Trichy
-
Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టు ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6— ANI (@ANI) October 11, 2024 There is no need to panic. Air India Express flight IX 613 is safely defueling by circling the airport, and once the fuel reaches the required level, a safe landing will be made. This is a standard safety procedure. #airindiaexpress #airindia #trichy #trichyairport pic.twitter.com/P8PDzhSfXJ— IOTA INFO (@iota_info) October 11, 2024అంతకు ముందు.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు. మిగతా విమానాలన్నీ ఇతర ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో హైఅలెర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బందని ఏర్పాటు చేశారు.విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుచ్చి గగనతలంపై తిరుగుతున్న విమానం 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ వైఫల్యం గురించి పైలట్ తిరుచ్చి ఎయిర్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు.#WATCH | Tamil Nadu: Air India flight from Trichy to Sharjah faced a technical problem (Hydraulic failure) and is rounding in air space to decrease the fuel before landing at Trichy airport. More than 20 Ambulances and fire tenders are placed at the airport to make sure no big… pic.twitter.com/rEiF6mSZz2— ANI (@ANI) October 11, 2024 -
వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ
చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్‌లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్‌ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి.. -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్‌కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్‌గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్‌ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్‌ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదరణ లభిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు చెక్‌పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్ కూడా సరికొత్తగా ప్రయాణికులకు ఈ-బైక్ రెంటల్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్ సర్వీసులను పొందవచ్చును. ఈ-బైక్ రెంటల్ సర్వీస్ ఎక్కడంటే..! తమిళనాడులోని తిరుచ్చి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంటల్ సేవలను దక్షిణ రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ బైక్ సర్వీసులపై భారీ స్పందన వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ-బైక్ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ-బైక్ సేవలను పొందాలంటే ముందుగా రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత గంటకు రూ.50 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.వాటితోపాటుగా ఆయా వ్యక్తి తన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పత్రాలు ఇస్తే ఈ బైక్ సేవలను పొందవచ్చును. తిరుచ్చి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన ఈ-బైక్ రెంటల్ సర్వీసులపై భారీ ఆదరణ వస్తోనట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్స్ రెంటల్ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చును. చదవండి: ఐఫోన్, ఐప్యాడ్, ఇప్పుడు ఐకార్..యాపిల్ నుంచి ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే.. -
త్వరపడండి: పద్యాలు చెప్తే లీటర్ పెట్రోల్ ఉచితం!
సాక్షి, చెన్నై: "సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు, పద్యం లేని సాహిత్యం" ఉండదని చెప్తుంటారు. కానీ ఇప్పుడు పద్యం, సామెతలను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఇంగ్లీషు గలగలా మాట్లాడే పిల్లలు పద్యాలు చదవమంటే నోరు తిరగడం లేదు, మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తున్నారు. నిరంతరం ఫోనులోనే ముఖం పెడుతూ దానికి బానిసలవుతున్నారు. ఈ వైఖరి భాషాభిమానులను, సాహిత్యారాధికుల మనసును కలిచి వేస్తోంది. దీంతో తమిళనాడుకు చెందిన కె సెంగుత్తువన్ ఓ అద్భుత ఉపాయం ఆలోచించాడు. అది కానీ అమల్లో పెడితే చచ్చినట్లు పద్యం నేర్చుకుని అప్పజెప్తారని భావించాడు. వెంటనే తన పెట్రోల్ బంకులో 'పద్యం చెప్పి పెట్రోల్ పట్టుకెళ్లు' అనే ఆఫర్‌ను ప్రకటించాడు. తిరుక్కురల్‌లోని 20 ద్విపద పద్యాలు చెప్తే ఒక లీటర్, 10 పద్యాలు చెప్తే అర లీటర్ పెట్రోల్ ఉచితమని వెల్లడించాడు. అసలే పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా పెట్రోల్ ఇస్తామంటే ఊరుకుంటారా! పిల్లలను కూర్చోబెట్టి మరీ పద్యాలు నేర్పించి నేరుగా కరూర్ జిల్లాలోని పెట్రోల్ పంపుకు తీసుకువెళ్తున్నారు. జనవరి 16న ప్రకటించిన ఈ ఆఫర్ ఏప్రిల్ 30తో ముగియనుంది. ఇప్పటివరకు 176 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఫ్రీ పెట్రోల్ ఆఫర్ గురించి సెంగుత్తువన్ మాట్లాడుతూ.. "లాక్డౌన్ వల్ల పిల్లలు ఫోన్లకు మరింత అతుక్కుపోయారు. వారు ప్రముఖ తిరుక్కురళ్ పద్యాలు నేర్చుకోవాలన్న కాంక్షతోనే ఈ ఆఫర్‌కు శ్రీకారం చుట్టాను. ఒకరికి ఒకసారి మాత్రమే ఫ్రీ పెట్రోల్ లాంటి ఆంక్షలేమీ లేవు. కాకపోతే రెండోసారి ఈ ఆఫర్ అందుకోవాలంటే మళ్లీ కొత్త పద్యాలు అప్పజెప్పాల్సిందే. తల్లిదండ్రుల భారాన్ని కొంతైనా తీర్చాలంటే పిల్లలు పద్యాలు కంఠస్తం చేయక తప్పదు మరి" అని చెప్తున్నాడు. చదవండి: వైరల్: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది! వెలుగులోకి వేల ఏళ్ల నాటి బీర్ ఫ్యాక్టరీ పేట్రేగుతున్న పెట్రోల్ దొంగలు -
దారుణం: 9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు...!
చెన్నై: సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 14 సంవత్సరాల బాలుడు అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించడంతో కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక మూడవ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదవండి: జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై అభం శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేసిన బాలుడు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెతోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపంతో బాలిక తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు గ్రామంలోకి వచ్చిన బాలుడు తోటలో బాలిక అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు బాలికను ఎమ్‌జీఎమ్‌జీహెచ్ ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. చదవండి: అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు -
శృంగార క్యాషియర్‌పై కేసు
తిరువొత్తియూరు: పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న క్యాషియర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుచ్చి జిల్లా మణప్పారై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకోటై విరాలిమలైలోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పలువురు స్త్రీలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. (శృంగార క్యాషియర్ ) దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బ్యాంకులో ఎడ్విన్ జయకుమార్ నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, అతను బ్యాంక్‌కు వచ్చే అందమైన మహిళల సెల్‌ఫోన్ నంబర్లను నోట్ చేసుకుని వారితో మాట కలిపి తన బుట్టలో వేసుకుంటాడని, తరువాత వారితో శృంగారాన్ని కొనసాగిస్తాడని తెలిసింది. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఓ మహిళను జయకుమార్ తన వైపు తిప్పుకుని ఆమెతో రాసలీలలు నడిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతని కోసం విచారణ చేస్తున్నారు. -
శృంగార క్యాషియర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు...ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్ఫోన్లు, వాటిల్లో జయకుమార్ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూములో వీడియోలు, ఎస్ఎంఎస్లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు, భర్త సోదరి, అత్తవారింటి ఇతర మహిళా బంధువులకు చెప్పుకుని విలపించింది. అయితే వారేమీ పట్టించుకోలేదు. అయితే తన అంతర్గత విషయాలను కుటుంబసభ్యులకు చెప్పిందని జయకుమార్ అగ్రహించి భార్యను తిట్టిపోశాడు. అంతేకాకుండా ‘నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు. అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్...భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్... కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అశ్లీల చిత్రాల వీక్షణ: రాజకీయ నేతల విచారణ!
సాక్షి, చెన్నై : ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు చూస్తున్న రాజకీయ నేతలు సహా 30 మంది వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటర్నెట్లో బాలబాలికల లైంగిక వీడియోల డౌన్లోడ్, షేర్ చేయడం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రథమస్థానంలో ఉన్నట్లు అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ఇటీవల సమాచారం అందింది. దీనిని రాష్ట్ర పోలీసులకు పంపిన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలకు నిరోధించే విభాగం అడిషనల్ డీజీపీ రవి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి వీక్షించే వారి ఐపీ అడ్రస్సులు తమ వద్ద ఉన్నాయని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో సెల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలను, వీడియోలను వీక్షించే వారి మధ్య కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో తిరుచ్చిలో బాలికల అసభ్య వీడియోలను డౌన్లోడ్ చేసి స్నేహితులకు షేర్ చేసిన నేరానికి తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అనే యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి పాలకరై ఖాజాపేట కొత్త వీధికి చెందిన ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. క్రిష్టోఫర్ ఐపీ అడ్రస్ ఆధారంగా తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి పోలీసు కమిషనర్ వరదరాజు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కమిషనర్ మణికంఠన్, ఇన్స్పెక్టర్ ఆనంద వేదవల్లి... క్రిష్టోఫర్ వద్ద తీవ్ర విచారణ జరిపి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. క్రిష్టోఫర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. చదవండి: అశ్లీల వీడియోల షేరింగ్ వ్యక్తి అరెస్టు కాగా గత నాలుగేళ్లుగా క్రిష్టోఫర్ ఈ పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. అతని వద్ద నుంచి 150 ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ స్నేహితులు టచ్‌లో వున్నట్లు తెలిసింది. 42 ఏళ్ల క్రిష్టోఫర్ ఈ వీడియోలను వీక్షించడంతో మానసిక రోగిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అతడి ఫోన్, మెమెరీ కార్డులను చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక అందగానే విచారణ తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. కిష్ట్రోఫర్ 150 మంది స్నేహితుల జాబితాలను తిరుచ్చి – చెన్నై, చెంగల్పట్టు, కోవై జిల్లాల పోలీసులకు తిరుచ్చి పోలీసులు పంపారు. ఈ జిల్లాలోని స్నేహితుల వద్ద విచారణ జరుగుతోంది. తిరుచ్చిలో రాజకీయ ప్రముఖులు, స్నేహితులు సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం క్రిష్టోఫర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్రంలో అశ్లీల వీడియోలను చూసే వారిని పోక్సో చట్టంలో అరెస్టు చేయడం ఇదే ప్రప్రథమం. -
కరుప్పస్వామి ఆలయంలో విషాద ఘటన...
చెన్నై: తమిళనాడు తిరుచ్చి సమీపంలోని ముత్యంపాలయంలో విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలోని కరుప్పస్వామి ఆయలంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని తురైయూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుప్పస్వామి ఆలయంలో ప్రతి ఏడాది చైత్రమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హుండీలోని చిల్లరను పంచడం(పడికాసు) ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. -
ప్రజా ప్రతినిధులు నడిరోడ్డు మీదే కుమ్ములాట ..
-
నడిరోడ్డు మీదే ప్రజా ప్రతినిధుల కొట్లాట..
సాక్షి, చెన్నై : తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయులు నడిరోడ్డుపై బాహీబాహీకి దిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. అందులోనూ ఇరు పార్టీలకు చెందిన ఎంపీ, జిల్లా కార్యదర్శి రోడ్డుపై కొట్టుకోవటం తిరుచ్చి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే... తిరుచ్చి జిల్లా పొన్మలైలో బస్టాండ్ షెల్టర్ నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు గత ఐదేళ్లుగా స్థానిక అన్నాడిఎంకె ఎంపీ కుమార్‌ను కోరుతున్నారు. అయితే ఆయన వద్ద నుండి స్పందన రాకపోవటంతో స్థానిక డీఎంకె ఎమ్మెల్యే అన్బిల్ మహేష్ తన నిధులతో బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్ భవనం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక డీఎంకే కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీ కుమార్ కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకుని బస్టాండ్ షెల్టర్‌ను ప్రారంభించటానికి వీలులేదని డీఎంకే వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయి షెల్టర్‌ను కూల్చివేయడమే కాకుండా డీఎంకే వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ కుమార్, డీఎంకే జిల్లా కార్యదర్శి, ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు నడిరోడ్డుపై రౌడీల్లా కొట్టుకోవటం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తుంది. రెండుసార్లు ఎంపీగా ఉన్న కుమార్ తమ ప్రాంతానికి ఎటువంటి సాయం చేయకపోగా డీఎంకే చేస్తున్న సాయాన్ని అడ్డుకోవటంతోపాటు వారిపై దాడులకు పాల్పడటంపై స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికార బలంతో అన్నాడీఎంకే వర్గీయులు ఇటువంటి దాడులకు పాల్పడటంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుచ్చి జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ
-
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ
సాక్షి, చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులోని 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడం జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. గోడకు కన్నం పెట్టిన దుండగులు బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోని ప్రవేశించినట్టుగా తెలుస్తోంది బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వెనక భాగంలో వెల్డింగ్ మిషన్‌తోపాటు పలు పరికరాలను పోలీసులు గుర్తించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నారు. బ్యాంకు సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. -
తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లోకి...
సాక్షి, చెన్నై: తండ్రి లేకుండా బిడ్డ..? మద్రాస్ హైకోర్టు చొరవతో టెక్నికల్‌గా ఇది సాధ్యమయ్యింది. తమిళనాడులో వీర్య దాత ద్వారా బిడ్డను కన్న ఓ తల్లి.. బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరును తొలగించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దీంతో చిన్నారి తావిషి పెరారా దేశంలో ‘తండ్రి లేని బిడ్డగా’ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... త్రిచీకి చెందిన మధుమిత రమేష్ అనే మహిళ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారం మేర విడిపోయారు. ఆపై కొన్నిరోజుల తర్వాత వీర్యం డోనర్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో మధుమిత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే త్రిచీ కార్పొరేషన్ అధికారులు మాత్రం బిడ్డ తండ్రిగా వీర్యదాత మనిష్ మదన్‌పాల్ మీనా పేరును బర్త్ సర్టిఫికేట్లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధుమిత.. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాల్సిందిగా అధికారులకు అర్జి పెట్టుకుంది. పేర్లలో తప్పులను మాత్రమే సవరించే వీలుందని, అంతేగానీ ఏకంగా పేరునే తొలగించే అవకాశం లేదని అధికారులు ఆమెకు బదులిచ్చారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి తిరస్కరించటంతో మరోసారి ఆమె కోర్టు తలుపు తట్టారు. అదే సమయంలో ఆమె మాజీ భర్త చరణ్ రాజ్, వీర్యపు డోనర్ మనీష్‌లు ఇద్దరూ ఆ బిడ్డకు తాము తండ్రులం కాదంటూ అఫిడవిట్లు దాఖలు విశేషం. చివరకు మధుమిత అభ్యర్థనను అంగీకరించిన బెంచ్.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని త్రిచీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తద్వారా తావిషి తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లో నిలిచిపోనుంది. -
ఫ్లెక్సీ రచ్చ
ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల సంస్కృతి మరోమారు రచ్చకెక్కింది. వీటిని అరికట్టడంలో పాలకుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వమే ఈ ఫ్లెక్సీలతో హంగామా సృష్టిస్తుంటే, ఇక, ఎలా అడ్డుకట్ట వేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. తిరుచ్చి వేదికగా హంగామా సాగడంపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రంలోగా ఒక్క ఫ్లెక్సీ, బ్యానర్ ఉండేందుకు వీలు లేదని తొలగించాల్సిందేనన్న ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్ సంస్కృతి ఎక్కువేనన్న విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలే కాదు, సంఘాలు, సంస్థలు, ఏ చిన్న వేడుకైనా సరే హంగామా చేయాల్సిందే. వీటికి అడ్డుకట్ట వేసే విధంగా ఏళ్ల తరబడి సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పోరాడుతూనే వస్తున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు వీటి తొలగింపు విషయంగా పలుసార్లు ఉత్తర్వులు, ఆదేశాలు జారీచేసినా ఫలితం శూన్యం. రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ అయితే, తీవ్రంగానే స్పందించారు. ఫ్లెక్సీ, బ్యానర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేశారు. అనేక రకాల ఆంక్షలు విధించడంతో పాటు, ఇష్టారాజ్యంగా ఏర్పాటుచేసే వాటిమీద పరిశీలించి, అందుకు తగ్గ చర్యలు తీసుకునేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృ త్వంలో ఓ కమిటీ నియమకానికి తగ్గ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఖాతరు చేయని రాజకీయ పక్షాలు ప్రైవేటు ఫ్లెక్సీ, హోర్డింగ్, బ్యానర్ల వ్యవహారంలో నిబంధనలు తప్పని సరిగా అమల్లో ఉన్నా, రాజకీయ పక్షాలు మాత్రం ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. దీంతో ఎక్కడ ఫ్లెక్సీ, బ్యానర్ కనిపించినా, స్వయంగా వాటిని తొలగించే పనిలో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీఆర్ శత జయంతి పేరుతో సాగుతున్న వేడుకల్లో ప్రభుత్వ హంగామా మళ్లీ ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల వ్యవహరాన్ని రచ్చకెక్కెలా చేశాయి. రెండు రోజుల క్రితం న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ అయితే, ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌లలో బతికే ఉన్న వాళ్ల ఫొటోల్ని పొందుపరిచేందుకు వీలు లేదని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, తిరుచ్చి వేదికగా పాలకులు హంగామా సృష్టిస్తూ గత రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని బెంచ్ ముందుకు గురువారం చేరింది. తీవ్రంగా పరిగణన గురువారం హైకోర్టులో ఫ్లెక్సీల వ్యవహారంగా రెండు బెంచ్‌ల ముందు విచారణలు సాగాయి. ఇందులో ఒకటి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా. మరొకటి ప్రభుత్వమే హంగామా సృష్టించడం. బతికి ఉన్న వాళ్ల ఫొటోలను పొందు పరచవద్దని జారీచేసిన ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ తరఫున అత్యవసర పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగాయి. అయితే, హైకోర్టు నిరాకరించడమే కాకుండా, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు లేదని ఏకీ భవిస్తున్నామని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణ ముగియగానే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన ప్రభుత్వం తరఫు హంగామా గురించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈసందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తిరుచ్చిలో అనుమతులతోనే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎంజీఆర్ జయంతి వేడుకల నిమిత్తం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రభుత్వం తరఫున 200, బయటి వ్యక్తులు 20 ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి పొందినట్టు పేర్కొన్నారు. 220కు అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ వందలాదిగా ఎలా ఏర్పాటు చేస్తారని న్యాయమూర్తులు సుందరేష్, సుందర్‌ల నేతృత్వంలోని బెంచ్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. ప్రభుత్వ వేడుకలకు ఇంత అవసరమా? ప్రభుత్వమే ఫ్లెక్సీలతో ఇలా హంగామా చేస్తుంటే, ఇక, బయటి వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించవా.?, అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేడుకలకు ఇంత హంగామా అవసరమా..? అన్న ప్రశ్నలు ఇరకాటంలో పడేశాయని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నల వర్షంతో, చివరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణకు నిర్ణయించడం గమనార్హం. దీంతో తిరుచ్చిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను శుక్రవారం సాయంత్రంలోపు తొలగిస్తామని ప్రభుత్వం తరఫున కోర్టుకు న్యాయవాదులు హామీ ఇచ్చారు. తొలగించాల్సిందేనని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేశారు. ఆరోజున సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా, ఇదివరకు న్యాయమూర్తి సుందరేష్, సుందర్ పలుమార్లు ఈ వ్యవహారాలపై ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తాజాగా, సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కలిసి విచారించనున్న దృష్ట్యా, కీలక ఆదేశాలు, తీవ్ర హెచ్చరికలు సంధించే అవకాశాలు ఎక్కువే. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
సాక్షి, త్రిచి: ముంబైలో 110 ఏళ్ల ఐదంస్తుల పాత భవనం కూలిన దుర్ఘటన మరచిపోక ముందే తమిళనాట మరో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని త్రిచి పట్టణంలో మూడంతస్తుల పాత భవనం ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 11 మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. శుక్రవారం ముంబైలో భవనం కూలిన ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 14 మందికి గాయాలయ్యాయి. -
నవ వరుడు సహా ముగ్గురు హత్య
సాక్షి, తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చి సమీపాన నవ వరుడు సహా ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. తిరుచ్చి తిరువానైకావల్ సమీపాన కల్లనై రోడ్డులో ఆదివారం ఉదయం ముగ్గురు యువకుల మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులు తిరువానైకావల్ కలంజియ పురానికి చెందిన జేసీబీ ఆపరేటర్లుగా తేలింది. మృతులలో ఒకరు తిరువానైకావల్ కలంజిపురానికి చెందిన వేలు (26), అదే ప్రాంతానికి చెందిన అనసూయ (19)ను ప్రేమించాడు. ఇద్దరూ వేర్వేరు కులాల వారు కావడంతో వివాహానికి అనసూయ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల సాయంతో వివాహం చేసుకుని కోవిలడి ప్రాంతంలో నివసిస్తున్నారు. మిగతా మృతులను శంకర్ (35), పుదుకోటై అనైవాసల్కు చెందిన లోకనాథంగా గుర్తించారు. అనసూయను పోలీసులు విచారించగా శనివారం రాత్రి ఫోన్ చేసి వస్తానని చెప్పిన వేలు ఇంటికి రాలేదని తెలిపింది. వీరిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఫేస్బుక్ సెల్ఫీతో బుక్కయ్యాడు!
తిరుచ్చి: భార్యకు హత్య చేసి పారిపోయిన భర్త ఏడేళ్ల తర్వాత అనుహ్యంగా పట్టుబడ్డాడు. ఫేస్బుక్ లో సెల్ఫీ పోస్టు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మణి(45) తన భార్యతో కలిసి తమినాడులోని అరియలూర్ జిల్లా నన్నియూరులో కాపురం పెట్టాడు. మణి తరచుగా తన భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. 2009, ఆగస్టులో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంలో భార్య గొంతు కోశాడు. తర్వాత అక్కడి నుంచి చెన్నెకు పారిపోయాడు. కందస్వామిగా పేరు మార్చుకుని తొండియార్ పేటలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నాడు. అయితే కేరళలో పనిచేస్తూ తమ కొడుకు మృతి చెందాడని పోలీసులతో మణి తల్లిదండ్రులు నమ్మబలికారు. అయితే ఫేస్బుక్ లో మణి సెల్ఫీ చూసిన అతడి బంధువు షాక్ తిన్నాడు. మరో నలుగురితో కలిసి మణి పనిచేస్తున్న హోటల్ కు వెళ్లాడు. వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారి అనుమానం నిజమైంది. మణి బతికే ఉన్నాడని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారని అరియలూర్ డీఎస్పీ పి. ముత్తుకరప్పన్ తెలిపారు. బుధవారం అతడిని అరియలూర్ కు తరలించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు తిరుచ్చి సెంట్రల్ జైలులో ఉన్నాడు. -
నేడు తిరుచ్చికి రాహుల్
సాక్షి, చెన్నై : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం తిరుచ్చిలో పర్యటించనున్నారు. పొన్మలై జీ కార్నర్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు లక్ష మందికి అనుమతి కల్పించి ఉన్నారు. అలాగే, డెల్టా అన్నదాతలతో ప్రత్యేకంగా రాహుల్ భేటీ కానున్నారు. రాహుల్ రాకతో తిరుచ్చి నగరాన్ని భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం, తమ బలాన్ని చాటుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సిద్ధం అయ్యారు. బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగడంతో పాటుగా తమ యువరాజు రాహుల్ రాష్ట్రంలో పలు మార్లు పర్యటనలు చేపట్టే రీతిలో కార్యచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా డెల్టా అన్నదాతల కన్నీటి గోడును పరిగణలోకి తీసుకుని , వారికి భరోసా ఇచ్చే రీతిలో తిరుచ్చి వేదికగా బహిరంగ సభకు నిర్ణయించారు. ఇందు కోసం తిరుచ్చి పొన్మలైలోని జీకార్నర్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఇక్కడ రాహుల్ రాక కోసం సర్వం సిద్ధం చేశారు. నేడు రాహుల్ రాక: రాహుల్ రాకను పురస్కరించుకుని జీకార్నర్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు.తమ యువ రాజు దృష్టిలో పడే రీతిలో పలువురు నేతలు హంగు ఆర్బాటాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. అలాగే, వేదికపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో పాటుగా మరో ముగ్గురు నాయకుల్ని మాత్రమే అనుమతించనున్నారు. రాహుల్ ప్రసంగించేందుకు వీలుగా బుల్లెట్ ఫ్రూఫ్‌తో కూడిన అద్దాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. అలాగే, మైదానంలోకి నాయకులు వచ్చేందుకు ఓ మార్గం, కార్యకర్తలు వచ్చేందుకు మరో మార్గం సిద్ధం చేశారు. ఈ మార్గాల్లో మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ అనంతరం ప్రతి ఒక్కర్నీ అనుమనిస్తారు. లక్ష మందిని మాత్రమే మైదానంలోకి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. రాహుల్ రాకను పురస్కరించుకుని కేంద్ర భద్రతా బృందం ఐజీ రావత్ నేతృత్వంలో 14 మంది అధికారులు తిరుచ్చికి చేరుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తిరుచ్చి జిల్లా పోలీసు యంత్రాంగం నేతృత్వంలో 2500 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. రాహుల్ పర్యటన సాగే అన్ని ప్రాంతాల్ని బుధవారం ఈ బృందం పరిశీలించింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలు దేరి తిరుచ్చి విమానాశ్రయం చేరుకునే రాహుల్‌కు ఘన స్వాగతం పలకడంతో పాటుగా, దారి పొడవునా ఆహ్వానాలు పలికే రీతిలో కాంగ్రెస్ వర్గాలు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. తిరుచ్చి విమానాశ్రయం నుంచి పుదుకోట్టై రోడ్డు మీదుగా పొన్మలై జీ కార్నర్ మైదానానికి సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ చేరుకుంటారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, అన్నదాతల్ని ఉద్దేశించి బహిరంగ సభలో రాహుల్ ప్రసగించనున్నారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయం వెళ్లే మార్గంలో పదమనల్లూరులోని ఫాంహౌస్‌లో అన్నదాతలతో భేటీ అవుతారు. ఈ భేటీ నిమిత్తం 250 మంది రైతుల్ని ఎంపిక చేశారు. ఈ భేటీ ముగియగానే రాహుల్ ఢిల్లీకి బయలు దేరి వెళ్తారు. -
తీహార్ జైలుకు ఖైదీలను తరలించేందుకు చర్యలు
యానాం టౌన్, న్యూస్‌లైన్ : యానాం ప్రత్యేక సబ్‌జైలు, పుదుచ్చేరి కాలాపేట సెంట్రల్ జైల్లో ఉన్న కరడుగట్టిన ఖైదీలను తమిళనాడులోని తిరుచ్చి జైలుకు లేదా తీహార్ జైలుకు పంపేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వంతో పుదుచ్చేరి ఉన్నతాధికారులు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. తిరుచ్చి జైలుకు తరలించేందుకు వీలులేని పక్షంలో తీహార్ జైలుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుదుచ్చేరిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఖైదీల తరలింపుకు చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 29న యానాం ప్రత్యేక సబ్ జైలులోకి కొందరు దుండగులు ఒక జీవిత ఖైదీని హతమార్చే ఉద్దేశంతో చొరబడిన విషయం విదితమే. పోలీసులు చాకచక్యంగా కొన్ని గంటలలోనే 13 మందిని పట్టుకున్నారు. వీరిని పుదుచ్చేరి కాలాపేట కేంద్ర కారాగారానికి తరలించారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న మరో వ్యక్తిని కర్ణాటకలో పట్టుకున్నారు. యానాం సబ్‌జైల్‌పై దాడి నేపథ్యంలో ఈ జైలులో ఉన్న కరడుగట్టిన ముగ్గురు జీవిత ఖైదీలను వేరే ప్రాంతానికి తరలించాలని యానాం ప్రజలు కోరారు. వీరు ఇక్కడే ఉంటే యానాం ప్రశాంతవాతావరణానికి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు దీనిపై పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంతో నెలాఖరులోగా వీరిని తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు దిగజారడంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన స్వయంగా కాలాపేట కేంద్రకారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉండటాన్ని గుర్తించిన ఆయన భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ జైల్లోని కొందరు ఖైదీల ఆగడాలు మితిమీరుతున్నందున వీరిని తీహార్ జైలుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరితో పాటు యానాం సబ్జైల్లో ఉన్న ఇద్దరు జీవిత ఖైదీలను కూడా తరలించడానికి నిర్ణయించింది.