
పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో
చెన్నై: తమిళనాడు తిరుచ్చి సమీపంలోని ముత్యంపాలయంలో విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలోని కరుప్పస్వామి ఆయలంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని తురైయూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుప్పస్వామి ఆలయంలో ప్రతి ఏడాది చైత్రమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హుండీలోని చిల్లరను పంచడం(పడికాసు) ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.