
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన కార్ల ధరలపై 2 శాతం పెంపును ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' వెల్లడించారు.
ప్రస్తుత ఆడి ఇండియా లైనప్‌లో ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ క్యూ8, క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ ఉన్నాయి. 2025 మే 15నుంచి వీటన్నింటి ధరలు పెరుగుతాయి. వేరియంట్ వారీగా కొత్త ధరలు త్వరలోనే అందుబాటులో వస్తాయి.
ఇదీ చదవండి: రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..
2025లో ఆడి ఇండియా ధరలను పెంచడం ఇది రెండోసారి. జనవరిలోనే కంపెనీ మొదటిసారి ధరలను పెంచింది. ధరల ప్రభావం కార్ల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయం తెలియాల్సి ఉంది.