లూసానే (స్విట్జర్లాండ్): ఇప్పటిదాకా మ్యాచ్‌కో విరామంతో లాగించేస్తున్న హాకీ మ్యాచ్‌లకు బ్రేకులు పెంచారు. ఇకపై మ్యాచ్‌ను నాలుగు క్వార్టర్స్‌గా నిర్వహిస్తారు. ప్రతి 15 నిమిషాలకో బ్రేక్ ఇస్తారు. నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వెల్లడించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్‌లో తీసుకున్న మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆ సమావేశంలోనే ఎఫ్‌ఐహెచ్ చీఫ్‌గా నరీందర్ బాత్రా ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 1 నుంచి వీటిని అమలు చేయనుంది. ప్రపంచకప్ ఫార్మాట్‌నూ మార్చారు. పాల్గొనే జట్లను కూడా పెంచారు.
2018లో జరిగే పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు 16 జట్లతో జరుగనున్నాయి. ఈ జట్లను పూల్‌కు నాలుగు చొప్పున విభజిస్తారు. నాలుగు పూల్ విన్నర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుతాయి. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఎనిమిది జట్లు మిగతా నాలుగు క్వార్టర్స్ బెర్తు కోసం తలపడతాయి. వచ్చే ఏడాది పురుషుల ఈవెంట్‌కు భారత్, మహిళల టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. తదుపరి ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్ న్యూఢిల్లీలో 2018లో జరుగనుంది.
ఇకపై హాకీ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్స్
Published Sun, Jan 1 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
Advertisement
Advertisement