యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు. సత్సంగం జరిగిన ప్రాంతానికి చెందిన తాజా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మౌనం తాండవిస్తోంది. నిన్న(మంగళవారం) జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 వేల మంది పాల్గొన్నారు.
#WATCH | Uttar Pradesh: Visuals from the incident spot where a stampede took place yesterday, claiming the lives of 116 people in Hathras.
The incident happened during a Satsang conducted by 'Bhole Baba'. pic.twitter.com/7wfXYFRHIO— ANI (@ANI) July 3, 2024
నారాయణ్ సకర్ విశ్వ హరిగా పేరొందిన భోలే బాబా సత్సంగ కార్యక్రమానికి హాజరైన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జీటీ రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
సత్సంగానికి పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడం, నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. కాగా యూపీ సీఎం యోగి ఈరోజు(బుధవారం) హత్రాస్ బాధితులను పరామర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment