ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్ధ హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హమాస్ అగ్రనేతను ఎట్టకేలకు హతమార్చడంతో.. ఏడాది కాలంగా సదరు మిలిటెంట్ సంస్థతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించినట్లైంది..
యహ్య సిన్వార్ మృతి అనంతరం గాజా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను వదిలి, బంధీలను విడిచిపెట్టినట్లైతే రేపటిలోగా యుద్ధం ముగుస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు.
చదవండి: ఇజ్రాయెల్ డ్రోన్ వీడియో.. హమాస్ సిన్వర్ ఆఖరి క్షణాలు ఇలా
యహ్యా సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులు అన్ని రఫాలో మట్టుబెట్టారు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది. గాజా ప్రజలకు నాదొక చిన్న సందేశం.. హమాస్ తన ఆయుధాలను వదిలి ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగిస్తే ఈ యుద్ధం ముగియవచ్చు.
మా పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తాం’ అని హెచ్చరించారు. కాగా హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. గాజాపై తాము జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందాని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని డీఎన్‌ఏ టెస్టు తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది.
Yahya Sinwar is dead.
He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces.
While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్‌నే మాస్టర్‌మైండ్. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీనిపై హమాస్ ఎటువంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment