బీహార్‌లోని జెహనాబాద్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతిచెందారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో ఆలయం చుట్టూ భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో తోపులాట జరగడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అలాగే పలువులు భయాందోళనలతో పరుగులు తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.
శ్రావణమాసంలో శివలింగాన్ని అభిషేకించేందుకు ఆలయానికి సుమారు 60 వేల మంది భక్తులు చేరుకున్నారు. పూల విక్రయదారునితో కొందరు భక్తులకు గొడవ జరిగిన దరిమిలా అక్కడి వాలంటీర్లు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఈ కేసులో ఒక పూల విక్రయదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ముగ్గురు పూల విక్రయదారుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారన్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతులు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
जहानाबाद: सिद्धेश्वर नाथ मंदिर में भगदड़ का VIDEO आया सामने
बिहार के जहानाबाद में बाबा सिदेश्वरनाथ मंदिर के भगदड़ का वीडियो आया सामने आया है, जहां अचानक मची भगदड़ की चपेट में आकर 7 लोगों की मौत हो गई थी.#bihar | #jehanabad | #jehanabadstampede | #video pic.twitter.com/dTB9wukSkP— NDTV India (@ndtvindia) August 13, 2024
Comments
Please login to add a commentAdd a comment