
ఎఫ్‌ఐహెచ్ ప్రొలీగ్‌లో భారత హాకీ జట్లకు విజయాలు
4–0తో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన పురుషుల జట్టు
1–0తో జర్మనీపై మహిళల జట్టు విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్‌గోల్‌తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్‌దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు.
మ్యాచ్‌లో భారత్‌కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.
దీపిక గోల్‌తో భారత్ గెలుపు
మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది.
పెనాల్టీ కార్నర్‌ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment