![Ducati Hypermotard 698 Mono launched Price And Details](/styles/webp/s3/article_images/2024/07/15/ducati-bike.jpg.webp?itok=Q0aZYYBC)
డుకాటి భారతదేశంలో హైపర్‌మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్‌మోటార్డ్ 950 ఆర్‌విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
హైపర్‌మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్‌పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్‌తో ఇంజిన్‌లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్ లాంచ్ చేసింది.
డుకాటీ లాంచ్ చేసిన హైపర్‌మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, హై ఫ్రంట్ మడ్‌గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment