hockey match
-
పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి.. భారత్‌ను నిలువరిస్తేనే సెమీఫైనల్ బెర్త్
చెన్నై: సాధారణంగా దాయాదుల మధ్య హాకీ మ్యాచ్ జరిగినా... క్రికెట్ పోరు జరిగినా... అది ఆ టోర్నీకే ఆసక్తికరమైన సమరమవుతుంది. కానీ ఈసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు బుధవారం తలపడుతున్నప్పటికీ మునుపటిలా ఇది మాత్రం భారత్ పక్షం నుంచి అవసరం, అంతటి ఆసక్తికరమని అనలేం! ఎందుకంటే ఇదివరకే భారత జట్టు అజేయంగా సెమీఫైనల్ చేరింది. పాక్‌తో మ్యాచ్ పూర్తిగా నామమాత్రమైంది. కానీ దాయాదికి మాత్రం ఇది చావోరేవోలాంటి పోరు. ఓడితే మాత్రం సెమీస్ దారులు మూసుకుపోతాయి. కనీసం ‘డ్రా’తో గట్టెక్కితేనే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే అవకాశముంది. మరోవైపు ముందుకెళ్లడమో, ఇక్కడే ముగించుకోవడమో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. భారత్ ఫామ్, ఈ టోర్నిలో కనబరిచిన దూకుడు, ఆధిపత్యం దృష్ట్యా పాక్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో! అసాధారణ ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే పాక్ గెలిచేందుకు సాధ్యమవుతుంది. లేదంటే ఎదురేలేని భారత్‌ను ఎదురించడం అంత సులభం కానేకాదు. 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో చివరిసారి భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. భారత్–పాక్ మ్యాచ్ కంటే ముందు చైనాతో జపాన్; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతాయి. మలేసియా కూడా సెమీఫైనల్ చేరడంతో మిగతా రెండు బెర్త్‌ల కోసం కొరియా, పాకిస్తాన్, జపాన్ రేసులో ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఒకే గ్రూప్‌లో... హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసి యా క్రీడల్లో హాకీ ఈవెంట్లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్లు ఉన్నాయి. సెపె్టంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. ఆసియా క్రీడల ఈవెంట్‌కే హై లైట్ కాబోయే ఇండో–పాక్ పోరు సెపె్టంబర్ 30న జరుగుతుంది. టైటిల్ పోరు అక్టోబర్ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్‌తో ఆడుతుంది. -
Tokyo Olympics: అనుకోని అతిథి.. కెమెరాలన్ని దానివైపే
టోక్యో: కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గ్రౌండ్లన్ని వెలవెలబోతున్నాయి. మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నప్పటికి అభిమానుల గోలలు, ఈలల సందడి కనిపించడం లేదు. అయితే అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లో ఒక బొద్దింక ప్రత్యక్షమైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హోర్డింగ్‌పై బొద్దింక పాకుతుండడం కనిపించింది. ఇంకేముంది మ్యాచ్‌ను కవర్ చేస్తున్న అర్జెంటీనా కెమెరామన్ మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింకను చూపించాడు. ఆటగాళ్ల నుంచి కెమెరాను మరో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్లో సంచరిస్తున్న బొద్దింకను లైవ్‌లో చూపించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ఈరోజు మ్యాచ్‌కు అనుకోని అతిథి స్టేడియానికి వచ్చింది.. మీరంతా తప్పక చూడాలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు అతను షేర్ చేసిన వీడియోనూ 70 లక్షల మంది చూడగా.. 65వేల రీట్వీట్లు వచ్చాయి. లైవ్‌లో ప్రసారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నప్పటికి ఆ అతిథి మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ?? pic.twitter.com/KQmuQPPJAt — man (@s6ntispam) July 26, 2021 -
హాకీ శిఖరం... అత్యున్నత పోరాటం
భారత హాకీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ధ్యాన్చందే గుర్తొస్తారు. ఈ మేజర్‌తోపాటు మన హాకీ స్వర్ణయుగంలో మరో దిగ్గజం కూడా ఉన్నారు. ఆయనే బల్బీర్ సింగ్ సీనియర్. స్వతంత్ర భారతావనిలో ధ్యాన్‌చంద్ అంతటి మేరునగధీరుడు బల్బీర్. ధ్యాన్‌చంద్ ఎవరెస్ట్ అయితే... బల్బీర్ కూడా ఎవరెస్టే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో ప్రత్యర్థుల ఎత్తుగడల్ని, గోల్‌పోస్ట్ ముందుండే దుర్భేద్యమైన గోడల్ని ఛేదించడంలో ఇద్దరూ ఇద్దరే! బ్రిటిష్ ఇండియా తరఫున హాకీ సమరాల్లో ధ్యాన్‌చంద్ ఎలా పోరాడారో... స్వతంత్ర భారతావని తరఫున బల్బీర్ అలాగే పోరాడారు. ఇద్దరి సంకల్పం ఒకటే... అదే భారత విజయనాదం. వరుస ఒలింపిక్స్ల్లో ఈ ఇద్దరూ పతకం (స్వర్ణం) రంగుమారకుండా అలుపెరగని పోరాటం చేశారు. బల్బీర్ ఆటగాడిగా 1948 లండన్ ఒలింపిక్స్‌లో, వైస్ కెప్టెన్‌గా 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో, కెప్టెన్‌గా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఈ మూడు పాత్రలకు అస్త్ర సన్యాసం చేశాక మేనేజర్ కమ్ కోచ్ హోదాలో 1975 ప్రపంచకప్‌లో టీమిండియా విజయానికి మార్గదర్శనం కూడా చేశాడు. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే ఏకైక టైటిల్. తదనంతరం భారత్ అటు ఒలింపిక్స్ పతకానికి దూరమైంది... ఇటు ప్రపంచకప్ టైటిల్ సాధన భారమైంది. చేతల మనిషి బల్బీర్... పంజాబ్‌లోని హరిపూర్ ఖల్సా గ్రామంలో 1924లో జన్మిం చిన బల్బీర్ మృదుభాషి. మాటలు తక్కువగా చేతల్లో ఎక్కువగా తన ప్రతాపం చూపేవాడు. ఇది ఇట్టే గమనించిన ఖల్సా కోచ్ హర్బల్ సింగ్... బల్బీర్‌ను హాకీ వజ్రంగా సానబెట్టారు. గురువు శిక్షణలో ఆటలో ఓనమాలు నేర్చిన బల్బీర్ పెరిగేకొద్దీ ఎదురేలేని యోధుడిగా ఎదిగాడు. భారత హాకీ జట్టులో సెంట్రల్ ఫార్వర్డ్ మెరికగా మారాడు. స్వరాజ్య భారతావనికి ఒలింపిక్స్‌లో తొలిస్వర్ణం అందించడంలో బల్బీర్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. దీంతో స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది లండన్ (1948)లో జరిగిన విశ్వక్రీడల్లో పసిడి భారతమైంది. మరో ఒలింపిక్స్ ఆడే సమయానికి ఫార్వ ర్డ్ లైన్‌కే వన్నె తెచ్చేంత స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పటికీ పదిలం... ఆ రికార్డు అసాధారణ ఆటతీరుతో తర్వాతి ఒలింపిక్స్‌లో జట్టు వైస్ కెప్టెన్‌గా సెంట్రల్ ఫార్వర్డ్‌లో ప్రధాన ఆటగాడిగా ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేశాడు. 1952లో జరిగిన అంతిమ పోరాటంలో బల్బీర్ చెలరేగాడు. ఆ విశ్వక్రీడల్లో ఈ మాంత్రికుడు ఫైనల్లో తన విశ్వరూపం చూపెట్టాడు. ఆ విశ్వరూపం తాలూకూ బద్దలైన రికార్డు ఇన్నేళ్లయినా పదిలంగా ఉండటం మరో విశేషం. నెదర్లాండ్స్‌తో జరిగిన తుదిపోరులో భారత్ 6–1తో జయభేరి మోగించింది. ఇందులో ఒకే ఒక్క గోల్ ప్రత్యర్థి జట్టు చేసింది. మరో గోల్ తన జట్టు చేయగా... మిగతా 5 గోల్స్ బల్బీర్ ఒక్కడే సాధించడం రికార్డు పుటల్లోకెక్కింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సారథిగా మరో స్వర్ణం అందించాడు. అలుపేలేని పోరాటంతో ఎదురులేని విజయాలందించిన బల్బీర్ భారత హాకీలో నిజంగా మాంత్రికుడు. మువ్వన్నెల్ని మురిపించిన ఘనాఘనుడు. ఇతని నిరుపమానమైన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు బల్బీరే కావడం మరో విశేషం. 1975 ప్రపంచకప్‌తో (ఎడమ) -
ఆసీస్ ‘ఎ’తో భారత హాకీ మ్యాచ్ డ్రా
పెర్త్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌ను భారత జట్టు 1–1తో డ్రా చేసుకుంది. మ్యాచ్ చివర్లో భారత డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో టీమిండియా డ్రాతో గట్టెక్కింది. ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున కిరణ్ అరుణసేలం (21వ నిమిషంలో) రెండో క్వార్టర్లో ఫీల్డ్ గోల్ చేయగా, భారత్ ఆఖరి క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌తో ఊరట పొందింది. 56వ నిమిషంలో లభించిన ఈ పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ గోల్‌గా మలిచి జట్టును పరాజయం నుంచి తప్పించాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో భారత్ తలపడుతుంది. -
సీఎంతో కలిసి మ్యాచ్ వీక్షించిన మాజీ నక్సల్స్
సాక్షి, భువనేశ్వర్: నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒడిశా పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసంతోపాటు మంచి జీవితం దొరుకుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే లొంగిపోయిన వారు సమాజంలో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిలోని ఈ భావాన్ని పొగొట్టడానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన వంతు ప్రయత్నం చేశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో గురువారం భారత్, నెదర్లాండ్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌ను ఆయన లొంగిపోయిన నక్సల్స్‌తో కలిసి వీక్షించారు. దాదాపు 30 మంది మాజీ నక్సల్స్ సీఎం పక్కన కూర్చుని మ్యాచ్‌ను చూశారు. వీరిలో 16 మంది మహిళ నక్సలైట్లు ఉన్నారు. ఇటీవల లొంగిపోయిన నక్సల్స్ తమకు హాకీ మ్యాచ్ చూడాలని కోరికగా ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. వారి కోరిక మేరకు ఇతర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన మల్కాన్‌గిరి ఎస్పీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళింగ స్టేడియంకు వెళ్లిన మాజీ నక్సల్స్ తాము సీఎం పక్కన కూర్చుని మ్యాచ్ వీక్షించబోతున్నామనే విషయం తెలుసుకుని మరింత ఆనందపడ్డారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు జీవితకాలం గుర్తిండి పోతుందని పేర్కొన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేము నిజంగా జనజీవన స్రవంతిలో(సమాజంలో) కలిశామని భావిస్తున్నాం. లొంగిపోయిన నక్సల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చాలా తోడ్పాటు అందిస్తుంద’ని తెలిపారు. -
ఇకపై హాకీ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్స్
లూసానే (స్విట్జర్లాండ్): ఇప్పటిదాకా మ్యాచ్‌కో విరామంతో లాగించేస్తున్న హాకీ మ్యాచ్‌లకు బ్రేకులు పెంచారు. ఇకపై మ్యాచ్‌ను నాలుగు క్వార్టర్స్‌గా నిర్వహిస్తారు. ప్రతి 15 నిమిషాలకో బ్రేక్ ఇస్తారు. నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్‌లో తీసుకున్న మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆ సమావేశంలోనే ఎఫ్ఐహెచ్ చీఫ్‌గా నరీందర్ బాత్రా ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 1 నుంచి వీటిని అమలు చేయనుంది. ప్రపంచకప్ ఫార్మాట్‌నూ మార్చారు. పాల్గొనే జట్లను కూడా పెంచారు. 2018లో జరిగే పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు 16 జట్లతో జరుగనున్నాయి. ఈ జట్లను పూల్‌కు నాలుగు చొప్పున విభజిస్తారు. నాలుగు పూల్ విన్నర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుతాయి. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఎనిమిది జట్లు మిగతా నాలుగు క్వార్టర్స్ బెర్తు కోసం తలపడతాయి. వచ్చే ఏడాది పురుషుల ఈవెంట్‌కు భారత్, మహిళల టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. తదుపరి ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటీవ్‌ల మీటింగ్ న్యూఢిల్లీలో 2018లో జరుగనుంది. -
భారత్, పాక్ చరిత్రను కుదించారు
ఎఫ్ఐహెచ్ నిర్వాకం కౌంటన్ (మలేసియా): భారత్, పాకిస్తాన్‌కు సంబంధించి ఎలాంటి క్రీడ అరుునా నరాలు తెగే ఉత్కంఠ రేగడం ఖాయం. హాకీ మ్యాచ్‌లు కూడా ఇందుకు మినహారుుంపు కాదు. గత ఆరు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య 166 మ్యాచ్‌లు జరగారుు. అరుుతే ఘనచరిత్ర ఉన్న రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ల సంఖ్యను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తక్కువ చేసి చూపింది. ఎఫ్‌ఐహెచ్‌కు చెందిన టోర్నమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాటా ప్రకారం ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లు 47 మాత్రమేనట. ఆసియా చాంపియన్స ట్రోఫీ నిర్వాహకులు తాజా జాబితాను జట్లకు పంపి ణీ చేశారు. ఓవరాల్‌గా భారత్ 321 గోల్స్ చేయగా దీంట్లో మాత్రం 98 మాత్రమే చేసినట్లు చూపారు. -
భారత-ఆస్ట్రేలియా తొలి హాకీ టెస్టు డ్రా
చత్తీస్‌గఢ్: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత-ఆస్ట్రేలియాల మధ్య రాజ్నాంద్ గాన్ లో గురువారం జరిగిన తొలి టెస్టు డ్రా ముగిసింది. వరల్డ్ నంబర్ వన్ ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్ చివరకు డ్రాతో గట్టెక్కింది. ఆట మూడో అర్థభాగం ముగిసే సరికి భారత్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అయితే ఆట చివరి రెండు నిమిషాలు ఉందనగా ఆసీస్ మరో గోల్ చేసి స్కోరును సమం చేసింది. కాగా, ఆట చివరి నిమిషంలో ఇరు జట్లు పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంలో విఫలం చెందడంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ చేసిన రెండు గోల్స్ వీఆర్ రఘునాథ్ ఖాతాలో పడటం విశేషం. దీంతో తన కెరీర్ లో 125 గోల్స్ ను రఘునాథ్ నమోదు చేశాడు. తదుపరి టెస్టు ఆదివారం మధ్యాహ్నం ఆరంభం కానుంది. తొలి టెస్టులో డ్రాతో గట్టెక్కిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. -
హాకీ మ్యాచ్ ఇక 60 నిమిషాలే!
ది హేగ్: ‘మీ వద్ద కేవలం 70 నిమిషాలు ఉన్నాయి. మీ జీవితంలో ఇవి ఎంతో కీలక క్షణాలు. ఏం చేసినా ఈ 70 నిమిషాల్లోనే’...అంటూ చక్‌దే ఇండియా సినిమాలో షారుఖ్ ఖాన్ చెప్పిన పాపులర్ డైలాగ్ గుర్తుందా! ఇకపై హాకీలో ఆ 70 నిమిషాలు అనేది చరిత్రగా మారనుంది. ఎందుకంటే హాకీ మ్యాచ్‌ను 60 నిమిషాలకు కుదించాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నిర్ణయించింది. ప్రతీ 15 నిమిషాలకు విరామం చొప్పున నాలుగు భాగాలుగా ఈ 60 నిమిషాల మ్యాచ్ సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడల నుంచి ఈ టైమింగ్‌ను అమలు చేయనున్నట్లు ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రో నెగ్రె వెల్లడించారు. కొత్త నిబంధనలు ఆటను మరింత ఆసక్తికరంగా మారుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ విధానాన్ని హాకీ ఇండియా లీగ్‌లో, యూరోపియన్ లీగ్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాం. వాటికి మంచి స్పందన వచ్చింది. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీనిని అంతర్జాతీయ స్థాయిలో అమలు చేయనున్నాం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఇదే టైమింగ్ ఉంటుంది’ అని నెగ్రె స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకే టైటిల్ ఆదివారం ముగిసిన ప్రపంచ కప్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా 6-1, గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధిం చింది. కాంస్య పతక పోరులో అర్జెంటీనా 2-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది.