆఫీస్.. అధికారుల ఆడియో లీక్
సాక్షి, భీమవరం: ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఆఫీసులను టార్గెట్ చేసి కూల్చివేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్ రెడీ చేసింది. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ పోలీసుల పహారాలో కూల్చివేతలను ప్రారంభించింది.ఇందులో భాగంగానే భీమవరంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కూల్చివేత ప్రయత్నానికి సంబంధించిన ఇద్దరు అధికారులు మాట్లాడుకున్న ఆడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఆడియోలో వైఎస్సార్సీపీ ఆఫీసులను కూల్చివేయడానికి ముందు తేదీతో నోటీసులు ఇవ్వాలని సైట్ అధికారి మాట్లాడటం స్పష్టంగా ఉంది. దీంతో, ప్లాన్ ప్రకారమే ఆఫీసుల కూల్చివేతలు జరుగుతున్నాయిని బట్టబయలైంది. ఇలాగే అన్ని జిల్లాలోని ఆఫీసులకు ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తాను సేఫ్ జోన్లో ఉండేందుకు సైట్ ఇంజనీర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఆఫీసు కూల్చివేత నోటీసుకు సంబంధించి ముందు తేదీతో నోటీసులు ఇవ్వాలని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ముందుగానే చెప్పినట్టు మాట రూపంలో కాకుండా నోటీసు రూపంలో ఇస్తానని మాట్లాడుకోవడం గమనార్హం. మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించమన్నారు కాబట్టి ఇలా మీతో మాట్లాడాల్సి వచ్చిందని అనుకున్నారు. -
పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు నమ్మొద్దని భీమవరం వాసుల విజ్ఞప్తి
-
భీమవరంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
పవన్‌కు మానసిక చికిత్స అవసరం: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం. పవన్ మానసిక స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బుధవారం ఉదయం గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావ్. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 21 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో అంటూ హితవు పలికారు. సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్‌కు లాగా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుండివెళ్ళిపోయారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు. 2019లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం వైపు చూడలేదు. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడి ప్రజల్ని ఏమయ్యారో అని పట్టించుకోలేదు. భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్ తెలుసుకోవాలి. నేను రౌడీనని పవన్ అంటున్నారు. మరి నా మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు కదా? అని జనసేన అధినేతను గ్రంధి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కంఠస్తం పట్టి మాట్లాడుతున్నాడు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా మీరు?. సినీ ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాల్లో ఇమడలేరు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయి. వాటిని నా చేతులతో ప్రారంభించాను. అభివృద్ధి, నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నాను. భీమవరం జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవి సైతం వదులుకున్నాను. 100 పడకల ఆసుపత్రి కోసం మా కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఇచ్చాను. ఇప్పటివరకు 185 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొలేకనే చంద్రబాబు కూటమితో వస్తున్నాడు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారు. కరోనా సమయంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేశారు. చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన వెబ్సైట్ నుంచి తొలగించాడు. చంద్రబాబు ఎన్నికల ముందు దండాలు పెట్టి ఎన్నికల తర్వాత పంగనామాలు పెడతారని ప్రజలకు తెలుసు. ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారు. కూటమికి అధికారం వచ్చే ఛాన్స్ లేదు. అవినీతికి తావు లేకుండా పేదల గడప వద్దకు సంక్షేమాన్ని చేరువ చేశారు. నిలకడ లేని మాటలు పూనకాలు వచ్చే ప్రసంగాలతో పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ మానసిక స్థితి బాలేదు. ముద్రగడ పద్మనాభం ఇంటిని 5,000 మంది పోలీసులు మొహరించి.. వారి కుమారుడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి వారి భార్యను అనకూడని మాటలంటే నాడు ఆయనకు ఎందుకు సంఘీభావం తెలపలేదు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్ చేతులు కలిపారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హరిరామజోగయ్య సలహాలు ఇస్తే ఆయన్ను కూడా అవమానించిన వ్యక్తి పవన్. చంద్రబాబుకు పవన్ బానిసలా మారిపోయారు. పవన్‌కు సంబంధించి చంద్రబాబు దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో.. ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో.. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ స్థాయి దిగదారి నన్ను విమర్శలు చేస్తున్నారు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్న రామాంజనేయులును కృష్ణాజిల్లా నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చారు. తరిమికొడితే పారిపోయే వ్యక్తిని కాదు నేను.. చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పనిచేశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్ ఆశీస్సులతో సంక్షేమ పాలన అందిస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి జగన్ వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా?. మీరు పార్టీ, కులం వదిలి సీఎం జగన్‌ను బలపరచండి’ అని వ్యాఖ్యలు చేశారు. -
రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే: పవన్
సాక్షి, భీమవరం: వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని చెప్పారు. 80–90 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాంటి వారు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను కూడా 30 ఏళ్ల వయసులోనే సినిమా రంగం నుంచి రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకు ప్రణాళిక రచించుకున్నానని చెప్పారు. నేటి సమాజంలో డబ్బులేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని తాను ఏనాడూ చెప్పలేదని తెలిపారు. ఎవరికీ భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేస్తానంటే కుదరదన్నారు. డబ్బులు ఖర్చులు పెట్టాలన్న విషయాన్ని ఇప్పటికే నాయకులకు చెప్పానని తెలిపారు. ఓట్లు కొంటారో.. ఏం చేస్తారో తాను చెప్పనని, అది మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులపరంగా జరిగే గొడవలను పార్టీలకు అంటగట్టడం మంచిది కాదని, కులంలో ఒకరు తప్పుచేస్తే ఆ తప్పును మొత్తం కులంపై మోపుతున్నారన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో కాపులు–రాజుల మధ్య, తూర్పుగోదావరి జిల్లాలో కాపు–శెట్టిబలిజ కులాల మధ్య ఉన్న గొడవలను పవన్‌కళ్యాణ్ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ.. అన్ని కులాలను సమ దృష్టితో చూస్తుందని చెప్పిన పవన్.. వేదికపై కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు మాత్రమే స్థానం కల్పించడం.. బీసీ, ఎస్సీ నాయకులెవరికీ అవకాశం ఇవ్వకపోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. కాగా, రాజకీయాల్లో రిటైర్మెంట్ విషయం చంద్రబాబును ఉద్దేశించేనని, ఏదో వ్యూహం మేరకే కుప్పంలో భువనేశ్వరి, ఇక్కడ పవన్ ప్రస్తావించారని పలువురు నేతలు చర్చించుకున్నారు. -
మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. గంటలో పరిష్కారం
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలో పరిష్కారం చూపారు. తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు. చెక్కులు అందుకున్న వారి వివరాలు.. ►కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు ►ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ►చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం ►కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం.. ►తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం ►అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ►గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం తాడేపల్లి: విద్యాదీవెన నిధులు విడుదల చేయటంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.583 కోట్లను నేడు మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాల్లో రీయింబర్స్ చేశామని తెలిపారు. అలాగే దాదాపు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 27.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు కింద రూ.11,900 కోట్లను అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు. -
Live: జగనన్న విద్యా దీవెన పథకం...భీమవరంలో సీఎం జగన్ బహింరంగ సభ
-
భీమవరం చేరుకున్న సీఎం జగన్
-
భీమవరంలో రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
-
టీడీపీ,జనసేన పొత్తు..భీమవరంలో గందరగోళం
సాక్షి,భీమవరం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం. రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఎవరికెంత లాభమో తెలీదు కానీ..టీడీపీకి మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన నేతలు క్షేత్ర స్థాయిలో కలవడం లేదు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీకి కీలక టీడీపీ నేతలు డుమ్మా కొట్టడంతో జనసైనికులు భగ్గుమంటున్నారు. అటు టీడీపీలోనూ కొందరు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగతా నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం-జనసేనల పరిస్థితి కాస్త అయోమయంగానే ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం రెండే రెండు నియోజక వర్గాలకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నరేళ్లలో జిల్లాలో బలపడింది లేదు. మరో ఏడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యనే జనసేనతో పొత్తు పెట్టుకుంది. జనసేనకున్న కొద్ది పాటి ఓటు బ్యాంకుతో కొంతైనా పరువు దక్కించుకోవచ్చునన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైన తర్వాత రెండు పార్టీల నేతలతో కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు హాజరు కాలేదు. దీన్ని జనసేన నేతలు ప్రశ్నించారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేనే లేరు. గత ఎన్నికల్లో పులపర్తి ఆంజనేయులు అలియాస్ అంజిబాబు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అప్పుడు జనసేన అభ్యర్ధిగా పోటీచేసిన పవన్ కళ్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ 8357 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల పరాజయంతో అంజిబాబు రాజకీయంగా స్తబ్ధుగా ఉంటున్నారు. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అయితే సమన్వయ కమిటీ భేటీకి మాత్రం రాలేదు. దీనిపై జనసేనకు చెందిన వీరవాసరం జెడ్పీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మిని ప్రశ్నించారు. అంజిబాబు ఎందుకు రాలేదని అడిగారు. అంజిబాబు వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని సీతామహాలక్ష్మి బదులిచ్చి ఊరుకున్నారు. పొత్తులో భాగంగా భీమవరం సీటును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే తనకు నియోజక వర్గం లేకుండా పోతుందని అంజిబాబు ఆందోళనగా ఉన్నారు. ఒక వేళ అదే జరిగితే జనసేన అభ్యర్ధికి ఏ మాత్రం సహకరించే ప్రసక్తే లేదని ఆయన వర్గీయులు తమ ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఒక పక్క జనసేనతో తమ సీటుకు ఎసరు తప్పదన్న బాధ మరో పక్క పార్టీ అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కోపం జిల్లా టీడీపీ నేతలను కుదురుగా ఉండనీయడం లేదు. ఇదిలా ఉంటే రెండు పార్టీల సమావేశానికి కొందరు టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు. ఇక జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికల పూడి గోవిందరావు.. వీరవాసరం జెడ్పీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జనసేనకు పెద్ద చికాగ్గానే ఉంది. జయప్రకాష్ ఏమో అంజిబాబుకు అండగా ఉంటే.. గోవిందరావు తోట మహాలక్ష్మికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడంతో పార్టీలో లుక లుకలు కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఇటు టీడీపీ-జనసేనల మధ్య గొడవలు..అటు టీడీపీలో,జనసేనలోనూ ఉన్న అసంతృప్తులు.. రెండు పార్టీల్లోనూ భిన్న వర్గాల మధ్య కుమ్ములాటలతో రెండు పార్టీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇదీచదవండి..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..? -
మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?: గ్రంధి శ్రీనివాస్ ఫైర్
సాక్షి, పశ్చిమ గోదావరి: జనాలను మోసం చేసే పార్టీ జనసేన అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. పేదలు సుఖంగా ఉంటే పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా? అని పవన్‌ను ప్రశ్నించారు. కాగా, గ్రంధి శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ. పవన్ ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మహోన్నతుల పేర్లు ఉచ్చరించి నీచమైన రాజకీయం చేస్తున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా?. పవన్ కుటిల రాజకీయం గమనించి 2019లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు మీకోసం భీమవరంలో సభ పెట్టలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు -
భీమవరం.. తొలి వసంతం.. ప్రగతి పథం
సాక్షి, భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ లో భాగంగా జిల్లాలను విభజించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిని భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటుచేశారు. గతేడాది ఏప్రిల్ 4న కొత్త జిల్లా కేంద్రం నుంచి పాలన ప్రారంభం కాగా ఇప్పుడు ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజలకు పాలనను చేరువ చేయడం, అభివృద్ధి పరుగులు పెట్టించడం, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా కొత్త జిల్లాలో పాలన సాగుతోంది. పాలకొల్లు నియోజకవర్గం భగ్గేశ్వరంలో 64 ఎకరాల్లో రూ.475 కోట్లతో వైద్య కళాశాల, భీమవరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం భీమవరంలోని కలెక్టరేట్ జిల్లాలోని అన్నిప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో వ్యయప్ర యాసలు తప్పాయి. జిల్లాలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఏడాది కాలంలో 15,423 దరఖాస్తులు రాగా 14,574 అర్జీలను పరిష్కరించారు. పాలనపై ప్రత్యేక మార్క్ నూతన పశ్చిమగోదావరి జిల్లాకు మొదటి కలెక్టర్‌గా పి.ప్రశాంతి పనిచేస్తున్నారు. ఆమె పాలనలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించడంతో పాటు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. వరదల సమయంలో.. గతేడాది గోదావరికి వరదలు వచ్చిన సమయంలో లంక గ్రామాలు నీటమునగాయి. కలెక్టర్ ప్రశాంతి అధికార యంత్రాంగంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నెల రోజులపాటు జిల్లా యంత్రాంగం సమర్థంగా సేవలందించడంతో ఏ ఒక్క ప్రాణానికి హాని కలగలేదు. స్వగృహ‘మస్తు’ జిల్లాలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకూ 20 వేల మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకున్నారు. మరిన్ని ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు భీమవరంలోని రాయలంలో రూ.1.60 కోట్లతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటుచేశారు. కలెక్టర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు, దాతలు రూ.50 లక్షల విరాళం అందించారు. త్వరలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించనున్నారు. భీమవరం.. సుందర పట్టణం భీమవరం సుందర పట్టణంగా రూపుదిద్దుకుంటోంది. వెల్కమ్ ఆర్చిలు, వాటర్ ఫౌంటెన్లు, వాల్ పెయింటింగ్స్, డివైడర్ల మధ్యలో మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పట్టణ సుందరీకరణకు కలెక్టర్ కృషిచేస్తున్నారు. ‘రియల్’కు మంచి రోజులు భీమవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. భీమవరంలో కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులో ఉండటంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. పెరిగిన హోటళ్ల వ్యాపారం భీమవరంలో హోటళ్ల వ్యాపారం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణంలో 80 హోటళ్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 130 వరకు పెరిగింది. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వివిధ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సంఖ్య పెరగడంతో హోటళ్ల వ్యాపారం పుంజుకుంది. ఇళ్లు అద్దెలూ.. భీమవరంతోపాటు సమీప గ్రామాలైన విస్సాకోడేరు, తాడేరు, చినఅమిరం, రాయలం తదితర గ్రామాల్లో ఇళ్ల అద్దెలు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకావడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి. పాలన మరింత చేరువ జిల్లాల పునర్విభజనతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైంది. సమస్యలను సత్వరమే పరిష్కరించి అభివృద్ధిని వేగం చేయడానికి అవకాశం ఏర్ప డింది. పేదలకు నవరత్నాల పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా పరిధి తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే వెళ్లి పరిష్కరించగలుగుతున్నాం. – పి.ప్రశాంతి, కలెక్టర్ సత్వర సేవలందించేలా.. నూతన జిల్లా విస్తీర్ణం తక్కువ, రవాణా సౌకర్యం అనుకూలం, తగినంత పోలీసు సిబ్బంది ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించగలుగుతున్నాం. దీంతో నేరాల సంఖ్య కూడా బాగా తగ్గింది. మారుమూల ప్రాంతాలకు కూడా వెంటనే చేరుకోగలుగుతున్నాం. సారా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. – యు.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ -
15 టన్నుల బరువు.. 30 అడుగుల పొడవు
సాక్షి, భీమవరం: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. పట్టణంలోని 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్‌లోని మునిసిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీజీ ఏఐజీ కాగా, ప్రధాన మంత్రి భీమవరం ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో∙ఎస్పీజీ ఏఐజీ హిమాన్షు గుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్ మిశ్రా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్ హెలీప్యాడ్ స్థలం, బహిరంగ సభ స్థలాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం హిమాన్షు గుప్త మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐజీ పాలరాజు, సెక్యూరిటీ ఐజీ శశిధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, కోనసీమ ఎస్పీ సుదీప్‌కుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పాల్గొన్నారు. -
భీమవరంలో మహాశివరాత్రి వేడుకలు
-
లాభాల పండుగప్ప
భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పండుగప్ప చేప సాగు విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో సాగు అంతంతమాత్రంగా ఉండగా గతనెల నుంచి చేప ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నరసాపురం, కాళ్ల మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు. ఈ చేప సప్ప, ఉప్పు నీటిలోనూ పెరుగుతుంది. ఇటీవల పండుగప్పకు డిమాండ్ పెరగడంతో సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ధర ఆశాజనకం ప్రస్తుతం పండుగప్ప చేపల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప రూ.320, రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే రూ.380, ఐదు నుంచి ఏడు కిలోలలోపు ఉంటే రూ.420, ఏడు కిలోలలు దాటితే రూ.480 చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలో పండిన చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బిహార్ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలు వదులుతున్నామని, వీటికి ఆహారంగా చైనా గొరకలు, చిన్న చేపలను వేస్తుంటామని రైతులు అంటున్నారు. బతుకున్న చేపలను మాత్రమే వేటాడటం పండుగప్ప ప్రత్యేకత. చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న, సన్నకారు రైతుల మొగ్గు వనామీ పెంపకంలో వైట్ స్పాట్, విబ్రియో, వైరస్ వల్ల నష్టాలను చవిచూస్తున్న రైతులకు పండుగొప్ప పెంపకం వరంలా మారింది. ఎకరా, రెండెకరాల్లో వనామీ సాగు చేసిన ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని అంటున్నారు. ఆహారంగా చైనా గొరకలు పండుచేప బతుకున్న చేపలను మాత్రమే ఆహారం తింటుంది. దీంతో రైతులు స్థానిక చేపల చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. కొంతకాలంగా మేత కొరత రావడంతో కొల్లేరు, మచిలీపట్నం, కైకలూరు ప్రాంతాల నుంచి లారీలపై డ్రమ్ముల్లో ఆక్సిజన్ సాయంతో చైనా గొరకలు, చిన్న చేపలను తీసుకువచ్చి పండుగప్ప చెరువుల్లో వేస్తున్నారు. లాభసాటిగా ఉంది నాకు రెండు మీటర్ల లోతు కలిగిన ఎకరా ఉంది. దానిలో 600 పండుగప్ప చేప పిల్లలు వదిలాను. ఏడాది పాటు చైనా గొరకలు, చిన్న చేపలను రోజుకు 60 కిలోల వరకు మేతగా వేశాను. రూ.3 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. పట్టుబడి అనంతరం ఖర్చులు పోగా మిగిలిన దాంతో అప్పులు తీర్చాను. –దాసరి నారాయణరావు, రైతు, లోసరి మేత కోసం ఇబ్బందులు తీర ప్రాంతాల్లో పండు చేప సాగు చేస్తున్నారు. ఈ చేపలకు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ బాగుంది. వీటికి ఆహారంగా వేసే చైనా గొరకల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.25కు కొని వీటికి మేతగా వేస్తున్నాం. మేత కోసం ఇబ్బందులు తప్పడం లేదు. – గంధం రమేష్, రైతు, లోసరి ఏడాదికి 5 వేల టన్నుల వరకు ఎగుమతి పండుగప్ప చేప శాస్త్రీయ నామం లేటస్ కాల్‌కేర్‌ఫర్. ఇది ఉప్పు, సప్ప నీటిలో పెరుగుతుంది. దీనిలో ప్రోటీన్లు, కార్పొహైడ్రేట్లు ఉండటంతో డిమాండ్ బాగుంది. ఏడాదికి జిల్లావ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల టన్నుల పండుగప్ప చేపలు ఎగుమతి అవుతున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి, భీమవరం -
భీమవరంలో ‘రియల్’ జోరు
భీమవరం(ప్రకాశం చౌక్): కొత్తగా ఏర్పడే పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల నుంచే భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వరం అంటున్నారు వ్యాపారాలు.. భీమవరం జిల్లా కేంద్రం కానుండడంతో రియల్ వ్యాపారులు మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే భీమవరం మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు విలీనం కావడంతో ఆయా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సన్నాహాలు చేసుకున్నారు. ఇక జిల్లా కేంద్రం కూడా భీమవరం కావడంతో భీమవరం దగ్గరలోని భూముల కొనుగోలు కోసం వేట సాగిస్తున్నారు. దాంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. విలీన గ్రామాలపై రియల్టర్ల దృష్టి భీమవరం పట్టణానికి అనుకుని ఉన్న విస్సాకోడేరు, కుముదవల్లి, గొల్లలకోడేరు గ్రామాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ గ్రామాలు భీమవరంలో వీలీనం కాలేదు. అయితే ఈ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్లలో జరుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు రియల్ వ్యాపారులు తమ దృష్టి వీలిన గ్రామాలపై పెట్టారు. భీమవరం మున్పిపాలిటీలో వీలినమైన రాయలం, తాడేరు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాల్లో రియల్ ఎస్టేట్ కోసం భారీగా భూములను కొనుగోలు చేయడానికి వ్యాపారులు అసక్తి చూపుతున్నారు. భీమవరంలో జిల్లా కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టినా ఈ గ్రామాల నుంచి కేవలం కిలోమీటరు నుంచి 3 కిలోమీటర్లు దూరంలో ఉంటాయి. సామాన్యుడి నుంచి ధనికుడి వరకూ సంతోషం భీమవరం పరిసరాల ప్రాంతాల్లో ఇంతవరకు ఎకరం భూమి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఉంది. ఇప్పుడు భీమవరం జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాలల్లో దూరం బట్టి ఎకరం సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతుందని రియల్ వ్యాపారులు అంటున్నారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో భీమవరం, పరిసరాల ప్రాంతాల్లో స్థలాలు ఉన్న సామాన్యుడి దగ్గర నుంచి ధనికుల వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో కనీసం రెండు సెంట్ల స్థలం ఉంటే బాగుంటుందని భావించి సామాన్యులు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేయగా.. ఆర్థిక పరిస్థితి బాగున్నవాళ్లు వారుండే గ్రామాల్లోని స్థలాలు, భూమి అమ్మి భీమవరంలో స్ధలాలు కొనుగోలు చేశారు. మొన్నటి వరకు భీమవరం కార్పొరేషన్ అవుతుందని సంతోషంగా ఉన్నారు. నేడు ఏకంగా జిల్లా కేంద్రం కావడంతో వారి సంతోషం మరింత రెట్టింపైంది. 9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు భీమవరం పట్టణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టణంలోని పేదవాళ్లకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం సుమారు 180 ఎకరాలు సేకరించారు. సుమారు 9 వేల మందికి సెంటు భూమి చొప్పున స్థలం ఇచ్చారు. విస్సాకోడేరు, గునుపూడి రెండు లేవుట్లలో సెంటు సుమారు 3 నుంచి 4 లక్షలు ఉంది. నేడు జిల్లా కేంద్రం భీమవరం కావడంతో భూములు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేదవాడికి ఇచ్చి సెంటు స్థలం మరింత పెరుగుతుంది. భీమవరం జిల్లా కేంద్రం కావడం మొన్నటి వరకు ఇంటి జాగా లేని పేదవాళ్లకు వరంగా మారింది. రియల్ ఎస్టేట్‌కు ఎంతో ప్రయోజనం భీమవరం జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్‌కు ఏంతో ప్రయోజనకరం. భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్లకు భీమవరం మంచి ప్రాంతం. ఇప్పటికే కార్పొరేషన్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో భీమవరంలో స్థలాల కొనుగోళ్లు పెరుగుతాయి. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుటుందని భావిస్తున్నాం. - జి.శ్రీరామ్, ఎండీ ఎస్ఆర్ డెవలపర్స్ భీమవరం -
యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..
సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. భీమవరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే యువకుడు లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని ఆమెను నమ్మించాడు. భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో యువతిని నిర్భంధించాడు. యువతి కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో తీసి వాటిని యువతి తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భీమవరంలో నిందితుడు ఫణీంద్రను అరెస్టు చేశారు. -
ఈనెల 14న భీమవరం వెళ్లనున్న సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 14వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పంచాయతీ: మమ్మల్ని బలి చేస్తారా!
భీమవరం: పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఖంగుతింటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వర్గాలు, కుటుంబాలు, సంప్రదాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ సానుభూతిపరులు సర్పంచ్‌గా ఎన్నికైతే ఆయా గ్రామాలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు, గ్రామాభివృద్ధికి నిధులు పెద్ద మొత్తంలో మంజూరవుతాయని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పార్టీలను పక్కన పెట్టి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారు. కన్నెత్తి చూడలేదు సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుండగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఆయా పార్టీల పెద్దలు కనీసం ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అ భ్యర్థిగా పోటీచేసిన కొణిదెల నాగేంద్రబాబు, భీమవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కొణిదెల పవన్‌కల్యాణ్ ఇంతవరకు జిల్లాను కన్నెత్తి చూడలేదంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వ్యయప్రయాసల కోర్చి పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల అనంతరం తమను పట్టించుకున్న నాథుడే లేడని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినా వారెవరూ గ్రామాలను పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, బీజేపీ అధినాయకు లు ఇచ్చిన పిలుపు సైతం గ్రామాల వరకు తీసుకువెళ్లకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి కార్యక్రమాలు మమ అనిపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కార్యకర్తలు పార్టీ కోసం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. అండగా ఉంటారా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం ఎన్నికల బరిలో నిలిస్తే అండగా ఎవరుంటారని ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసిన పల్లె ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని అంటున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం గ్రామాల్లో పార్టీ పటిష్టానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అధిష్టానాలు ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని మదనపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అధినాయకులకు తెలిసినా కార్యకర్తలను బలిచేస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీ ఎన్నికలు టీడీపీ, జనసేన నాయకులకు తలబొప్పికట్టే విధంగా తయారవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: భీమవరం పట్టణం రామ లక్ష్మణ్ నగర్ వంతెన మలుపులో గురువారం చేపల లోడు లారీ పంట కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ లారీలో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గూట్లపాడు గ్రామం నుంచి లారీ నారాయణపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరి గింది. టూ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
నేడు భీమవరానికి సీఎం జగన్
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు రానున్నారు. గురువారం సాయంత్రం 3.40 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరిహెలీకాప్టర్ ద్వారా 4.25 గంటలకు భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్‌కు చేరకుంటారు. 4.35 గంటలకు వీఎస్ఎస్ గార్డెన్లో జరిగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహానికి హాజరవుతారు. 4.55 గంటలకు తిరిగి బయలుదేరతారు. 5.10 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని 5.45 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
సంక్రాంతి 2020; పందెం రాయుళ్ల అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి/పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఈసారి కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాల జాడేలేకుండా పోయింది. గతంలో కోడి పందేల బరుల వద్దే అనధికారికంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దాంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి పెద్ద ఎత్తున ఆడేవారు. కాగా, 2020 సంక్రాంతి సంబరాల్లో జూదాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు ఫలించాయి. ఇక సంప్రదాయ కోడి పందాల్లో కత్తి కట్టడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. మూడు రోజులపాటు సరదాగా గడిపేందుకు, ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ కోడి పందేల్ని వీక్షించేందుకు వచ్చామని ఔత్సాహికులు వెల్లడించారు. అయితే, అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (చదవండి : కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె) బరిలో నిలిచిన పందెం కోళ్లు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. భీమవరం, నరసాపురం, ఆచంటతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 100కు పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉంగుటూరు మండలం గొల్లగూడెం, బాదంపూడి, నల్లమాడు గ్రామాల్లో కోడిపందాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. 3 కోళ్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసుల అరెస్టు చేశారు. రూ. 4780 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉండి సంక్రాంతి సంబరాల్లో తలసాని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పా ప్రభుత్వం మారుతుందని. మా రాష్ట్రం నుంఛఙ ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం. ఒక పెద్ద భవనం కట్టి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పుకునే తిరిగి ఒకాయన మూలన పడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామం. కేసు నమోదు.. సాక్షి, చిత్తూరు : పీలేరులో రెండుచోట్ల (జాండ్ల, యర్రగుంట్ల వద్ద) కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని చుట్టుముట్టి 10 మంది పందెం రాయుళ్లని, 2 కోడి పుంజులను లక్షా వెయ్యి రూపాయల నగదు , 54 కోడి కత్తులు, ఒక కారు , రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బి.కొత్తకోటలో ఆరు మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి.. రెండు కోళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.15 వేల 620 ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వాజేడు మండలానికి సమీపంలో ఉన్న చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. పందాల్లో పాల్గొనేందకు రాష్ట్రం నుంచి గుట్టుగా పోయేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. అసలే ఏజెన్సీ అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో.. పోలీసులకు కోడి పందాల కట్టడి చేయడం కష్టతరంగా మారింది. -
పండుగంటే భీమవరమే..
సాక్షి, అమరావతి: ట్వంటీ ట్వంటీ(2020) కోడి పందాలకు ఉభయ గోదావరి జిల్లాలు ‘బరి’ గీస్తున్నాయి. 2020 క్రికెట్ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఉత్కంఠ రేపే ఈ పందాలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రత్యర్థి కోడిని గురి చూసి కొట్టేందుకు పందెంరాయుళ్లు తదేక దీక్షతో కసరత్తు చేస్తున్నారు. కోడి పందాలను అడ్డుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీసులు గట్టి ప్రయత్నాలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి పందాలను ఎలాగైనా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బైండోవర్లు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పందాల నిర్వాహకులు మాత్రం ధీమాగానే ఉన్నారు. తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. ఊరూవాడా దద్దరిల్లేలా.. సంక్రాంతికి నిర్వహించే కోడిపందాలే గోదావరి జిల్లాల్లో స్పెషల్ ఈవెంట్. గతంలో సరదా కోసం, సాంప్రదాయంగా కోళ్లను బరిలో దించేవారు. ఇప్పుడు బెట్టింగ్‌ల కోసం పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. తొలినాళ్లలో సాంప్రదాయంగా మొదలైన కోడి పందాలు 1996 నుంచి రూపుమార్చుకున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ.కోట్లాది చేతులు మారుతున్నాయి. ఈసారి మరింత భారీగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందాలు చూడటానికి వచ్చిన ప్రజలు (ఫైల్) బంధుమిత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు కోడి పందాలను చూసేందుకు బంధువులతోపాటు పొరుగు ప్రాంతాల్లోని మిత్రులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే అతిథులు సైతం సంక్రాంతి ఎప్పుడొస్తుందా? అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పండుగంటే భీమవరమే.. సంక్రాంతి సంబరాలు.. కోడి పందాలు అంటే వెంటనే గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమే. సంక్రాంతి సమయంలో రాజకీయ, పారిశ్రామిక రంగాలతోపాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. ప్రతిఏటా పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం వస్తుంటారు. కోడి పందాలు, సంక్రాంతి ప్రస్తావన వస్తే సినిమా, టీవీలతోపాటు పాటల్లోనూ భీమవరం ప్రస్తావన లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. మూడు రోజుల సంబరాలు.. ఖరీదైన కార్లు.. డబ్బుల మూటలు.. చంకలో కోడి పుంజులు.. పొలాల్లో షామియానాలు.. టెంట్లు.. కళ్లు మిరుమిట్లు గొలిపే ఫ్లడ్‌లైట్ల కాంతులు.. కత్తులు దూసే పందెం కోళ్లు.. బరుల చెంతనే పేకాట, గుండాట.. కోడి పకోడి, కోడి పలావ్‌లతో విందు.. విచ్చలవిడిగా మద్యం.. సేద తీరేందుకు ఘనమైన ఏర్పాట్లు. ఇదీ గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడి. మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలకు ఏడాదంతా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా ధర పలుకుతుంది. పందెంలో గెలిచిన కోడి దర్జాగా యజమాని భుజం మీదకు చేరితే.. పోరాడి ఓడిన కోడి కూరగా మారిపోతుంది. పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడికి సైతం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని కూర వండి, బంధుమిత్రులకు పంపించడం గోదావరి జిల్లాల ప్రజలు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. -
'ప్రియాంక గురించి ఆలోచిస్తే భయమేస్తోంది'
సాక్షి, భీమవరం : పశు వైద్య డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణహత్యను ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ప్రియాంక తన చెల్లికి చేసిన ఫోన్ కాల్ చూస్తుంటే దేశంలో అమ్మాయిల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నందుకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు రాత్రి అమ్మాయిని ఎంత వేధించి ఉంటారో ఆలోచిస్తేనే తనకు భయం కలుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఆడపిల్లలు ఆపదలు ఉంటే వారిని రక్షించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు ఆపదలో ఉన్నాము అని ఎవరైనా ఫోన్ చేస్తే ఆ పరిధి తమది కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండా తక్షణమే స్పందించి రక్షణ కల్పిస్తే బాగుంటుందని వెల్లడించారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలతో కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. (చదవండి : ప్రియాంక తల్లిదండ్రుల గుండెకోత వర్ణణాతీతం)