కాంగ్రెస్పార్టీ విషపు కౌగిలిలో కొండాసురేఖ చిక్కుకోవడం బాధగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీధర్రెడ్డిలు అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్ర్కిప్ట్ను కొండా సురేఖ చదివారని వారు పేర్కొన్నారు. ఓ వేళ కాంగ్రెస్పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లోచ్చని వారు కొండాసురేఖకు ఈ సందర్భంగా హితవు పలికారు.
రాఖీ పండగ సందర్భంగా వైఎస్ జగన్పై సోదరి కొండా సురేఖ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ జగన్పై నిందలు వేయడం మంచిదికాదని తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీ నాయకులపై కొండ సురేఖ ఆరోపణలు చేసిన సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు, శ్రీధర్రెడ్డిలు గుర్తు చేశారు. వైఎస్ జగన్పై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.