గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఎగబడుతున్న జనాలు..! | Southern Railway First E-Bike Rental Service At Trichy Railway Station Getting Huge Response | Sakshi
Sakshi News home page

గంటకు రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఎగబడుతున్న జనాలు..!

Published Sun, Dec 12 2021 8:20 AM | Last Updated on Sun, Dec 12 2021 9:42 AM

Southern Railway First E-Bike Rental Service At Trichy Railway Station Getting Huge Response - Sakshi

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీ ఆదరణ లభిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు చెక్‌పెడుతూ ఎలక్ట్రిక్‌ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడకంలో తెచ్చేందుకుగాను భారతీయ రైల్వేస్‌ కూడా సరికొత్తగా ప్రయాణికులకు ఈ-బైక్‌ రెంటల్‌ బైక్‌ సర్వీసులను ప్రారంభించింది. గంటకు రూ. 50 చెల్లిస్తే ఈ బైక్‌ సర్వీసులను పొందవచ్చును. 

ఈ-బైక్‌ రెంటల్‌ సర్వీస్‌ ఎక్కడంటే..!
త‌మిళ‌నాడులోని తిరుచ్చి రైల్వే స్టేష‌న్‌లో ఎల‌క్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంట‌ల్ సేవలను ద‌క్షిణ రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ బైక్‌ సర్వీసులపై భారీ స్పందన వస్తోంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ-బైక్ రెంట‌ల్ స‌ర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ-బైక్‌ సేవలను పొందాలంటే ముందుగా  రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత గంట‌కు రూ.50 రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.వాటితోపాటుగా ఆయా వ్య‌క్తి త‌న ఆధార్ కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ప‌త్రాలు ఇస్తే ఈ బైక్‌ సేవలను పొందవచ్చును.

తిరుచ్చి రైల్వే స్టేషన్‌ తీసుకొచ్చిన ఈ-బైక్‌ రెంటల్‌ సర్వీసులపై భారీ ఆదరణ వస్తోనట్లు తెలుస్తోంది. రైల్వే ప్ర‌యాణికులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఈ-బైక్స్ రెంటల్‌ సేవలను వాడుకోవచ్చునని తిరుచ్చి రైల్వే స్టేషన్‌ అధికారులు వెల్లడించారు. ఈ బైక్‌ను ఒక్క‌సారి ఛార్జ్‌ చేస్తే 130 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించవచ్చును. 
 

చదవండి: ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఇప్పుడు ఐకార్‌..యాపిల్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement