
న్యూఢిల్లీ: గాజా ఆసుపత్రిలో బాంబు పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో సాధారణ ప్రజలు బలి కావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇప్పటికైనా గాజాలో హింసకు తెరపడాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రిలో బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని తప్పనిసరిగా శిక్షించాలని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు.