shocked
-
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
Hathras Stampede: కరోనా కాలంలోనూ..
యూపీలోని హత్రాస్‌లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0— NDTV India (@ndtvindia) July 3, 2024 -
పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజల షాక్
సాక్షి, విశాఖపట్నం: పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజలు షాక్ ఇచ్చారు. పవన్ సభకు జనాలు మొహం చాటేశారు. జనాలు లేక బహిరంగ సభ ప్రాంగణం వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. జనాలు లేక రెండు గంటలకుపైగా పవన్ కల్యాణ్ హోటల్ కే పరిమితమయ్యారు. గ్రౌండ్లో సగం వరకే కుర్చీలు వేసిన జనాలు కనిపించలేదు. జనాలను తీసుకురాలేక జనసేన నేతలు చేతులు ఎత్తేశారు. దీంతో జన సైనికులపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! -
దాడి ఘటనపై మోదీ దిగ్బ్రాంతి
న్యూఢిల్లీ: గాజా ఆసుపత్రిలో బాంబు పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణలో సాధారణ ప్రజలు బలి కావడం దురదృష్టకరమని వాపోయారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇప్పటికైనా గాజాలో హింసకు తెరపడాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో బాంబు పేలుడుకు బాధ్యులైన వారిని తప్పనిసరిగా శిక్షించాలని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. -
తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? భారత్‌పై ప్రభావమెంత?
ఇటీవల భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తప్పుకుంది. అయితే అదేసమయంలో చైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ జి-20లో ప్రవేశించడం చైనా తనకు ఎదురుదెబ్బగా భావించింది. తాజాగా చైనా.. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా చైనా అవతరించింది. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పబోతోందని అర్థం. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపునకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనాతో ఆఫ్ఘనిస్థాన్ దోస్తీ ఆ దేశానికి కలిసివచ్చేలా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా మైత్రి భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. అయితే చైనా.. ఆఫ్ఘనిస్థాన్‌తో చెలిమి చేయడంపై ప్రపంచవ్యాపంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాగరిక పాలన సాగిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చైనా స్నేహం చేయడాన్ని ఏ దేశమూ ఇష్టపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా ఆధిపత్యం? వాస్తవానికి చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగు పెట్టింది. ఇది చైనా వ్యూహంలో ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా కూడా అదే పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోవాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో వైట్ గోల్డ్‌గా పిలిచే లిథియం నిల్వలపై చైనా దృష్టి సారించింది. చైనా.. ఆఫ్ఘనిస్తాన్‌లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కోటి ఆశలతో చైనాతో చెలిమి తాలిబాన్ అభిప్రాయం ప్రకారం చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. మరోవైపు చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం దరిమిలా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కాగా చైనా- తాలిబాన్ స్నేహం భారతదేశానికి పలు సమస్యలను తెచ్చిపెట్టనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతర్జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి కారణంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘనిస్థాన్‌లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి భారతదేశ అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చేయనున్నదనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది? -
అవి డొల్ల కమిటీలేనా?
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే పార్టీకి పోలింగ్‌బూత్ కమిటీలే బలమనుకుంటే.. చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేరని, కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా పనిచేయడం లేదని ముఖ్యనేతల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంగా వారు రూపొందించిన నివేదికల్లోనూ ఇదే విషయం బయట పడిందని వెల్లడైంది. ఈ నివేదికలు, ఇతరత్రా అందిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల తీరు గురించి క్రాస్ చెక్ చేసినపుడు కూడా ఇదే విషయం తేలడంతో పార్టీ ముఖ్యనేతలకు కలవరం మొదలైందని సమాచారం. బూత్ కమిటీల్లో చాలాచోట్ల పోలింగ్ బూత్ అధ్యక్షులే లేరని, ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో చాలామంది ప్రస్తుతం చురుకుగా పనిచేయకపోవడం, పలుచోట్ల బూత్ కమిటీ సభ్యులు కూడా మొక్కుబడిగా పనిచేయడం, పార్టీలో లేనివారి పేర్లు కమిటీల్లో చోటుచేసుకోవడం వంటివి బయటపడడంతో అర్జంట్‌గా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు 450 మంది.. రాష్ట్రంలో బూత్‌కమిటీల నియామకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి 19 రోజులపాటు రాష్ట్రంలో మూడుచోట్ల నుంచి బస్సు (రథ)యాత్రలు ప్రారంభించి, అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించి బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ బూత్‌కమిటీలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. బూత్ కమిటీలు సక్రమంగా లేకుండా బస్సుయాత్రలు ఎలా విజయవంతం అవుతాయని బన్సల్ రాష్ట్రనేతలను నిలదీసినట్టు తెలిసింది. దీనిని సీరియస్ తీసుకున్న బన్సల్.. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రెండేసి మండలాల చొప్పున పరిశీలించి నివేదికల సమర్పణకు 450 మందిని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. వారికి అప్పగించిన మండలాలలో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇన్చార్జి ఉన్నాడా, మండల కమిటీ ఉందా, ఎంత మందితో ఉంది.. వంటి అంశాలను వారు లోతుగా పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ సిద్ధం చేసిన నమూనాకు అనుగుణంగా పోలింగ్‌బూత్ అధ్యక్షులు, కమిటీలపై వీరు నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో మాట్లాడిన బన్సల్.. రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పక్షంలో పార్టీ మండలా«ద్యక్షులను కూడా మార్చాలని, బూత్‌కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్!
ఇంటిలో పనిచేసేందుకు వచ్చే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్లాంటి వారు ఒక్కోసారి ఆ ఇంటిలోని మహిళలను వేధించిన ఘటనలను మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కొందరు దుర్మార్గులయితే పెళ్లయిన మహిళలతో స్నేహం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన మెకియన్ మెక్క్రాకెన్ అనే మహిళకు విచిత్ర ఘటన ఎదురయ్యింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. మెకియన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కొలెటల్, మరిది డెవ్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి ఫర్నీచర్ స్టోర్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. స్టోర్‌లోని ఫ్యాను మరమ్మతు చేసేందుకు ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. నాటి అనుభవం గురించి మెకియన్ మాట్లాడుతూ ‘ఎలక్ట్రీషియన్ ఫ్యాను బాగు చేసేందుకు అనువుగా అక్కడి సోఫాను పక్కకు జరిపాను. అలాగే ఆ ఎలక్ట్రీషియన్‌కు సాయం చేసే ఉద్దేశంతో ఏమైనా కావాలా’ అని అడిగాను. దానికి ఆ ఎలక్ట్రీషియన్ సమాధానమిస్తూ ‘మీ ఆదేశాలను శిరసావహిస్తాను’ అని నెమ్మదిగా అన్నాడు. అయితే ఈ మాటను ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయింది. తరువాత ఎలక్ట్రీషియన్ బాత్రూమ్ వినియోగించుకునేందుకు ఆమె అనుమతి కోరాడు. తరువాత ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అయితే మీకు వివాహం జరిగిందని తెలిసి నా హృదయం ముక్కలయ్యింది. అయినా మీరు నాతో రావాలనుకుంటే వచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సోఫా కుషన్‌పై మీకోసం ఒక లెటర్ అతికించాను’ అని అన్నాడు. ఈ మాటలు విన్న మెకియన్ కంగారు పడిపోయింది. అతను పని ముగించుకుని వెళ్లేవరకూ వేచిచూసింది. అతను వెళ్లగానే కుషన్‌పై అంటించిన లెటర్ చదివింది. దానిలో.. ‘నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నీకు పెళ్లయినప్పటికీ, నాతో రావాలనుకుంటే వచ్చేయ్, నేను నీకు అన్ని ఆనందాలను అందిస్తాను’ అని ఉంది. ఈ విషయాన్ని మెకియన్ తన భర్తకు తెలియజేసింది. వెంటనే భర్త ఆ ఎలక్ట్రీషియన్‌ను నిలదీశాడు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్ మెకియన్కు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ పోస్టును చూసి యూజర్లు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్.. మీరు ఆ ఎలక్ట్రీషియన్ బాస్‌కు ఫిర్యాదు చేయాల్సింది అని సలహా ఇవ్వగా, మరొకరు ఆ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న కంపెనీ రివ్యూలో ఈ విషయాన్ని రాయాలని కోరారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ! -
పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలామంది తమకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తమ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను ఫేమస్ చేసేందుకు తపన పడుతుంటారు. పిల్లలు పుట్టినది మొదలు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చాలామంది తమకు పిల్లలకు పుట్టగానే వెంటనే ఫొటోతీసి, దానిని తమ చిన్నారి తొలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో అకౌంట్ క్రియేట్ చేసి, వారి ఫొటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుని.. న్యూయార్క్ పోస్టులోని ఒక రిపోర్టు ప్రకారం కత్రీనా స్ట్రోడ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తమకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్చేస్తూ వస్తోంది. తమ పిల్లలను సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుంది. కత్రీనాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 4 ఏళ్లు, కుమారునికి 3 ఏళ్లు. ఆమె తన ఇద్దరు పిల్లలను టిక్‌టాక్, ఇన్స్టాగ్రమ్లోఫేమస్ చేసింది. టిక్‌టాక్ యూజర్ చేసిన పనికి.. తమ పిల్లలను ఆడుకుంటున్నప్పటి ఫొటోలు, వీడియోలు, స్విమ్మింగ్ చేస్తున్నప్పటి వీడియోలను కత్రీనా తరచూ పోస్టు చేస్తుంటుంది. అయితే కత్రీనా 2022లో ఉన్నట్టుండి తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం మానివేసింది. టిక్‌టాక్ యూజర్ ఒకరు కత్రీనా కుమారుని ఫోటోను ఉపయోగించి, ఒక పోస్టు క్రియేట్ చేసి, ఆ పిల్లాడు తన కుమారుడు అని పేర్కొన్నాడు. చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని.. అమెరికాలోని కరోలినాలో ఉంటున్న కత్రీనా తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ ‘మా పిల్లల మాదిరిగానే చాలామంది పిల్లలకు ఇలాంటి ముప్పు ఎదురవుతోంది. చాలామంది సోషల్ మీడియాలో షేర్ అయ్యే చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నాన్నారని’ తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా తెలియజేశానని పేర్కొంది. కత్రీనా తాను ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన పనికి పశ్చాత్తాప పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి.. ఈ చేదు అనుభవం ఎదురైన తరువాత ఆమె సోషల్ మీడియాలోని తమ పిల్లల ఫొటోలను, వీడియోలను తొలగించింది. 2021లో అమెరికాకు చెందిన ఒక రిపోర్టు ప్రకారం 77శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. పలువురు కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి చిన్నారుల ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే కార్లు: ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!
ఆనాటి యుగం నుంచి నేటి వరకు మానవత్వాన్ని మంటగొలిపి, దిగ్బ్రాంతికి గురిచేసే ఎన్నో మారణకాండలు విచక్షణ రహితంగా జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో అంధకారంతో మూర్ఖత్వంతో దారుణమైనే ఊచకోతలు జరిగితే. నేడు అన్ని తెలిసి స్వార్థం అనే మాయ విశృంఖలమైన హత్యాకాండాలకు దారితీసింది. ఈ అమానీయకరమైన ఘటనలు మనిషన్నవాడు ఏమైపోయాడు అని తలెత్తే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో క్రూరమైన వధకు సంబంధించిన రక్త చరిత్రలు చూస్తే... ఆసియాటిక్ వెస్పర్స్ క్రీస్తూ పూర్వం జరిగిన ఘోరమైన మారణహోమం. దీన్ని సుదీర్ఘకాలం పాటు జరిగిన వధ ఆసియాటిక్ వెస్పర్స్గా పిలుస్తారు. పొంటస్ రాజ్య పాలకుడు మిత్రిడేట్స్VIకి విధేయులైన దళాలు, పశ్చిమ అనటోలియాలోని కొన్ని ప్రాంతాల్లో నివశిస్తున్న సుమారు 80 వేల మంది రోమన్, ఇతర లాటిన్ మాట్లాడే ప్రజలను ఊచకోత కోశాయి. దీంతో రోమన్, రిపబ్లిక్ పొంటస్ రాజ్యం మధ్య మిత్రిడాటిక్ యుద్ధానికి దారితీసింది. రైన్లాండ్ యూదుల ఊచకోత ఈ మారణహోమం 1096లో జరిగింది. జర్మన్ కైస్తవుల గుంపులను సాహుహికంగా చంపేశారు. దాదాపు ఈ ఘటనలో 12 వేల మంది చనిపోయారు. యూరోప్‌లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి లాటిన్ల ఊచకోత ఇది 1182లో జరిగింది. కాన్స్టాంటినోపుల్లోని తూర్పు ఆర్థోడాక్స్ జనాభా పొరుగున ఉండే రోమన్ కాథలిక్‌లపై తిరుగుబాటు చేయడంతో క్రూరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. దాదాపు 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పాశ్చాత్య, తూర్పు కైస్తవ చర్చిల మధ్య సంబంధాలను మరింత దిగజార్చి, శత్రుత్వాన్ని పెంచింది. లిస్బన్ ఊచకోత ఏప్రిల్ 19న 1506లో ఈ ఘటన జరిగింది. క్యాథలిక్‌లు చుట్టూ తిరిగే గుంపులను యూదులుగా ఆరోపించి వందలాదిమందిని దారుణంగా హింసించి చంపేశారు. దాదాపు 2 వేల మంది చనిపోయారు. పోర్చుగీస్ రాజధానిలో టోర్రేడో టోంబో నేషనల్ ఆర్కైవ్‌లో 1755లో సంభవించిన లిస్బన్ భూకంపంలో అగ్నిప్రమాదం నుంచి బయటపడిని కొన్ని చెక్కపెట్టేలో నాటి మారణకాండను వర్ణించే ఘటన బయటపడింది. దీన్ని జర్మన్ వుడ్కట్గా అభివర్ణించారు చరిత్రాకారులు. చోళుల ఊచకోత ఇది 1519లో జరిగింది. హెర్నాన్ కోర్టేస్(1487-15747) మెక్సికోను జయించాలనే తపనతో దారుమైన మారకాండకు ఒడిగట్టాడు. దీంతో నిరాయుధ అజ్టెక్ కులీనులు స్పానిష్ ఆక్రమణదారుల చేతుల్లో హతమయ్యారు. కోర్టెస్ త్లాక్స్కలన్ మిత్రుల సాయంతో చోళ్లును హతమార్చారు. దీంతో కొన్ని గంటల్లోనే చోళల నివాసులు వేలాదిమంది చనిపోయారు. సెయింట్ బర్తోమ్యూస్ డే మారణకాండ ఇది 1572లో జరిగింది. రోమన్ కాథలిక్ ప్రభువులు, ఇతర పౌరులు చేసిన సెయింట్ బార్తోమ్యూస్ డే మారణకాండ. ఫలితంగా వేలాదిమంది హ్యూగెనోట్లు (ఫ్రెంచ్ కాల్వినిస్ట్ ప్రొటెస్టంట్లు) మరణించారు. యాంగ్జౌ ఊచకోత ఇది 1645లో జరిగింది. చరిత్రలో జరిగిన అతి పెద్ద మారకాండగా దీన్ని పరిగణిస్తారు. మే 10, 1645న, డోడో, ప్రిన్స్ యు నేతృత్వంలోని క్వింగ్ రాజవంశం దళాలు యాంగ్జౌ నగరంపై దాడి చేశారు. పదిరోజుల జరిగిన ఆ దాడిలో దాదాపు 80 వేల మంది అమాయక పౌరులు చనిపోయారు. ప్రాగా ఊచకోత ప్రాగా ఊచకోత అనేది 1794లో కోస్కియుస్కో తిరుగుబాటు సమయంలో వార్సా శివారు ప్రాంతమైన ప్రాగాపై రష్యన్ దళాలు చేసిన దాడి. దీన్ని రెండవ వార్సా యుద్ధం అని కూడా పిలుస్తారు. బోస్టన్ ఊచకోత బోస్టన్ ఊచకోత అనేది మార్చి 5, 1770న పెద్ద సంఖ్యలో నిరాయుధ వలసవాదులపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడంతో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్య్రం కోసం లాబీయింగ్ చేయడానికి వచ్చిన ప్రచారకులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులను ప్రయోగించారు. పీటర్లూ ఊచకోత ఆగస్ట్ 16, 1819న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లోని సెయింట్ పీటర్స్ ఫీల్డ్‌లో పీటర్లూ హత్యాకాండ జరిగింది. దాదాపు 60 వేల మంది శాంతియుత ప్రజాస్వామ్య అనుకూల, పేదరిక వ్యతిరేక నిరసనకారుల గుంపులను చెదరగొట్టడానికి అశ్వికదళాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో 18 మంది చనిపోయారు. చియోస్ ఊచకోత గ్రీకు స్వాతంత్య్ర యుద్ధం (1821-1829) సమయంలో ఒట్టోమన్ దళాలు పదివేల మంది గ్రీకులు ఊచకోతకు గురయ్యారు. ఇది 1822లో గ్రీకు ద్వీపం చియోస్‌లో చరిత్రలోనే అత్యంత విషాదకరమైన దారుణ మారణకాండగా భావస్తారు చరిత్రకారులు. గాయపడిన మోకాలి ఊచకోత డిసెంబరు 29, 1890న సౌత్ డకోటాలోని గాయపడిన మోకాలి ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ దళాలు సుమారు 150 నుంచి 300 మంది లకోటా భారతీయులను వధించారు. ఆ ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో గాయపడిన మోకాలి మారణకాండ అని పేరు పెట్టారు. గాయపడిన మోకాలి యుద్దభూమిని చివరికి 1965లో యూఎస్ నేషనల్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్‌గా ప్రకటించారు. హమీడియన్ మారణకాండలు హమీడియన్ మారణకాండలు 1894- 1897 మధ్య ఒట్టోమన్ దళాలచే ఆర్మేనియన్లపై జరిగిన హింసాకాండకు సంబంధించినది. దీని ఫలితంగా 3 లక్షల మంది ప్రజలు మరణించారు. ఈ మారణహోమంపై సంతకం చేసిన సుల్తాన్ అబ్దుల్ హమీద్ II (1842–1918) పేరు మీద ఈ ఊచకోతకు పేరు పెట్టారు. విల్మింగ్టన్ ఊచకోత నవంబర్ 10, 1898న నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్లో పనిచేస్తున్న నల్లజాతీయుల యాజమాన్యంలోని వార్తాపత్రిక డైలీ రికార్డ్ కార్యాలయాలను తెల్లజాతి ఆధిపత్యవాదుల సాయుధ గుంపు తగలబెట్టింది. ఆఫ్రికన్-అమెరికన్ పౌరులు ప్రాణాల కోసం పారిపోవడంతో తిరుగుబాటుదారులు వీధుల్లోకి వెళ్లి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 300 మంది మిశ్రమ జాతి నివాసితులు ప్రాణాలు కోల్పోయారు. లుడ్లో ఊచకోత ఇది ఏప్రిల్ 20, 1914న కొలరాడోలోని లుడ్లో వద్ద జరిగింది. కొలరాడో నేషనల్ గార్డ్, ప్రైవేట్ కొలరాడో ఫ్యూయెల్ అండ్ ఐరన్ కంపెనీ గార్డులు సమ్మె చేస్తున్న బొగ్గు గని కార్మికులు వారి కుటుంబాలపై చేసిన దాడే లుడ్లో ఊచకోత. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 21 మంది మరణించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది బిలియనీర్ పారిశ్రామికవేత్త, బొగ్గు క్షేత్రాలను నిర్వహిస్తున్న యజమాని జాన్ డీ రాక్ఫెల్లర్ జూనియర్ . జలియన్‌వాలాబాగ్ ఊచకోత, 1919 జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోటలో 1919 ఏప్రిల్ 13న సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ వెయ్యి మందికి పైగా మరణించారు. రెండువేల మందికి పైగా గాయపడ్డారు. తుల్సా జాతి ఊచకోత తుల్సా, ఓక్లహోమాలోని గ్రీన్వుడ్ జిల్లా మే 31, 1921న శ్వేతజాతీయుల గుంపులు నల్లజాతి నివాసితులపై దాడి చేసి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేసింది. దీంతో యూఎస్ చరిత్రలో జాతి హింసకు సంబంధించిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా ఇది వర్ణించబడింది. దాదాపు 50 మంది శ్వేతజాతీయుల మాదిరిగానే రెండు వందల మంది రంగుల ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా. మరో 10,000 మంది ఆఫ్రికన్ అమెరికన్లు నిరాశ్రయులయ్యారు. తుల్సా జాతి ఊచకోత తుల్సా, ఓక్లహోమాలోని గ్రీన్వుడ్ జిల్లా మే 31, 1921న శ్వేతజాతీయుల గుంపులు నల్లజాతి నివాసితులపై దాడి చేసి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన యూఎస్ చరిత్రలో జాతి హింసకు సంబంధించిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా వర్ణించబడింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది శ్వేతజాతీయుల 200 నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. మరో 10 వేల మంది ఆఫ్రికన్ అమెరికన్లు నిరాశ్రయులయ్యారు. సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోత 20వ శతాబ్దంలో అత్యంత ఎక్కువగా ఆకర్షించిన హత్యాకాండల్లో ఒది ఒకటి. ప్రత్యర్థి ముఠాలోని ఏడుగురు సభ్యులపై చికాగో మాబ్స్టర్ అల్ కాపోన్ ఆదేశించిన దాడి. ఈ ఘటన జరిగిన ప్రాంతం 1967లో కూల్చేశారు. నాన్జింగ్ ఊచకోత 1937-38 డిసెంబరు-జనవరిలో చైనా నగరమైన నాన్జింగ్ నివాసితులపై ఇంపీరియల్ జపనీస్ దళాలు చేసిన దురాగతం ఇది. ప్రపంచ చరిత్రలో మానవాళికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద నేరాలలో ఒకటి. ఆ ఘటనలో చైనీస్ మృతుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. 1935లో ప్రిన్స్ యసుహికో అసకా (1887–1981) ఈ దాడిని ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి గానీ అతడిపై ఎలాంటి అరెస్టుల వంటివి జరగలేదు. కాటిన్ ఊచకోత రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక దురాగతాలు జరిగాయి, కానీ ఒక సింగిల్ సంఘటన ఊచకోత నిలుచింది. ఏప్రిల్ మరియు మే 1940లో ఎన్‌కేవీడీ సభ్యులు, సోవియట్ రహస్య పోలీసు స్మోలెన్స్క్ నగరానికి సమీపంలోని కాటిన్ ఫారెస్ట్‌లో 22 వేల మంది పోలిష్ సైనికాధికారులు, మేధావులను హత్య చేశారు. వారి సామూహిక సమాధులను 1943లో జర్మన్ దళాలు వెలికితీశాయి. 1990 వరకు నాజీలు ఊచకోతకు కారణమయ్యారు. చివరకు రష్యన్ అధికారులు ఈ నేరాన్ని అంగీకరించారు. ఒరాడోర్-సుర్-గ్లేన్ ఊచకోత ప్రతికార చర్య కారణంగా జరిగిన ఊచకోత. జూన్ 10 1944న నాజీలు ఫ్రెంచ్ గ్రామమైన ఒరడోర్ సుర్ గ్లేన్ నివాసితులను సందర్శించడమే ఈ ఘటనకు ప్రధాన కారణం. అక్కడ తమ ఫ్రెంచ్ నివాసితుల చేతిలో పట్టుబడ్డారని తెలియడంతో వాఫెన్ ఎస్ఎస్ యూనిట్ సభ్యులు 600 మంది నివాసితులను హతమార్చారు. దీంతో ఆ గ్రామం యుద్ధంతో అట్టుడికిపోయింది. దీని కారణంగా గ్రామం శిథిలంగా మారిపోయింది. ప్రస్తుతం దీన్ని శాశ్వత స్మారక చిహ్నంగా, మ్యూజియంగా మార్చాలని అధ్యక్షుడు చార్లెస్ డీ గల్లె ఆదేశించారు. మాల్మెడీ ఊచకోత వాఫెన్-ఎస్ఎస్ చేపట్టిన మరో దారుణ ఉదంతం ఇది. బెల్జియన్ నగరమైన మాల్మెడీ సమీపంలో డిసెంబర్ 17, 1944న 84మంది యూఎస్ ఆర్మీ యుద్ధ ఖైదీలను ఉరితీశారు హిల్ 303 ఊచకోత హిల్ 303 ఊచకోత అనేది దక్షిణ కొరియాలోని వేగ్వాన్ పైన ఉన్న కొండపై 40 మంది అమెరికన్ యుద్ధ ఖైదీలను కాల్చి చంపేశారు. ఇది ఉత్తర కొరియా సైనికులు చేసిన ఘోర యుద్ధ నేరం. షార్ప్‌విల్లే ఊచకోత షార్ప్‌విల్లే హత్యాకాండ మార్చి 21, 1960న దక్షిణాఫ్రికా టౌన్‌షిప్‌లోని షార్ప్విల్లేలోని ట్రాన్స్‌వాల్‌లోని పోలీస్ స్టేషన్లో (నేడు గౌటెంగ్‌లో భాగం) జరిగింది. పాస్ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 5 వేల నుంచి 7 వేల మంది నల్లజాతీయులు నిరసనలు చేయడంతో దక్షిణాఫ్రికా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ టవర్ మారణకాండ ఆగష్టు 1, 1966 ఉదయం, చార్లెస్ విట్మన్ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ టవర్ పైకి ఎక్కి.. క్రింద ఉన్న పాదచారులపై విచక్షణారహితంగా కాల్చడం ప్రారంభించాడు. ఆ రోజు మొత్తం 15 మంది మరణించారు. విట్మన్ తన తల్లి, భార్యని అంతకుముందే హత్య చేశాడు. చివరికి విట్మన్ను ఆస్టిన్ పోలీసు అధికారులు కాల్చి చంపారు. ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో బహిరంగ ప్రదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సామూహిక హత్యలలో ఒకటి. మై లై ఊచకోత యూఎస్ సైనిక చరిత్రలో జరిగిన అత్యంత అవమానీయకరమైన ఘటనలో ఒకటి ఇది. మార్చి 16, 1968న దక్షిణ వియత్నాంలోని మై లై గ్రామంలోకి ప్రవేశించిన సుమారు 500 మంది పురుషులు, మహిళలు, పిల్లలను అమెరికన్ సైనికుల సంస్థ ఊచకోత కోయడం జరిగింది. ఈ సంఘటన నవంబర్ 1969లో ప్రజలకు తెలిసినప్పుడు ప్రపంచ ఆగ్రహాన్ని ప్రేరేపించింది. బోగ్‌సైడ్ ఊచకోత బ్లడీ సండేగా ప్రసిద్ధి చెందింది. జనవరి 30, 1972 నాటి బోగ్‌సైడ్ మారణకాండలో 13 మంది నిరాయుధ పౌరులు ఉత్తర ఐర్లాండ్‌లోని డెర్రీలో బ్రిటిష్ ఆర్మీ సభ్యులు కాల్చి చంపారు. మ్యూనిచ్ ఊచకోత పాలస్తీనా టెర్రరిస్టు గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ సభ్యులు ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టులోని 11 మంది సభ్యులను బందీలుగా పట్టుకుని చంపేశారు. ఆ ఘటనలో అథ్లెట్లు ఫర్స్టెన్ఫెల్డ్బ్రక్ ఎయిర్ బేస్‌లో వారి బంధీలచే చంపబడ్డారు. సబ్రా, షటిలా ఊచకోత, 1982 బీరుట్‌లోని సబ్రా, షటిలా శరణార్థి శిబిరంలో లెబనీస్ దళాల మిలీషియా అనే ఆర్మీ ద్వారా 460 మంది ప్రజలను 3,500 మంది పౌరులును హతమార్చారు. వారిలో ఎక్కువగా పాలస్తీనియన్లు, లెబనీస్ షియాలు చనిపోవడంతో దీనిపై విస్తృతమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ ఊచకోత సెప్టెంబర్ 18, 1982న మిలీషియా మిత్రపక్షమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కనుచూపు మేరలో జరిగింది. స్రెబ్రెనికా ఊచకోత 1995 మారణహోమం బాధితుల కోసం స్రెబ్రెనికా-పోటోకారి మెమోరియల్ శ్మశానవాటికలో వేలకొద్దీ పారుల సమాధిగా ప్రతీకాత్మకంగా పేర్చబడి ఉన్నాయి. జూలై 1995 స్రెబ్రెనికా ఊచకోతలో వేలకు పైగా ఎక్కువ మంది ముస్లిం పురుషులు మరణించారు. వా పోర్ట్ ఆర్థర్ ఊచకోత ఏప్రిల్ 1996లో తాస్మానియాలోని పోర్ట్ ఆర్థర్‌లో మార్టిన్ బ్రయంట్ అనే ఒంటరి ముష్కరుడు హత్యాకాండకు దిగి 35 మందిని అంతమొందించాడు. అతను చివరికి సీస్కేప్ గెస్ట్‌హౌస్‌లో పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు స్మారక ప్రదేశం. ఈ ఘటన ఆధునిక ఆస్ట్రేలియాలో ఒకే వ్యక్తి చేసిన అత్యంత ఘోరమైన ఊచకోతగా మిగిలిపోయింది. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి
స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్స్పెక్షన్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఒక పోలీస్టేషన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్‌చేసి చూపించమంటే సదరు సబ్ఇన్స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. సదరు ఉన్నతాధికారి ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్‌కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్స్పెక్టర్పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
బాలయ్య సినిమాలు చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోలు
-
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్..
-
వెరైటీ లుక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ పరిశ్రమలో నటీనటులు ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. ఇక వారి వస్త్రాధరణ విషయానికొస్తే ట్రెండీ లుక్ కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాస్త ముందు వరుసలోనే ఉంటాడనే చెప్పాలి. రణ్వీర్ తన లుక్‌లో పరంగా ఎప్పటికప్పుడూ కొత్త దనం ఉండేలా జగ్రత్త పడుతుంటాడు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే తాజాగా మన హీరో ఓ కొత్త లుక్‌ని ట్రై చేశాడు. ఎంతలా అంటే చూసిన వాళ్లంతా షాకయ్యేలా. తాజాగా రణ్వీర్ సింగ్ ఇప్పుడీ లేటెస్ట్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. ఈ లుక్ కోసం.. బ్లూ కలర్ ట్రాక్‌సూట్, పొడవైన జుట్టు, ఓ లెదర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించాడు. దీనికి తోడు మెడలో భారీ సైజులోని నగలు వేసుకున్నాడు. నా ప్రియమైన అలెజాండ్రో అని ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టిన రణ్వీర్.. అలెజాండ్రో మిచెల్, గుచ్చిలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే బాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి కామెంట్లతో రణ్వీర్ నయా లుక్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలియా భట్ ఆశ్చర్య పోగా, హిస్టారిక్ అంటూ హిమేష్ రేషమియా అన్నాడు. అర్జున్ కపూర్ అయితే అతన్ని హాలీవుడ్ నటుడు జేరెడ్ లీటోతో పోలుస్తూ వీర్ లీటో అని కామెంట్ చేయడం విశేషం. ఇక అభిమానులైతే తమకు మరో మీమ్ పండుగ వచ్చిందని కామెంట్లు పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) చదవండి: Mandira Bedi: గుండె బద్దలైంది...సారీ మందిరా! -
బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రహస్య సమావేశం బట్టబయలు కావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. నిమ్మగడ్డను ఉపయోగించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెర వెనుక వ్యవహారాలు నడిపిన నేపథ్యంలో తమ గుట్టు రట్టు అయిందని టీడీపీ అధినాయకత్వంలో ఆందోళన మొదలైంది. నిమ్మగడ్డ పూర్తిగా తమ అధినేత కనుసన్నల్లో పని చేశారని, ఆయన తరపున కోర్టు కేసులను కూడా టీడీపీ నేతలే నడిపిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలు ఈ రహస్య భేటీతో నిజమని నిర్ధారణ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినట్లే నిమ్మగడ్డతో అనైతిక సంబంధం నెరుపుతూ చిక్కామని టీడీపీ నేతలు వాపోతున్నారు. బీజేపీలో ఉన్నా బాబు సన్నిహితులే.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నా వారిద్దరూ చంద్రబాబు సన్నిహితులనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డతో సమావేశం కావడం, అందులో తమ అగ్రనేత ఆన్లైన్ ద్వారా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఖండించడానికి సైతం టీడీపీ నేతలు ముందుకు రావట్లేదు. ‘ఫేస్‌టైమ్’ ద్వారా టీడీపీ అగ్రనేత ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడి కావడంపై ఆ పార్టీలో కలకలం మొదలైంది. రహస్య సమావేశం దృశ్యాలు బయటకు రావడంతో నిమ్మగడ్డ వ్యవహారంలో తాము చేస్తున్న వాదన అబద్ధమని ప్రజలకు తెలిసిపోయిందని, తెర వెనుక జరిపిన రాజకీయం బెడిసికొట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ఆవేదన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. నోరు మెదపని నేతలు.. ఈ రహస్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా సాయంత్రం వరకూ టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు ఈసారి స్పందించేందుకు ముందుకురాలేదు. సాయంత్రానికి వ్యూహాత్మకంగా దళిత నేత వర్ల రామయ్యను రంగంలోకి దించి మాట్లాడించారు. మాజీ మంత్రులు, చంద్రబాబు కోటరీ వ్యక్తులు, అధికార ప్రతినిధులెవరూ ఈ అంశంపై స్పందించలేదు. కాగా, కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్ల్లో నిమ్మగడ్డ, సుజనా, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయ్యారు. -
కరోనాను జయించాడు.. కానీ!
సియాటిల్: అమెరికాలోని సియాటిల్‌కు చెందిన మైఖేల్ ఫ్లార్ పేరు మీద ఇప్పుడు చాలా రికార్డులున్నాయి. ఒకటి, ఆయన 70 ఏళ్ల వయస్సులో కరోనాను జయించారు. రెండు, చాలా ఎక్కువ కాలం కోవిడ్–19తో పోరాడి, మృత్యువుపై విజయం సాధించారు. మూడు, కరోనా చరిత్రలోనే అత్యధిక మొత్తం బిల్‌ను ఆసుపత్రి నుంచి పొందారు. ఫ్లార్కు చికిత్స అందించిన ఇసాఖ్లోని స్వీడిష్ మెడికల్ సెంటర్, ఆయన చికిత్సకుగానూ 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8.35 కోట్లు. మరో రికార్డు కూడా ఉంది. ఆయన చికిత్స, అందుకైన ఖర్చు వివరాలను మొత్తం 181 పేజీల్లో పొందుపరిచి, ఒక పుస్తకంలా ఆయనకు అందించారు. ఫ్లార్ దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లి వచ్చాడు. ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు భార్య, పిల్లలకు చెప్పేశారు. నైట్ డ్యూటీ నర్స్ చివరి కాల్ అని చెప్పి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించింది. కానీ, కరోనాకు అంత ఈజీగా లొంగిపోదలచుకోలేదు ఫ్లార్. కరోనాతో 62 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు. ఆయనను వైద్యులు, ఇతర పేషెంట్లు అంతా ‘మిరాకిల్ చైల్డ్’ అనడం ప్రారంభించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత.. 181 పేజీల పుస్తకాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పంపించారు. ఆ పుస్తకంలో చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు 1.1 మిలియన్ డాలర్ల బిల్లు వివరాలు కూడా ఉన్నాయి. ఆ భారీ బిల్లు చూసి ఫ్లార్ అవాక్కయ్యారు. బిల్లు చూసి హార్ట్ అటాక్ వచ్చినంత పనయిందన్నారు. ‘బిల్లు భారీగా ఉంటుందనుకున్నాను కానీ.. ఇంత భారీగా ఉంటుందనుకోలేద’న్నారు. ఐసీయూలో ఫ్లార్ ఉన్న గది అద్దె రోజుకు 9,736 డాలర్లు. ఆ ఐసోలేషన్ చాంబర్లో ఆయన 42 రోజులున్నారు. అలాగే, 29 రోజులు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆ బిల్లు రోజుకు 2,835 డాలర్లు. మెడిసిన్స్ ఖర్చు మొత్తం బిల్లులో దాదాపు నాలుగో వంతు. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్న సమయంలో రెండు రోజుల పాటు అందించిన చికిత్స ఖర్చు లక్ష డాలర్లు. ఇలా అన్ని కలిసి మొత్తం బిల్లు 11 లక్షల డాలర్లయింది. అదృష్టవశాత్తూ, ఫ్లార్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో, బిల్లులో ఎక్కువ భాగం చెల్లించాల్సిన పనిలేదు. అలాగే, అది కోవిడ్–19 కనుక మొత్తం బిల్లు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. బిల్లును చూడగానే ఎలా ఫీల్ అయ్యారన్న ప్రశ్నకు.. ‘బతికినందుకు సిగ్గుగా అనిపించింది’అని జవాబిచ్చారు ఫ్లార్. -
పిఎస్బి స్కాంలో నీరవ్ మోదీకి షాక్
-
కర్ణాటకలో ‘ఈశాన్య’ ప్రకంపనలు
బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల్లో పరిణామాల ప్రభావం కర్ణాటక రాజకీయాలపై సాధారణంగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలే ఉండదు. కానీ, శనివారం నాటి పరిస్థితి వేరు. కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయారు. త్రిపురలో బీజేపీ ముందంజలో ఉందన్న వార్తలు రాగానే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప సహా నేతల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చూపంతా ఇక కర్ణాటకపైనే ఉంటుందనీ, తమకు అధికారం ఖాయమనీ వారికి నమ్మకం కలిగినట్లుంది. అయితే, త్రిపుర, నాగాలాండ్‌లలో తుడిచి పెట్టుకు పోవటం కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. త్రిపురలో తమ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీ దూకుడును మాణిక్‌సర్కార్ నిలువరిస్తారనీ, అదే మాదిరిగా కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలో తెస్తామనే ఆశ ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతల్లో ఉండింది. కానీ, తాజా ఫలితాలు వారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..గోవా, మణిపూర్‌లో మాదిరి రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషిస్తూ..ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను కర్ణాటకతో పోల్చి చూసుకోవటం సరికాదన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకపై ఎందుకు ఉండబోదో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. పంజాబ్‌లో అధికారంలో ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌కు కీలకం. ఇక్కడ అధికారం కోల్పోతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం చేజారటం ఖాయం. బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం! న్యూఢిల్లీ .. త్రిపురలో ఫలితాల ప్రభావం 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాల పైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నప్పటికీ.. 25 ఏళ్ల వామపక్ష కూటమిని కూలదోయటం ఇతర బీజేపీయేతర ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమబెంగాల్లో సీపీఎంకు ఆదరణ తగ్గిపోతుండటంతో.. బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. అయితే బెంగాల్ గడ్డపై మమత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓటు శాతాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఇన్నాళ్లు ఎదగలేదు. త్రిపురలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై ప్రభావం చూపనుంది. ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ లుక్–ఈస్ట్ పాలసీతో వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ నష్టపోతున్న ఓట్లు సీట్లు.. బీజేపీకి అదనపు బలంగా మారుతున్నాయి. ఇది మోదీ–షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహం కారణంగానే. అయితే మేఘాలయాలో హంగ్ పరిస్థితులనుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌ను రాహుల్ రంగంలోకి దించారు. -
భార్య కోసం ఐదేళ్లు వెతికితే.. భర్తకు షాక్!
దాదాపు ఐదేళ్లపాటు భార్య కనిపించకుండా పోయిందని వెతుకుతున్న భర్తకు ఆమె కనిపించడంతో పాటు ఊహించని షాక్ ఎదురైంది. బీహార్ లోని ముజఫర్ నగర్ కు చెందిన హతిమ్ అన్సారీ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన అమాన అనే మహిళతో ఐదేళ్ల క్రితం పెద్దలు అంగరంగ వైభవంగా పెళ్లి చేయించారు. పెళ్లయిన కొద్దిరోజుల వరకు గ్రామంలోనే ఉన్న అన్సారీ.. ఉద్యోగం కోసం భార్యతో కలిసి ఫరీదాబాద్ కు మకాం మార్చాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత వేరే వ్యక్తితో పరిచయం పెంచుకున్న అమాన.. కొన్నాళ్ల తర్వాత అతనితో వెళ్లిపోయింది. ఇది తెలియని అన్సారీ, తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. చివరకు అమాన చనిపోయిందని అందరూ అన్నా.. తాను మాత్రం నమ్మలేదు. అమాన తల్లిదండ్రులు కూడా అన్సారీనే ఆమెను చంపేసి శరీరాన్ని కనిపించకుండా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం జైలు శిక్షను సైతం అనుభవించాడు. అయినా, భార్య మీద ప్రేమ తగ్గకపోవడంతో ఆమె కోసం వెతుకులాటను ఆపలేదు. కొద్దిరోజుల క్రితం అమాన ఫరుఖాబాద్ లో కనిపించిందని దూరపు బంధువులెవరో పోన్ చేసి చెప్పడంతో సంతోషం పట్టలేకపోయిన అన్సారీ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అమాన ఇంటిపై దాడిచేసి ఆమె వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందని నిర్ధారించుకున్నారు. తన పేరు కూడా కాజల్ అని మార్చుకుందని చెప్పినట్లు అన్సారీకి తెలిపారు. అన్సారీతో జీవించడం ఇష్టం లేకపోవడం వల్లే బయటకు వచ్చేసినట్లు చెప్పినట్లు వివరించారు. దీంతో ప్రేమతో నిండిన అన్సారీ హృదయం ఒక్కసారిగా ముక్కలైంది. -
'భయపడలేదు.. షాక్ తిన్నా'
ముంబై: తనను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదని.. షాక్ కు గురయ్యానని టీవీ నటుడు, కమెడియన్ కికు శార్దా తెలిపాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కామెడీ షోతో పాపులరైన కికు... డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రామ్ రహీం సింగ్‌ను అనుకరించినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. 'పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేను ఒంటరిని. దీంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. తర్వాత రోజు ఉదయం ట్విటర్ ద్వారా క్షమాపణ కోరారు. నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే క్షమాపణ చెప్పాను, భయపడి కాదు' అని కికు శార్దా తెలిపాడు. ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతోనే అలా చేశానని, ఎవరినీ నొప్పించాలన్న భావన తనకు లేదని స్పష్టం చేశాడు. హర్యానాలోని పలు పోలీసు స్టేషన్లలో అతడిపై సెక్షన్ 295ఏ కింద కేసులు నమోదయ్యాయి. కాగా, కికు శార్దాకు సినిమా, టీవీ నటులు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. అతడి తప్పేమీ లేదని వెనుకేసుకొచ్చారు. -
శర్వానంద్ డైరెక్టర్‌కి షాకిచ్చాడట!
చెన్నై: 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి హిట్ చిత్రం ఇచ్చిన దర్శకుడుమేర్లపాక గాంధీ టాలీవుడ్ విలక్షణ హీరో శర్వానంద్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన అప్ కమింగ్ మూవీ 'ఎక్స్ ప్రెస్ రాజా' లో అద్భుతమైన నటనతో శర్వానంద్ తనను షాక్ కు గురి చేశాడన్నాడు. చాలా టాలెంటెడ్ యాక్టర్ అని తెలిసినా...సెట్లో తనను తానును ఇంత బాగా మలుచుకుంటాడని అస్సలు ఊహించలేదంటూ ఉబ్బితబ్బిబు అవుతున్నాడు. అమోఘమైన శర్వానంద్ పెర్ఫామెన్స్‌కు నిర్ఘాంతపోయానంటూ గాంధీ చెప్పుకొచ్చాడు. చాలా సన్నివేశాలలో అతని నటన తాను ఊహించినదానికంటే కూడా చాలా బావుందన్నాడు. శర్వానంద్ ని డైరెక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేశానంటున్నాడు. ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారంటూ పొగడ్తల్లో ముంచెత్తేశాడు. శర్వానంద్ లాంటి నటుడితో పనిచేయడం మంచి అనుభవాన్ని మిగిల్చిందని వ్యాఖ్యానించాడు దర్శకుడు. మరోవైపు కథను బట్టి సినిమాకు ఆ పేరు పెట్టాను తప్ప తనకు ' ఎక్స్ ప్రెస్' సెంటిమెంట్ లేదని స్పష్టం చేశాడు. అలాగే కథను బట్టి హీరో తప్ప, హీరోకు అనుగుణంగా కథ తయారు చేయడం తనకు నచ్చదని వ్యాఖ్యానించాడు. ప్రతి ఇరవై నిమిషాలకో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో , విభిన్నమైన కథనంతో తెలుగులో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా అందరినీ ఆకట్టుకోవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశాడు. కాగా జనవరి 14న సరిగ్గా సంక్రాంతి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ గా సురభి హరీష్ ఉత్తమన్, బ్రహ్మాజీ, పోసాని మురళి, తదితరులు నటించారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు శర్వానంద్. -
హాంకాంగ్ లో మరో బుక్ సెల్లర్ అదృశ్యం..!
హాంకాంగ్ లో తాజాగా మరో బుక్ సెల్లర్ అదృశ్యమయ్యాడు. పుస్తకాలు తెచ్చేందుకు గోడౌన్ కు వెళ్ళిన అతడు.. తిరిగి రాకపోవడంతో ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. చైనా ప్రధాన భూభాగానికి చెందిన కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా పుస్తకాలను ప్రచురించే పబ్లిషింగ్ హౌస్ నుంచి ఇటీవలి కాలంలో ఒక్కొక్కరుగా మాయమౌతుండటం.. ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించేందుకు ప్రయత్నించిన 'మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్' కు ప్రస్తుతం ఈ చేదు అనుభవం ఎదురైంది. మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అదృశ్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాక గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ వరుసగా వ్యక్తులు అదృశ్యం కావడం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో వ్యక్తి అదృశ్యంపై హాంకాంగ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కాస్ వే బే బుక్స్ షేర్ హోల్డర్... మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ ఉద్యోగి అయిన లీ బో... గత బుధవారంనుంచీ కనిపించడం లేదు. అతడు కంపెనీ వేర్ హౌస్ నుంచి పుస్తకాలు తెస్తానని చెప్పి వెళ్ళాడని, ఆ తర్వాత అతడి నుంచి తాను క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ కాల్ తప్పించి, మరే ఇతర సమాచారం లేదని అతడి భార్య చెప్తోంది. అతడు అదృశ్యమైన తర్వాత వచ్చిన ఫోన్ కాల్ షాంఘై నుంచి వచ్చిందని, ఆ సమయంలో ఎప్పుడూ తాము మాట్లాడే కాంటనీస్ లో మాట్లాడకుండా... అతడు మాండరిన్ భాషలో మాట్లాడాడని ఆమె చెప్తోంది. అయితే ఇటీవలి కాలంలో పబ్లిషింగ్ హౌస్ నుంచి వ్యక్తులు అదృశ్యమౌతుండటం ఆందోళన కలిగిస్తోందని, తాజాగా ఐదో వ్యక్తి లీ కనిపించకుండా పోవడం అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసిందని, భయానికి కూడా గురి చేసిందని డెమొక్రటిక్ పార్టీ చట్ట సభ్యుడు ఆల్బర్ట్ హో అన్నారు. ప్రభుత్వ విచారణకోసం అతడిని చైనా ప్రధాన భూ భాగానికి అక్రమంగా తరలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తులకోసం పోలీసులు విచారణ ప్రారంభించారు. -
బాబుకు భారీ షాక్
-
దిగ్భ్రాంతికి గురయ్యా!
‘ఝలక్ దిఖ్లా జా’ ఏడో సీజన్ నుంచి తప్పించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బాలీవుడ్ నటుడు పూరబ్ కోహ్లి పేర్కొన్నాడు. తన ప్రదర్శనకు న్యాయమూర్తుల చక్కని స్పందన వచ్చిందని, అయినప్పటికీ ఈవిధంగా జరుగుతుందని తాను ఊహించలేద ని ఈ ‘రాక్ ఆన్’ స్టార్ చెప్పాడు. ‘నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ షోలో చక్కని ప్రదర్శన ఇచ్చా. నా ప్రదర్శనకు న్యాయమూర్తులు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే డేంజర స్ జోన్‌కు రావడమే తీవ్ర నిరాశకు గురిచేసింది. 35 ఏళ్ల ఈ నటుడు తాను డేంజర స్ జోన్‌కు చేరుకున్నానని తెలియగానే డ్యాన్స్ స్టెప్పులను సైతం మరిచిపోయాడు. ‘ నా కొరియోగ్రాఫర్‌తో కలసి ఈ వారం సెమి క్లాసికల్ డ్యాన్స్ చేశా. అసలు నేనే స్టెప్పులు మరిచిపోయానా అని నాకు అనిపిస్తోంది. ఈ షోకోసం మేము తీవ్రంగా కష్టపడ్డాం. న్యాయమూర్తులనుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కూడా ఆశించాం.’ అంటూ పూరబ్ బాధపడ్డాడు. ఈ షోలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మరోసారి అవకాశమిస్తే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటానన్నాడు. శిక్షణ పొందిన నృత్యకారుడిని కాదని, అందువల్ల ఈ షోలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. కాగా ‘ఝలక్ దిఖ్లా జా’ షోలో ఇంకా 11 మంది సెలబ్రిటీ పోటీదారులు ఉన్నారు. వీరు తమ కొరియోగ్రాఫర్లతో కలసి ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఈ షోకు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.