అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. గాదెపై దాడిని ఆయన ఖండించారు. శనివారం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గడప గడపన సంక్రాంతి పండగ సందర్భంగా సీమాంధ్ర ముగ్గులు వేయాలని ఆయన కోస్తా, రాయలసీమా వాసులకు సూచించారు. బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు శాసనసభ్యులందరు పాల్గొని బిల్లును ఓడించాలని ఆయన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు.