భారత-ఆస్ట్రేలియా తొలి హాకీ టెస్టు డ్రా | India Play Out Tough Draw vs Aussies | Sakshi
Sakshi News home page

భారత-ఆస్ట్రేలియా తొలి హాకీ టెస్టు డ్రా

Published Thu, Nov 19 2015 5:15 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

భారత-ఆస్ట్రేలియా తొలి హాకీ టెస్టు డ్రా

భారత-ఆస్ట్రేలియా తొలి హాకీ టెస్టు డ్రా

చత్తీస్గఢ్: మూడు టెస్టుల  సిరీస్ లో భాగంగా భారత-ఆస్ట్రేలియాల మధ్య రాజ్నాంద్ గాన్ లో గురువారం జరిగిన తొలి టెస్టు డ్రా ముగిసింది. వరల్డ్ నంబర్ వన్ ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్ చివరకు డ్రాతో గట్టెక్కింది. ఆట మూడో అర్థభాగం ముగిసే సరికి భారత్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

 

అయితే ఆట చివరి రెండు నిమిషాలు ఉందనగా ఆసీస్ మరో గోల్ చేసి స్కోరును సమం చేసింది. కాగా, ఆట చివరి నిమిషంలో ఇరు జట్లు పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంలో విఫలం చెందడంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది.  భారత్ చేసిన రెండు గోల్స్ వీఆర్ రఘునాథ్ ఖాతాలో పడటం విశేషం. దీంతో తన కెరీర్ లో 125 గోల్స్ ను రఘునాథ్ నమోదు చేశాడు. తదుపరి టెస్టు  ఆదివారం మధ్యాహ్నం ఆరంభం కానుంది. తొలి టెస్టులో డ్రాతో గట్టెక్కిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement