న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.
జీరో మోటర్‌సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్, పవర్‌ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్‌లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.
వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment