మార్కెట్‌లోకి ఆడి కొత్త ఎడిషన్స్‌ | new audi car in market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ఆడి కొత్త ఎడిషన్స్‌

Published Fri, Aug 18 2017 12:20 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

మార్కెట్‌లోకి ఆడి కొత్త ఎడిషన్స్‌

మార్కెట్‌లోకి ఆడి కొత్త ఎడిషన్స్‌

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ ‘క్యూ7’, సెడాన్‌ ‘ఏ6’లలో ‘డిజైన్‌ ఎడిషన్స్‌’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.81.99 లక్షలు, రూ.56.78 లక్షలుగా ఉన్నాయి. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఇండియావి. క్యూ7 డిజైన్‌ ఎడిషన్‌లో 249 హార్స్‌పవర్‌ (హెచ్‌పీ)తో కూడిన 3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 7.1 సెకన్లలో అందుకుంటుందని, దీని గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లని వివరించింది. ఇక ఏ6 డిజైన్‌ ఎడిషన్‌లో 190 హెచ్‌పీతో కూడిన 2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా కొత్త ఎడిషన్లను ఆవిష్కరించినట్లు ఆడి ఇండియా హెడ్‌ రాహిల్‌ అన్సారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement