
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఎట్టకేలకు తన క్లాసిక్ 650 (Royal Enfield Classic 650) బైకును లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 3.37 లక్షల నుంచి రూ. 3.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2025 ఏప్రిల్ నుంచి మొదలవుతాయి.
మొత్తం నాలుగు రంగులలో లభించే.. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ 648 సీసీ ఇంజిన్ ద్వారా 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉండే ఈ బైక్.. కొంత షాట్‌గన్ బైకును తలపిస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.7 లీటర్లు. ఈ బైక్ బరువు 243 కేజీలు.
ఇదీ చదవండి: భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లు
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్.. సాధారణ 350 సీసీ బైకులోని ఫీచర్స్ కాకుండా, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌తో పాటు డిజి-అనలాగ్ డిస్‌ప్లే పొందుతుంది. USB ఛార్జర్ కూడా లభిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఫీచర్ క్లాసిక్ 650లో ఉంటుంది. అంతే కాకుండా 2025 క్లాసిక్ 650 బైక్ 19/18 ఇంచెస్ ట్యూబ్డ్ వైర్-స్పోక్ వీల్స్ పొందుతుంది.