Tokyo Olympics : Cameraman Films Cockroach InThe Middle Of Ongoing Women's Hockey Match - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: అనుకోని అతిథి.. కెమెరాలన్ని దానివైపే

Jul 31 2021 10:21 AM | Updated on Jul 31 2021 3:21 PM

Tokyo Olympics: Cameraman Films Cockroach Instead Of Hockey Match Viral - Sakshi

టోక్యో: కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గ్రౌండ్‌లన్ని వెలవెలబోతున్నాయి. మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నప్పటికి అభిమానుల గోలలు, ఈలల సందడి కనిపించడం లేదు. అయితే అర్జెంటీనా, స్పెయిన్‌ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లో ఒక బొద్దింక ప్రత్యక్షమైంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో హోర్డింగ్‌పై బొద్దింక పాకుతుండడం కనిపించింది. ఇంకేముంది మ్యాచ్‌ను కవర్‌ చేస్తున్న అర్జెంటీనా కెమెరామన్‌ మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింక‌ను చూపించాడు. ఆట‌గాళ్ల నుంచి కెమెరాను మ‌రో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్‌లో సంచ‌రిస్తున్న బొద్దింక‌ను లైవ్‌లో చూపించాడు.

దీనికి సంబంధించిన వీడియోనూ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ''ఈరోజు మ్యాచ్‌కు అనుకోని అతిథి స్టేడియానికి వచ్చింది.. మీరంతా తప్పక చూడాలి'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇప్పటివరకు అతను షేర్‌ చేసిన వీడియోనూ 70 లక్షల మంది చూడగా..  65వేల రీట్వీట్లు వ‌చ్చాయి. లైవ్‌లో ప్రసారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవ‌లం కొన్ని సెక‌న్లు మాత్రమే ఉన్నప్పటికి ఆ అతిథి మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement