condemns
-
యువతిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం(ఫిబ్రవరి 14) ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా,అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
మాస్కోలో ఉగ్రదాడి.. రష్యాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ఐసిస్ ఉగ్రసంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ‘మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సైనిక దుస్తుల్లో కన్సర్ఠ్ హాల్లోకి చొచ్చుకొని వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ భయంకర ఘటనలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. చదవండి: మాస్కో దాడులు: ముందే హెచ్చరించిన అమెరికా ! We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief. — Narendra Modi (@narendramodi) March 23, 2024 -
హిందూ ఆలయంపై విద్వేష రాతలు
న్యూయార్క్/గాందీనగర్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడపై భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతోపాటు ఖలిస్తాన్ అంటూ కలర్ స్ప్రే చేశారు. పోలీసులు ఈ ఘటనను విద్వేష నేరంగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నెవార్క్‌లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు(గ్రాఫిటీ) ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం తమకు ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తదితరాలతో ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోనూ భారత దౌత్య కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగాయి. జూలైలో శాన్ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాలపౌరసత్వమున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం వెనుక భారత ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉపేక్షించరాదు: జై శంకర్ ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు. -
దాడి ఘటనపై మోదీ దిగ్బ్రాంతి
న్యూఢిల్లీ: గాజా ఆసుపత్రిలో బాంబు పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో సాధారణ ప్రజలు బలి కావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇప్పటికైనా గాజాలో హింసకు తెరపడాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని తప్పనిసరిగా శిక్షించాలని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. -
తప్పుదోవ పట్టించడానికే బిల్డర్ల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికే బిల్డర్లు సమ్మెకు దిగుతున్నారని దక్షిణ భారత సిమెంట్ తయారీదార్ల సంఘం (సిక్మా) తెలిపింది. సిమెంటు కారణంగా నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయన్న బిల్డర్ల ఆరోపణలను సంఘం ఖండించింది. ‘ఆర్థిక పునరుద్ధరణ ప్రయోజనాలను మరింత పొందాలన్నది బిల్డర్ల భావన. ఇందులో భాగంగా రియల్టీ ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఈ విషయాలను ఇప్పటికే ప్రధానికి, ఆర్థిక మంత్రికి సిక్మా తన లేఖ ద్వారా వివరించింది. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వాల్సి ఉంది’ అని సిక్మా స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తేవాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిన తరుణంలో.. ఇళ్ల ధరలను గణనీయంగా తగ్గించి సామాన్యుడికి నీడను అందించాల్సిందిపోయి రియల్టీ ధరలను పెంచుకోవడానికి ఆధారం లేని కారణాలను చూపి ప్రయోజనం పొందాలన్నది బిల్డర్స్ అసోసియేషన్ ఎత్తుగడ అని సిక్మా వెల్లడించింది. నిర్మాణ వ్యయం 50 శాతం లోపే.. ‘మార్కెట్లో సిమెంటు ఒక మెట్రిక్ టన్నుకు రూ.6,000 లోపే బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారు. బిల్ట్ అప్ ఏరియాలో ఒక చదరపు అడుగుకు సిమెంటుకు అయ్యే వ్యయం రూ.150 మాత్రమే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంలో సిమెంటు ప్రభావం ఎంత అని ప్రజలు ఆలోచించాలి. సిమెంటు బస్తా ధర రూ.100 పెరిగిందని బిల్డర్లు అంటున్నారు. వాస్తవానికి అయిదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే ధరలు స్థిరంగా ఉన్నాయి. తప్పుడు బిల్లుల ద్వారా జీఎస్టీ (28 శాతం) అధిక ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవాలన్నది వారి ఉద్దేశమా? పలు మార్కెట్లలో మేము చేపట్టిన అధ్యయనం ప్రకారం ఇంటి విక్రయ ధరలో నిర్మాణ వ్యయం 50 శాతం కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని ఎందుకు కోరడం లేదు? తద్వారా ప్రజలకే మేలు కదా. నిర్మాణం పూర్తి అయిన, సెమి ఫినిష్డ్ ఇళ్లను బిల్డర్లు అట్టిపెట్టుకునే బదులు ధరలు తగ్గించి ఎందుకు విక్రయించడం లేదు? వినియోగదార్ల నుంచి డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణం ఆలస్యం చేస్తున్న, వదిలేసిన బిల్డర్లపై అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది’ అని సిక్మా పలు ప్రశ్నలను సంధించింది. -
'ప్రియాంక గురించి ఆలోచిస్తే భయమేస్తోంది'
సాక్షి, భీమవరం : పశు వైద్య డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణహత్యను ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ప్రియాంక తన చెల్లికి చేసిన ఫోన్ కాల్ చూస్తుంటే దేశంలో అమ్మాయిల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నందుకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు రాత్రి అమ్మాయిని ఎంత వేధించి ఉంటారో ఆలోచిస్తేనే తనకు భయం కలుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఆడపిల్లలు ఆపదలు ఉంటే వారిని రక్షించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు ఆపదలో ఉన్నాము అని ఎవరైనా ఫోన్ చేస్తే ఆ పరిధి తమది కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండా తక్షణమే స్పందించి రక్షణ కల్పిస్తే బాగుంటుందని వెల్లడించారు. ప్రియాంక రెడ్డి హత్యకు కారణమైన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలతో కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. (చదవండి : ప్రియాంక తల్లిదండ్రుల గుండెకోత వర్ణణాతీతం) -
దాడి పిరికిపందల చర్య
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి పిరికి పందల చర్య. వీరులైన జవాన్లకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శోకంలో ఉన్న అమరవీరుల జవాన్ల కుటుంబాల పరిస్థితికి నా హృదయం ద్రవిస్తోంది. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. -
మ్యూనిక్ దాడిని ఖండించిన మోదీ
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. మ్యునిక్ లో జరిగిన దాడి భీతిని కొల్పిందని, దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. శుక్రవారం మునిక్ లోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో గల ఒలింపియా షాపింగ్ సెంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణకాండలో పదిమంది చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించలేదు. మరో 22 మంది గాయపడ్డారు. -
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్‌ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. -
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
ఇస్తాంబుల్ ఉగ్రదాడి: మోదీ, రాహుల్ గాంధీల ఖండన
న్యూఢిల్లీ: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల మారణకాండను భయానక, అమానవీయ సంఘటనగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఈ దాడులను నేను గట్టిగా ఖండిస్తున్నా. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులు గుండెలు దిటవుచేసుకోవాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అంటూ ట్విట్ చేశారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి తనకు షాక్ కు గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అమాయకులపై పాశవికదాడి జరగడం బాధకరమని, దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడినవారిని, యావత్ ఇస్తాంబుల్ ప్రజానికానికీ సానుభూతి తెలుపుతున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. Attack in Istanbul is inhuman & horrific. I condemn it strongly. My thoughts are with bereaved families. May the injured recover quickly. — Narendra Modi (@narendramodi) 29 June 2016 My prayers are with the families of the victims & the ppl of #Istanbul — Office of RG (@OfficeOfRG) 29 June 2016 -
పొలాలను ధ్వంసం చేయడం విద్రోహచర్య: బొత్స
-
''అసలు ప్రభుత్వం ఉందా?''
-
జవాన్ల మృతికి షీండే,రమణ్ సింగ్ సంతాపం
-
'గడప గడపన సీమాంధ్ర ముగ్గులు వేయండి'
అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. గాదెపై దాడిని ఆయన ఖండించారు. శనివారం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గడప గడపన సంక్రాంతి పండగ సందర్భంగా సీమాంధ్ర ముగ్గులు వేయాలని ఆయన కోస్తా, రాయలసీమా వాసులకు సూచించారు. బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు శాసనసభ్యులందరు పాల్గొని బిల్లును ఓడించాలని ఆయన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారాన్ని ఖండించిన వైఎస్సాఆర్ సీపీ
-
జగన్ బెయిల్‌కి రాజకీయాలతో ముడిపెట్టడం తగదు: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
-
కాంగ్రెస్ విషపు కౌగిలిలో కొండా సురేఖ: అంబటి
-
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అబంటి
కాంగ్రెస్‌పార్టీ విషపు కౌగిలిలో కొండాసురేఖ చిక్కుకోవడం బాధగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీధర్‌రెడ్డిలు అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్ర్కిప్ట్‌ను కొండా సురేఖ చదివారని వారు పేర్కొన్నారు. ఓ వేళ కాంగ్రెస్పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లోచ్చని వారు కొండాసురేఖకు ఈ సందర్భంగా హితవు పలికారు. రాఖీ పండగ సందర్భంగా వైఎస్ జగన్‌పై సోదరి కొండా సురేఖ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ జగన్‌పై నిందలు వేయడం మంచిదికాదని తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీ నాయకులపై కొండ సురేఖ ఆరోపణలు చేసిన సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు, శ్రీధర్‌రెడ్డిలు గుర్తు చేశారు. వైఎస్ జగన్‌పై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. -
జగన్ ఫోన్ వాడుతున్నట్టు నిరూపించగలరా?