టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూఫ్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.తొలి నుంచి స్పెయిన్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన భారత్ ఆటలో 14వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ తొలి గోల్‌తో మెరవగా.. 15వ నిమిషంలో రూపిందర్‌పాల్ సింగ్ రెండో గోల్‌తో మెరిశాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన రెండు, మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేయలేకపోయినా స్పెయిన్‌ను గోల్ చేయకుండా అడ్డుకుంది.
ఇక చివరిదైన నాలుగో క్వార్టర్స్‌లో ఆట 51వ నిమిషంలో రూపిందర్‌పాల్ సింగ్ రెండో గోల్‌తో మెరవడంతో భారత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో స్పెయిన్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో టీమిండియా విజయాన్ని సాధించింది. భారత్ తరపున రూపిందర్ పాల్ సింగ్ 2, సింగ్ సిమ్రన్‌జిత్ ఒక గోల్ చేశారు. కాగా ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా పురుషుల జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో ఆడనుంది.
Tokyo Olympics: స్పెయిన్‌పై భారత్ ఘన విజయం
Published Tue, Jul 27 2021 8:38 AM | Last Updated on Tue, Jul 27 2021 10:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment