
హైదరాబాద్: ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున మొత్తం 3 షోరూమ్‌లను ప్రారంభించింది. వీటిలో సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒక్కో కొత్త షోరూమ్‌లో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగ్రవాల్ తెలిపారు.
రోర్ ఈజెడ్ వాహనం ధర రూ. 89,999గా ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి ఇస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50 నగరాల్లో 100 పైచిలుకు షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 35 షోరూమ్‌లు ఉన్నాయి.
ఒబెన్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 15 కొత్త షోరూమ్‌లను ప్రారంభించగా పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అడుగు పెట్టింది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లలో తన పరిధిని బలోపేతం చేసుకుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్‌లలో కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించింది.