
సాక్షి, పశ్చిమగోదావరి : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. కొన్ని శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులతో ఎంత సఖ్యతగా మెలుగుతారో వారు కూడా ప్రజలతో అంతే స్నేహపూర్వంగా మెలగాలని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. (ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి)