
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ పక్షపాతి అని మరోసారి నిరుపించుకున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూతను అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు.
(చదవండి: వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000)
Comments
Please login to add a commentAdd a comment