FIH
-
నెదర్లాండ్స్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్‌డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్‌ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. -
జోరు కొనసాగించాలని...
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా... సోమవారం తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత అంచె పోటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్... తాజా సీజన్లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 13 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో ‘ప్లేస్’లో ఉంది. స్పెయిన్, జర్మనీతో మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత జట్టు... ఐర్లాండ్‌పై మాత్రం సమష్టిగా సత్తా చాటింది. అదే స్ఫూర్తి ఇంగ్లండ్‌పై కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, నీలమ్, అభిషేక్, షంషేర్ సింగ్ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. డిఫెన్స్‌లో భారత్ బలంగా కనిపిస్తోంది. తాజా సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన టీమిండియా ఇప్పటి వరకు ప్రత్యర్థులకు కేవలం 8 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొమ్మిది జట్లలో ఇదే అతి తక్కువ కావడం మన రక్షణ శ్రేణి పటుత్వాన్ని చాటుతోంది. అయితే పెనాల్టీ కార్నర్లను సది్వనియోగ పరుచుకోవడంపై మరింత దృష్టి సారిస్తేనే ఇంగ్లండ్‌పై విజయం సాధ్యమవుతుంది. నెదర్లాండ్స్‌ను నిలువరించేనా.. మహిళల ప్రొ లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న భారత జట్టు... సోమవారం డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భారత అంచె పొటీలను ఘనవిజయంతో ప్రారంభించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఆసాంతం అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్లో 6 మ్యాచ్‌లాడిన మన అమ్మాయిలు 2 విజయాలు, 3 పరాజయాలు, 1‘డ్రా’తో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు.మరోవైపు 15 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్ రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో జర్మనీపై సాధించిన స్ఫూర్తితో సమష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై 5–1, 6–0తో విజయాలు సాధించిన నెదర్లాండ్స్ జట్టు టీమిండియాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత పటిష్ట జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. వాళ్లతో మ్యాచ్ కఠినమైందని తెలుసు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. జర్మనీపై విజయం ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని భారత సారథి సలీమ చెప్పింది. 2013 నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య 7 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టీమిండియా నెగ్గగా... మరొకటి ‘డ్రా’ అయింది. -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్‌గోల్‌తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్‌లో భారత్‌కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్‌తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్‌ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
జగజ్జేత జర్మనీకి భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్‌నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్‌గోల్‌తో నవ్‌నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్‌కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్‌లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్‌ప్రీత్ అన్నాడు. లీగ్‌లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్‌తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్‌తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్‌తో... 24, 25న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్‌లో అన్నీ మ్యాచ్‌లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్‌ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
ప్రొ లీగ్‌తో భారత హాకీ జట్ల ఆట షురూ
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్‌తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ‘ఢీ’ కొట్టనుంది. ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్‌లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్‌లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.11 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తవడంతో ఫైనల్స్‌కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి. -
‘ఫైవ్స్ వరల్డ్ కప్’లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఎఫ్ఐహెచ్ అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్‌లోని మస్కట్‌లో జనవరి 24నుంచి 27 వరకు జరుగుతుంది. గోల్‌కీపర్ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టుకు మహిమా చౌదరి వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా...బన్సారి సోలంకి, అక్షతా అబాసో ఢేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్ ఖాన్, అజ్మినా కుజుర్, రుతుజ దాదాసొ పిసాల్, దీపిక సోరెంగ్ ఇతర జట్టు సభ్యులు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘సి’లో భారత్‌తో పాటు నమీబియా, పోలండ్, అమెరికా ఉన్నాయి. ఫిజి, మలేసియా, నెదర్లాండ్స్, ఒమన్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28నుంచి 31 వరకు జరిగే పురుషుల ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్‌లో భారత సారథిగా సిమ్రన్‌జిత్ సింగ్ ఎంపికయ్యాడు. సూరజ్ కర్కేరా, ప్రశాంత్ కుమార్, మన్దీప్ మోర్, మంజీత్, రాహీల్, మణీందర్, పవన్ రాజ్‌భర్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ జట్టులో ఇతర సభ్యులు. -
హార్దిక్, సవితలకు ఎఫ్ఐహెచ్ అవార్డులు
లుసానే (స్విట్జర్లాండ్): భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, సవిత పూనియాలు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళల కెపె్టన్ అయిన సవిత ‘ఎఫ్ఐహెచ్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో హ్యాట్రిక్ కొట్టింది. సవిత 2021, 2022లలో కూడా ఈ అవార్డును అందుకుంది. ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు మ్యాచ్‌లు, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 33 ఏళ్ల సవిత చక్కని ప్రదర్శన కనబరిచింది. అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలుపడంలో కీలకపాత్ర పోషించింది. జనవరిలో రాంచీలో జరిగే ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యంగా సవిత జట్టును నడిపించనుంది. భారత పురుషుల జట్టులో స్టార్ మిడ్‌ఫీల్డర్‌గా ఎదిగిన హార్దిక్ సింగ్ పోరాటపటిమను ఎఫ్ఐహెచ్ గుర్తించింది. అతను ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అతనికి లభించిన రెండో అవార్డు ఇది! హాకీ ఇండియా (హెచ్ఐ) నుంచి ‘బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కూడా అందుకున్నాడు. -
భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఫుల్టన్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్‌ను నియమిస్తున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించారు. 48 ఏళ్ల ఫుల్టన్ దక్షిణాఫ్రికా తరఫున 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రీడాకారుడిగా రిటైరయ్యాక కోచింగ్‌వైపు మళ్లిన ఫుల్టన్ 2014 నుంచి 2018 వరకు ఐర్లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫుల్టన్ శిక్షణలో ఐర్లాండ్ వందేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2015లో ఆయన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫుల్టన్ బెల్జియం జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పని చేశాడు. శిక్షణ బృందంలో ఫుల్టన్ సభ్యుడిగా ఉన్నపుడు బెల్జియం 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. గత జనవరిలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియా నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. -
‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్
భారత పురుషుల హాకీ జట్టు స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021–2022 ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. హర్మన్‌తోపాటు ఆర్థర్ డి స్లూవర్, టామ్ బూన్ (బెల్జియం), బ్రింక్‌మన్ (నెదర్లాండ్స్), నిక్లాస్ వెలెన్ (జర్మనీ) కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు. భారత్‌కే చెందిన పీఆర్ శ్రీజేష్, సవిత పూనియా ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డు బరిలో ఉన్నారు. ఈనెల 30 వరకు ఆన్లైన్ ఓటింగ్ కొనసాగుతుంది. వచ్చే నెలలో విజేతలను ప్రకటిస్తారు. చదవండి: Asia Cup 2022: ఏం చేస్తున్నావు రోహిత్.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు! -
నెదర్లాండ్స్‌కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు సంచల నం సృష్టించింది. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. భారత్ తరఫున నేహా (11వ ని.లో), సోనిక (28వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్‌కు జాన్సెన్ ఇబ్బి (40వ ని.లో) ఏకైక గోల్ అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నెదర్లాండ్స్ జట్టు సభ్యులెవరూ ప్రొ లీగ్‌లో ఆడేందుకు ఇక్కడకు రాలేదు. నేడు రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. -
రాణి రాకతో బలం పెరిగింది.. కానీ
భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీలో భాగంగా శుక్రవారం కీలక పోరుకు భారత్ సన్నద్ధమైంది. ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. నాడు ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–5తో డచ్ బృందం చేతిలో ఓడింది. అయితే అప్పటినుంచి మన జట్టు ప్రదర్శన ఎంతో మెరుగైంది. మరో వైపు ఈ లీగ్ కోసం నెదర్లాండ్స్ తమ అత్యుత్తమ ఆటగాళ్లతో కాకుండా దాదాపు ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దింపుతోంది. పైగా సొంతగడ్డపై ఆడుతుండటంతో భారత బృందం గెలుపుపై ఆశలున్నాయి. ప్రస్తుతం లీగ్ పట్టికలో నెదర్లాండ్స్ 17 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సీనియర్ ప్లేయర్ రాణి రాంపాల్ పునరాగమనం జట్టు బలాన్ని పెంచింది. కానీ.. మరో ముగ్గురు కీలక సభ్యులు సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్రెమ్సియామి జూనియర్ వరల్డ్ కప్‌లో ఆడుతుండటంతో ఈ పోరుకు దూరమయ్యారు. ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా గత పోరులో జర్మనీతో తలపడిన భారత్ తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో గెలిచింది. చదవండి: LSG Vs DC: డికాక్ మెరుపు బ్యాటింగ్.. లక్నో హ్యాట్రిక్! పాపం పృథ్వీ షా! -
భారత ‘కెప్టెన్’ రీ ఎంట్రీ.. అయితే సారథి మాత్రం..
FIH Pro League 2021-2022- న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ స్టార్ స్ట్రయికర్, గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాణి రాంపాల్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్‌తో ఈనెల 8, 9 తేదీల్లో రెండు మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్ కెప్టెన్సీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ తర్వాత తొడ కండరాలు సహా ఇతరత్రా గాయాలతో ఆమె మళ్లీ మైదానంలోకే దిగలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సంతరించుకోవడంతో జట్టుకు ఎంపికైంది. కానీ సీనియర్ గోల్‌కీపర్ సవితనే సారథిగా కొనసాగించనున్నారు. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజని, దీప్ గ్రేస్, గుర్జీత్, నిక్కీ, ఉదిత, రష్మిత, సుమన్ దేవి, నిషా, సుశీలా చాను, జ్యోతి, నవజ్యోత్ కౌర్, మోనిక, నమిత, సోనిక, నేహ, మహిమ, ఐశ్వర్య, నవ్‌నీత్ కౌర్, రజ్విందర్ కౌర్, రాణి రాంపాల్, మరియానా కుజుర్. అజేయంగా ముందుకు... పాట్చెఫ్స్ట్రూమ్: జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. మలేసియాతో మంగళవారం జరిగిన పూల్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గి ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో పూల్ ‘టాపర్’గా నిలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. మలేసియాతో జరిగిన పోరులో భారత్ తరఫున ముంతాజ్ (10వ, 26వ, 59వ ని.లో) మూడు గోల్స్ సాధించగా... మరో గోల్‌ను సంగీత కుమారి (11వ ని.లో) చేసింది. చదవండి: IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్! ఆర్సీబీ సంచలన విజయం -
FIH Pro League: ఆఖరి నిమిషంలో గోల్.. భారత్‌ను గెలిపించిన మన్దీప్
భువనేశ్వర్: చివరి నిమిషంలో గోల్ చేసిన మన్దీప్ సింగ్ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు ఐదో విజయాన్ని అందించాడు. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (17వ ని.లో), మన్దీప్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (20వ, 52వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు -
మొన్న ఓటమి.. నిన్న విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్’!
FIH Pro League- భువనేశ్వర్: శనివారం ఓటమికి కారణమైన ‘షూటౌట్’ ఆదివారం వచ్చేసరికి విజయాన్నందించింది! ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని చిత్తు చేసింది. తొలి మ్యాచ్ తరహాలోనే నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ముందుగా మ్యాచ్ 29వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీషియా వీడర్మన్ గోల్ సాధించగా... 40వ నిమిషంలో నిషా గోల్ సాధించి భారత్‌ను బరిలో నిలిపింది. షూటౌట్లో భారత్ మూడు ప్రయత్నాల్లోనూ బంతి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫలం కాగా... జర్మనీని మన గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. షూటౌట్లో భారత్ తరఫున కుమారి సంగీత, టెటె సలీమా, సోనిక గోల్స్ సాధించారు. తాజా గెలుపుతో భారత్ ఖాతా లో 2 పాయింట్లు చేరాయి. ప్రొ లీగ్‌లో భాగంగా భారత్ తమ తర్వాతి పోరులో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై తలపడుతుంది. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు
FIH Pro League 2021-22: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్(అంతర్జాతీయ హాకీ సమాఖ్య) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు శుభారంభం లభించింది. సోమవారం చైనాను 7-1 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడించిన భారత మహిళా జట్టు.. ప్రో లీగ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సుశీల చాను(47వ నిమిషం, 52వ నిమిషం) రెండు గోల్స్‌తో రాణించగా.. నవనీత్ కౌర్, నేహా, వందనా కటారియా, షర్మిలా దేవీ, గుర్జీత్ కౌర్ తలో గోల్ చేశారు. చైనా తరఫున జు డెంగ్ 43వ నిమిషంలో గోల్ సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రో లీగ్ 2021-22 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. After our resounding win over 🇨🇳, we have jumped up to the 3️⃣rd place on the FIH Hockey Pro League 2021/22 (Women) points table! 👊#IndiaKaGame pic.twitter.com/yP8DMrX4uf — Hockey India (@TheHockeyIndia) January 31, 2022 చదవండి: విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు -
అత్యుత్తమ ర్యాంక్‌లో భారత హాకీ జట్టు
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది. 2003లో ప్రపంచ ర్యాంకింగ్స్ మొదలయ్యాక భారత్ తొలిసారి నాలుగో స్థానానికి చేరుకుంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లోని తొలి మూడు రౌండ్లలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రపంచ చాంపియన్ బెల్జియం టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మహిళల విభాగంలోభారత జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. -
‘రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా వివేక్ సాగర్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో ఇటీవల విశేషంగా రాణిస్తోన్న యువ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తించింది. 2019 ఏడాదికిగానూ ఎఫ్ఐహెచ్ ‘ రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్‌ను ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో 19 ఏళ్ల వివేక్ సాగర్ విజేతగా నిలవగా... మైకో కాసెలా (అర్జెంటీనా), బ్లేక్ గోవర్స్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా వివేక్ సాగర్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందించారు. 2018లో 17 ఏళ్ల వయస్సులో వివేక్ సాగర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2019లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ సిరీస్ ఫైనల్స్ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలోనూ వివేక్ సాగర్ కీలక పాత్ర పోషించాడు. -
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
హాకీ మెగా ఈవెంట్ మళ్లీ మనకే
లుసానే (స్విట్జర్లాండ్): భారత్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ హాకీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 2023లో జరిగే పురుషుల మెగా ఈవెంట్‌ను భారత్ నిర్వహిస్తుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శుక్రవారం వెల్లడించింది. 2023 ఆరంభంలో జనవరి 13 నుంచి 29 వరకు ప్రపంచకప్ పోటీలు జరుగుతాయని ఎఫ్ఐహెచ్ తెలిపింది. వేదిక ఎక్కడనేది ఆతిథ్య దేశమే ప్రకటిస్తుందని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. బిడ్డింగ్‌లో భారత్‌తో పాటు బెల్జియం, మలేసియా దేశాలు పోటీపడ్డాయి. చివరకు భారతే ఆ అవకాశాన్ని దక్కించుకోవడంతో అత్యధికంగా నాలుగుసార్లు మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న తొలి దేశంగా ఘనతకెక్కనుంది. గతంలో 1982 (ముంబై), 2010 (న్యూఢిల్లీ), 2018 (భువనేశ్వర్)లలో ప్రపంచకప్ పోటీలు జరిగాయి. నెదర్లాండ్స్ కూడా మూడుసార్లు ఆతిథ్యమిచి్చంది. ఇక్కడ సమావేశమైన ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మహిళల ప్రపంచకప్ ఆతిథ్య వేదికని ఖరారుచేసింది. ఈ ఏడాది బోర్డుకు ఇదే చివరి సమావేశం కాగా ఇందులో మహిళల ఈవెంట్ ఆతిథ్య హక్కుల్ని స్పెయిన్, నెదర్లాండ్స్‌కు సంయుక్తంగా కట్టబెట్టింది. 2022లో జూలై 1 నుంచి 22 వరకు మహిళల ఈవెంట్ జరుగుతుంది. భారత్‌కు మరోసారి మెగా ఈవెంట్ భాగ్యం దక్కడం పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. 2023 ఏడాదితో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవనుండటంతో మరింత ఘనంగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. -
అమ్మాయిలు శుభారంభం
హిరోషిమా: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ రాణి రాంపాల్ (10వ నిమిషంలో), గుర్జీత్ కౌర్ (21వ నిమిషంలో), జ్యోతి (40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఉరుగ్వే జట్టుకు వియానా తెరీసా (51వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్ ఆడుతుంది. రెండేళ్ల తర్వాత ఉరుగ్వేతోమ్యాచ్ ఆడిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరోవైపు మొదటి క్వార్టర్లో ఉరుగ్వే జట్టు చురుగ్గా ఆడుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించినా భారత డిఫెన్స్ వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్లో ఇరు జట్లు పలుమార్లు గురి తప్పాయి. ముఖ్యంగా ఉరుగ్వే రెండు పెనాల్టీ కార్నర్లను జారవిడచగా, భారత్ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైంది. తొలి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో చిలీ 7–0తో మెక్సికోపై, జపాన్ 2–1తో రష్యాపై, పోలాండ్ 6–1తో ఫిజీపై విజయం సాధించాయి. -
ఇకపై హాకీ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్స్
లూసానే (స్విట్జర్లాండ్): ఇప్పటిదాకా మ్యాచ్‌కో విరామంతో లాగించేస్తున్న హాకీ మ్యాచ్‌లకు బ్రేకులు పెంచారు. ఇకపై మ్యాచ్‌ను నాలుగు క్వార్టర్స్‌గా నిర్వహిస్తారు. ప్రతి 15 నిమిషాలకో బ్రేక్ ఇస్తారు. నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్‌లో తీసుకున్న మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆ సమావేశంలోనే ఎఫ్ఐహెచ్ చీఫ్‌గా నరీందర్ బాత్రా ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 1 నుంచి వీటిని అమలు చేయనుంది. ప్రపంచకప్ ఫార్మాట్‌నూ మార్చారు. పాల్గొనే జట్లను కూడా పెంచారు. 2018లో జరిగే పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు 16 జట్లతో జరుగనున్నాయి. ఈ జట్లను పూల్‌కు నాలుగు చొప్పున విభజిస్తారు. నాలుగు పూల్ విన్నర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుతాయి. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఎనిమిది జట్లు మిగతా నాలుగు క్వార్టర్స్ బెర్తు కోసం తలపడతాయి. వచ్చే ఏడాది పురుషుల ఈవెంట్‌కు భారత్, మహిళల టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. తదుపరి ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్ న్యూఢిల్లీలో 2018లో జరుగనుంది. -
భారత్‌లో జూ. హాకీ వరల్డ్ కప్
లక్నో: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. డిసెంబర్ 8 నుంచి 18 వరకు ఈ టోర్నీ లక్నోలో జరగనుంది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్న ఈ టోర్నీలో జర్మనీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. భారత యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని, టోర్నీని విజయవంతం చేస్తామని హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు చిలీలో మహిళల జూనియర్ వరల్డ్‌కప్ జరుగనుండగా ఇందులో భారత్ పోటీపడడం లేదు.