
గుర్జంత్ గోల్‌తో నెగ్గిన టీమిండియా
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.
మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment