Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
కొత్త బైక్ కోడ్‌నేమ్
ట్విన్-సిలిండర్ ఇంటర్‌సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ స్పేస్‌లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్‌నేమ్‌తో ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా వివిధ మార్కెట్‌లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్‌సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్‌లోని టెక్ సెంటర్‌లో లీడ్ డెవలప్‌మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద మోటార్‌సైకిల్‌గా అవతరించే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్)
నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్‌తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment