
పెర్త్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌ను భారత జట్టు 1–1తో డ్రా చేసుకుంది. మ్యాచ్ చివర్లో భారత డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో టీమిండియా డ్రాతో గట్టెక్కింది. ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున కిరణ్ అరుణసేలం (21వ నిమిషంలో) రెండో క్వార్టర్‌లో ఫీల్డ్ గోల్ చేయగా, భారత్ ఆఖరి క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌తో ఊరట పొందింది. 56వ నిమిషంలో లభించిన ఈ పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ గోల్‌గా మలిచి జట్టును పరాజయం నుంచి తప్పించాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment