న్యూఢిల్లీ: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల మారణకాండను భయానక, అమానవీయ సంఘటనగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఈ దాడులను నేను గట్టిగా ఖండిస్తున్నా. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులు గుండెలు దిటవుచేసుకోవాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అంటూ ట్విట్ చేశారు.
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి తనకు షాక్ కు గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అమాయకులపై పాశవికదాడి జరగడం బాధకరమని, దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడినవారిని, యావత్ ఇస్తాంబుల్ ప్రజానికానికీ సానుభూతి తెలుపుతున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
Attack in Istanbul is inhuman & horrific. I condemn it strongly. My thoughts are with bereaved families. May the injured recover quickly.
— Narendra Modi (@narendramodi) 29 June 2016
My prayers are with the families of the victims & the ppl of #Istanbul
— Office of RG (@OfficeOfRG) 29 June 2016