
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
సాక్షి, త్రిచి: ముంబైలో 110 ఏళ్ల ఐదంస్తుల పాత భవనం కూలిన దుర్ఘటన మరచిపోక ముందే తమిళనాట మరో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని త్రిచి పట్టణంలో మూడంతస్తుల పాత భవనం ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 11 మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. శుక్రవారం ముంబైలో భవనం కూలిన ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 14 మందికి గాయాలయ్యాయి.