చెన్నై: సాధారణంగా దాయాదుల మధ్య హాకీ మ్యాచ్ జరిగినా... క్రికెట్ పోరు జరిగినా... అది ఆ టోర్నీకే ఆసక్తికరమైన సమరమవుతుంది. కానీ ఈసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు బుధవారం తలపడుతున్నప్పటికీ మునుపటిలా ఇది మాత్రం భారత్ పక్షం నుంచి అవసరం, అంతటి ఆసక్తికరమని అనలేం! ఎందుకంటే ఇదివరకే భారత జట్టు అజేయంగా సెమీఫైనల్ చేరింది.
పాక్‌తో మ్యాచ్ పూర్తిగా నామమాత్రమైంది. కానీ దాయాదికి మాత్రం ఇది చావోరేవోలాంటి పోరు. ఓడితే మాత్రం సెమీస్ దారులు మూసుకుపోతాయి. కనీసం ‘డ్రా’తో గట్టెక్కితేనే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే అవకాశముంది. మరోవైపు ముందుకెళ్లడమో, ఇక్కడే ముగించుకోవడమో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది.
భారత్ ఫామ్, ఈ టోర్నిలో కనబరిచిన దూకుడు, ఆధిపత్యం దృష్ట్యా పాక్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో! అసాధారణ ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే పాక్ గెలిచేందుకు సాధ్యమవుతుంది. లేదంటే ఎదురేలేని భారత్‌ను ఎదురించడం అంత సులభం కానేకాదు. 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో చివరిసారి భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. భారత్–పాక్ మ్యాచ్ కంటే ముందు చైనాతో జపాన్; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతాయి. మలేసియా కూడా సెమీఫైనల్ చేరడంతో మిగతా రెండు బెర్త్‌ల కోసం కొరియా, పాకిస్తాన్, జపాన్ రేసులో ఉన్నాయి.
ఆసియా క్రీడల్లో ఒకే గ్రూప్‌లో...
హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసి యా క్రీడల్లో హాకీ ఈవెంట్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్‌లు ఉన్నాయి. సెపె్టంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.
ఆసియా క్రీడల ఈవెంట్‌కే హై లైట్ కాబోయే ఇండో–పాక్ పోరు సెపె్టంబర్ 30న జరుగుతుంది. టైటిల్ పోరు అక్టోబర్ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్‌తో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment