'ప్రియాంక గురించి ఆలోచిస్తే భయమేస్తోంది' | Taneti Vanitha Vehemently Condemns About Priyanka Reddy Murder | Sakshi
Sakshi News home page

'ప్రియాంక గురించి ఆలోచిస్తే భయమేస్తోంది'

Published Sat, Nov 30 2019 6:07 PM | Last Updated on Sat, Nov 30 2019 6:20 PM

Taneti Vanitha Vehemently Condemns About Priyanka Reddy Murder - Sakshi

సాక్షి, భీమవరం : పశు వైద్య డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణహత్యను ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ప్రియాంక తన చెల్లికి చేసిన ఫోన్‌ కాల్‌ చూస్తుంటే దేశంలో అమ్మాయిల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నందుకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు రాత్రి అమ్మాయిని ఎంత వేధించి ఉంటారో ఆలోచిస్తేనే తనకు భయం కలుగుతుందని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడైనా ఆడపిల్లలు ఆపదలు ఉంటే వారిని రక్షించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు ఆపదలో ఉన్నాము అని ఎవరైనా ఫోన్‌ చేస్తే ఆ పరిధి తమది కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండా తక్షణమే స్పందించి రక్షణ కల్పిస్తే బాగుంటుందని వెల్లడించారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలతో కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.  
(చదవండి : ప్రియాంక తల్లిదండ్రుల గుండెకోత వర్ణణాతీతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement