Audi cars
-
ఈ దొంగ యమా రిచ్!.. ఆడి కారు.. ఖరీదైన ఫ్లాటు..
సాక్షి, హైదరాబాద్: రోహిత్ కనూభాయ్ సోలంకి..ముంబై శివార్లలో రూ.కోటి ఖరీదైన ఫ్లాట్‌లో నివసిస్తుంటాడు. ఆడి హైఎండ్ కారులో సంచరిస్తుంటాడు. ఓ నగరాన్ని టార్గెట్ చేసుకుంటే అక్కడకు వెళ్లి స్టార్ హోటల్లో బస చేస్తాడు. సంపన్నుల ప్రాంతాలను గూగుల్ ద్వారా గుర్తిస్తాడు. అక్కడ పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లల్లో రాత్రిళ్లు పంజా విసరుతాడు. ఈ ఖరీదైన దొంగను గత వారం గుజరాత్‌తోని వల్సాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇక్కడి పోలీసులకు త్వరలో సమాచారం ఇవ్వనున్నట్లు వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సోలంకి ప్రస్తుతం ముంబ్రాలోని ఖరీదైన సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. తన పేరును అర్హాన్గా మార్చుకున్న ఇతగాడు ఓ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్తూ... కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నాడు. క్యాంపుల పేరుతో తరచు ఇల్లు వదిలి వెళ్లే ఇతగాడు కేవలం ప్రధాన నగరాలనే టార్గెట్‌గా చేసుకుంటాడు. విమానంలో అక్కడకు చేరుకుని స్టార్ హోటల్లో బస చేస్తాడు. గూగుల్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తాడు. హోటల్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకునే ఇతగాడు పగటి పూటి అందులోనే తిరుగుతూ తాను ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లోకి షేర్ చేసుకుంటాడు. రాత్రి వేళ కాలినడకన బయలుదేరి..సమీపంలోని ఏదో ఒక దుకాణం నుంచి చిన్న రాడ్డు, స్క్రూడ్రైవర్ వంటివి ఖరీదు చేస్తాడు. వీటిలో టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగులకొట్టి నగదు, సొత్తు స్వాహా చేస్తాడు. చోరీ సొత్తును తీసుకుని మాత్రం రైలులోనే ముంబైకి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేలోపే దాన్ని అమ్మి, క్యాష్ చేసుకుని, బ్యాంక్ ఖాతాలో వేసుకుంటాడు. ఇలా గడిచిన కొన్నాళ్లల్లో గుజరాత్‌లోని వల్సాద్, వాపి, సూరత్, పోర్బందర్, సెల్వాల్లతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ల్లో 19 నేరాలు చేశాడు. వీటిలో రెండు హైదరాబాద్‌లో చేసినవే. వల్సాలో జరిగిన వాపిలో జరిగిన రూ.లక్ష నగదు చోరీ కేసును వల్సాద్ జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు సోలంకి బస చేసిన హోటల్, ప్రయాణించిన విమానం టిక్కెట్ తదితర వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ముంబ్రాలోని అతడి ఫ్లాట్ వద్ద కాపుకాసిన పోలీసులు గత వారం అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు ముంబైలోని నైట్ క్లబ్స్‌లో భారీ మొత్తం ఖర్చు చేస్తాడని తేలింది. మాదకద్రవ్యాలకు సైతం అలవాటుపడి బానిసగా మారిన సోలంకి ఏకంగా నెలకు రూ.1.5 లక్షలు వాటికే వెచి్చస్తాడని పోలీసులు గుర్తించారు. వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ...‘రోహిత్ సోలంకిని విచారించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌ల్లో రెండేసి చోరీలు చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అయితే ఏ ప్రాంతంలో చేశాడనేది అతడు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఆయా నగరాల్లో సంచరించిన తేదీలతో పాటు ఇతర వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నాం. ఆపై ఆ అంశాలకు అక్కడ పోలీసులకు తెలుపుతాం. డ్రగ్స్‌కు బానిసైన సోలంకిని రీహాబ్కు పంపాలని యోచిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఆడి కార్ల అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో కార్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఈ జనవరి –సెప్టెంబర్ మధ్య 88% వృద్ధితో మొత్తం 5,530 కార్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 2,947 కార్లను డెలివరీ చేసింది. క్యూ8 ఈ–ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ–ట్రాన్, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్లతో పాటు ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలిపింది. ‘‘ఎస్‌యూవీల విభాగపు అమ్మకాల వృద్ధి 187% నమోదైంది. రానున్న పండుగ సీజన్ కారణంగా నెలకొనే డిమాండ్‌తో ఈ ఏడాది మొత్తం విక్రయాల వృద్ధిని కొనసాగిస్తాము’’ అని ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరణతో పాటు మెరుగైన ఆర్థిక స్థితిగతులు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమయ్యాయని బల్బీర్ సింగ్ వివరించారు. -
మీకు తెలుసా.. ఈ ఆడి కార్ల ధరలు పెరగనున్నాయ్!
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన జర్మన్ బ్రాండ్ 'ఆడి' 2023 మే 01 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలు వచ్చే నెల ప్రారభం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్ఎస్ 5, ఎస్ 5 ధరలు ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా వచ్చే నెల ప్రారంభం నుంచి మరో రెండు మోడల్స్ ధరలు పెరుగుతాయి. ఆడి కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ వివిధ స్థాయిలలో ధరల ప్రభావాన్ని కస్టమర్ల మీద పడకుండా చూడటానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ధరలను పెంచాల్సిన అవసరం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడళ్ల ధరలను ఏప్రిల్ 01 నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెంచింది. -
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
అడ్వాన్స్ బుకింగ్.. ముందుగా రూ.5 లక్షలు చెల్లించండి
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించం ఉత్సాహంగా ఉన్నట్టు పేర్కొంది. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్‌పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
అదిరిపోయిన ఆడి క్యూ5.. బీఎండబ్ల్యూ ఎక్స్3కి పోటీగా!
ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్లరీ కార్ల తయారీ సంస్ల ఆడి ఈరోజు భారతదేశంలో ఆడి క్యూ5ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల క్రితం బిఎస్ 6 నిబంధనల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి వైదొలగిన క్యూ5 ఫేస్ లిఫ్ట్ ఎస్యువి కారు కొత్త అవతారంలో తిరిగి వచ్చింది. కంపెనీ 2021 ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ఎస్‌యువిని రూ. 58.93 లక్షల(ఎక్స్ షోరూమ్)కు, ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 63.77 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇప్పటికే వినియోగదారులు వందకు పైగా యూనిట్లు బుక్ చేసినట్లు, డెలివరీలు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆడి ధృవీకరించింది. ఆడి క్యూ5 ఎస్యువి కారు బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ జిఎల్ సి, వోల్వో ఎక్స్ సీ60 వంటి కార్లకు పోటీనిస్తుంది. భారతదేశంలో ఐసీఈ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త క్యూ5 దోహదపడుతుందని ఆడి భావిస్తోంది. దీనిలో 2.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 249 బిహెచ్పీ శక్తిని, 370 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇది క్వాటో ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ, డంపర్ కంట్రోల్‌తో సస్పెన్షన్ సిస్టమ్ మెరుగైన డ్రైవ్ డైనమిక్లతో వస్తుంది. నిలువు స్టట్లతో కూడిన సింగిల్ఫ్రేమ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్లు, ఎల్ఈడీ లైట్లు, ఆడి క్యూ-5కి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. (చదవండి: ‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’) ఆడి పార్క్ అసిస్ట్, సెన్సార్ కంట్రోల్డ్ బూట్ లిడ్ ఆపరేషన్‌తో కూడిన కంఫర్ట్ క్హీ ఆడి ఎక్స్‌క్లూజివ్ పియానో బ్లాక్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ఫ్లస్, 19 స్పీకర్ B&0 ప్రీమియం 3డీ సౌండ్ సిస్టమ్‌తో సహా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్ & కనెక్టివిటీ, వైర్లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఆడి ఫోన్ బాక్స్, MMI టచ్‌తో MMI నావిగేషన్ ఫ్లస్ సిస్టమ్ ఇందులో ఉంది. అడి డ్రైవ్ సెలెక్ట్ సౌకర్యం, డైనమిక్, వ్యక్తిగత, ఆటో, సామర్థ్యం, ఆఫ్-రోడ్‌తో సహా బహుళ మోడ్‌లను అందిస్తుంది. భద్రత కోసం వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ ఎస్యువి కారు గంటకు 237 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.ఎఆర్ఎఐ సర్టిఫై చేసిన ప్రకారం లీటరుకు 17.01 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) -
ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ "ఆడి" భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై అధిక పన్ను విధించడం అనేది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను అడ్డుకోవడం అని పేర్కొంది. అలాగే, సుంకాల పరంగా కొంత ఉపశమనం కలిగిస్తే మరిన్ని వాహనాలను విక్రయించడానికి, స్థానిక తయారీ కోసం దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది. పీటీఐతో ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. దేశంలోకి దిగుమతి చేసుకున్న మొదటి సెట్ ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ విక్రయించినట్లు పేర్కొన్నారు.(చదవండి: నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు!) "దేశంలోకి తీసుకువచ్చిన మొదటి ఈ-ట్రాన్లు అన్నీ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందుకే, భవిష్యత్ లో ఇలాంటి కార్లను మరిన్ని తీసుకొనిరావడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని ఆయన పేర్కొన్నాడు. "ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంటే బహుశా మేము దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించవచ్చు" అని ధిల్లాన్ చెప్పాడు. "దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మా అభ్యర్థన, 3-5 ఏళ్ల వరకు కొంత ఉపశమనం ఇస్తే, స్థానికంగా కార్లను తయారు చేయడానికి దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా ప్రధాన కార్యాలయాన్ని ఒప్పించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు. -
జనవరి నుంచి ఆడి కార్ల ధరల పెంపు
ముంబై: అన్ని రకాల మోడళ్లపై 2 శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ ఆడి తెలిపింది. పెంచిన ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. రూపాయి బలహీనత, పెరిగిన ఇన్పుట్ వ్యయాల దృష్ట్యా ధరల్ని పెంచుతున్నట్లు కంపెనీ వివరించింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సిన్హా దిల్లాన్ మాట్లాడుతూ... కస్టమర్లకు మేలిరకమైన మోడళ్లను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, అయితే పెరిగిన ఇన్పుట్ వ్యయాలు, రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో ధరల్ని సవరించక తప్పడం లేదన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా రాబోయే వేరియంట్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దామని దిల్లాన్ తెలిపారు. స్కోడా ఆటో నుంచి అద్దెకు కార్లు ముంబై: స్కోడా ఆటో కంపెనీ అద్దెకు కార్లను ఇచ్చే ‘‘క్లవర్ లీజ్’’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా తన రాపిడ్, సూపర్బ్ మోడళ్లను 2 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో నెలకు రూ.22,580 ప్రారంభ ధరగా అద్దెకు ఇవ్వనుంది. కార్పొరేట్, రిటైల్ కస్టమర్లకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రాథమికంగా ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ వివరించింది. రోడ్ ట్యాక్స్, బీమా, యాక్సిడెంటల్ రిపేర్లు, ఎండ్–టు–మెయింటెనెన్స్, వెహికల్ రిప్లేస్మెంట్ లాంటి అన్ని ప్రయోజనాలు, సరీ్వసులు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. -
బెజవాడలో లగ్జరీ కార్లు రయ్...రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లగ్జరీ కార్లు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కార్ల కంపెనీల దృష్టి రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా ఆయా కంపెనీలు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, జాగ్వార్, లాండ్ రోవర్, ఫోక్స్‌వ్యాగన్ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్ ఇప్పటికే రాష్ట్రంలో షోరూంలు ఏర్పాటు చేశాయి. గత నవంబర్‌లో జాగ్వార్, లాండ్ రోవర్ మంగళగిరి సమీపంలో షోరూమ్‌లు ఏర్పాటు చేయగా, త్వరలో విజయవాడ సమీపంలో ఆడీ మరోషోరూమ్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆడీ మోటార్స్‌కు విశాఖపట్నంలో షోరూమ్ ఉంది. ఇవికాకుండా మరికొన్ని లగ్జరీ బ్రాండ్లు షోరూమ్‌లు ఏర్పాటు చేయడానికి మార్కెట్ సర్వే చేస్తున్నాయి. గణనీయంగా అమ్మకాలు: రాష్ట్రంలో ఏటా లగ్జరీ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత లగ్జరీ కార్లవైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల అమ్మకాల్లో 15 శాతం నుంచి 16 శాతం వృద్ధి ఉండగా రాష్ట్రంలో 20 నుంచి 30 శాతం వరకు వృద్ధి నమోదవుతోందని డీలర్లు అంటున్నారు. గతేడాది రాష్ట్రంలో అన్ని లగ్జరీ కార్లు కలిపి సుమారు 600కు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో అత్యధిక వాటా మెర్సిడెస్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్లదే. గతేడాది రాష్ట్రంలో 200 మెర్సిడెస్ బెంజ్, 160 ఆడీ, 131 బీఎండబ్ల్యూ కార్లు అమ్ముడైనట్లు ఆయా డీలర్లు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది చివరలో ప్రవేశించిన జాగ్వార్, లాండ్ రోవర్‌కు కూడా స్పందన బాగానే ఉన్నట్టు లక్ష్మీ అనికా మోటార్స్ ఎండీ కె.జయరామ్ చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా కార్ల అమ్మకాలు కొద్దిగా తగ్గాయని కార్ల కంపెనీల డీలర్లు అంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది రాష్ట్రంలో 400 బెంజ్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యంలో సగం మాత్రమే చేరుకున్నట్లు మహావీర్ మెర్సిడెస్ బెంజ్ చైర్మన్ యశ్వంత్ జబక్ తెలిపారు. గతేడాది 160 ఆడీ కార్లు, 131 బీఎండబ్ల్యూ కార్లను అమ్మినట్లు బీఎండబ్ల్యూ ప్రతినిధి రవికిరణ్ రెడ్డి పేర్కొన్నారు. -
మార్కెట్లోకి ఆడి కొత్త ఎడిషన్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘క్యూ7’, సెడాన్ ‘ఏ6’లలో ‘డిజైన్ ఎడిషన్స్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.81.99 లక్షలు, రూ.56.78 లక్షలుగా ఉన్నాయి. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఇండియావి. క్యూ7 డిజైన్ ఎడిషన్‌లో 249 హార్స్పవర్ (హెచ్‌పీ)తో కూడిన 3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 7.1 సెకన్లలో అందుకుంటుందని, దీని గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లని వివరించింది. ఇక ఏ6 డిజైన్ ఎడిషన్‌లో 190 హెచ్పీతో కూడిన 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా కొత్త ఎడిషన్లను ఆవిష్కరించినట్లు ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారి తెలిపారు.