యూపీలోని హత్రాస్‌లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.
ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0
— NDTV India (@ndtvindia) July 3, 2024
Comments
Please login to add a commentAdd a comment