
ఎలక్ట్రిక్ బైక్‌లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.
ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్
అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్‌నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.
7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్‌లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్‌ను రూపొందించారు.
షాక్‌వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్
టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్‌ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

షాక్‌వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్‌తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment