మార్కెట్లో మరో పవర్‌ఫుల్‌ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా? | Royal Enfield New Interceptor Bear 650 Launched | Sakshi
Sakshi News home page

మార్కెట్లో మరో పవర్‌ఫుల్‌ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?

Published Tue, Nov 5 2024 3:10 PM | Last Updated on Tue, Nov 5 2024 3:26 PM

Royal Enfield New Interceptor Bear 650 Launched

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తరువాత.. 650 సీసీ విభాగంలో మరో బైక్ లాంచ్ చేసింది. 'ఇంటర్‌సెప్టర్ బేర్ 650' పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా నిర్మితమైన ఈ బైక్ స్క్రాంబ్లర్ బైక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఆ రెండు బైకుల ఫీచర్స్ ఈ ఒక్క బైకులోనే గమనించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్, సైడ్ ప్యానెల్స్‌పై నంబర్ బోర్డ్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నీ కూడా ఈ బైకును చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ 130 మిమీ ట్రావెల్‌తో 43 మిమీ షోవా యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్‌, వెనుకవైపు 115 మిమీ ట్రావెల్‌తో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్‌ వంటివి పొందుతుంది. ఈ హిమాలయన్ బైకులో కనిపించే ఫుల్ కలర్డ్ TFT స్క్రీన్ కూడా ఇందులో చూడవచ్చు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌ బైంక్‌ లాంచ్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

648 సీసీ ఇంజిన్ కలిగిన ఇంటర్‌సెప్టర్ బేర్ 650.. 47 Bhp పవర్, 57 Nm టార్క్ అందిస్తుంది. 216 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పుడు డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement