Tokyo Olympics Day 8 India Schedule: Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

Tokyo Olympics Day 8: జపాన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం

Published Fri, Jul 30 2021 6:44 AM | Last Updated on Fri, Jul 30 2021 5:24 PM

Tokyo Olympics Day 8 Updates And Highlights - Sakshi

జపాన్‌పై భారత  హాకీ జట్టు విజయం
టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకొని పోతున్నది. పూల్ ఏ‌లో భాగంగా శుక్రవారం జపాన్‌ తో జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తొలి క్వార్టర్ ప్రారంభంలోనే హర్మన్ ప్రీత్ సింగ్  అద్భుతమైన గోల్ తో భారత్ కి శుభారంభాన్ని అందించాడు. రెండవ క్వార్టర్ ఆరంభంలోనే భారత్ మరో గోల్ ని సాధించి తమ ఆదిక్యతను 2-0 కి పెంచుకుంది.ఇక మూడో క్వార్టర్లో పుంజుకున్న జపాన్‌ వరుస గోల్స్‌తో 2-2తో సమం చేసింది. ఇక నాలుగవ క్వార్టర్లో భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి లీడ్‌ 4-2 కి పెంచుకుంది . చివర్లో జపాన్ మరో గోల్ ని సాధించిడంతో  5-3 తేడా తో మ్యాచ్‌ ముగిసింది. ఇప్పటికే అర్జెంటీనాపై గెలుపుతో  క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్‌ పూల్ ఏ‌లో రెండవ స్థానంలో ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌: టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌కు సెమీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అలెగ్జాండర్‌ (జర్మనీ) చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు.

మెరిసిన తెలుగు తేజం పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సెమీస్‌కు చేరింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి అకానా యమగూచిని ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. వరుసగా రెండు సెట్లలో 4వ సీడ్‌ యమగూచిపై పైచేయి సాధించి... 21-13, 22-20 తేడాతో సింధు గెలుపొందింది.

క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో  తొలి గేమ్‌ పీవీ సింధుదే
టోక్యో  ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో యమగూచిపై  తొలి గేమ్‌లో పీవి సింధు 21-13తో విజయం సాధించింది.

క్వార్టర్స్‌లో దీపికా కుమారి ఓటమి
►ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో భారత​ మహిళా ఆర్చర్‌ దీపికా కుమారి పోరు ముగిసింది. కొరియాకు చెందిన ఆర్చర్‌ ఆన్‌ సాన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 0-6 తేడాతో పరాజయం పాలైంది. అంతకముందు రౌండ్‌ ఆఫ్‌ 8లో పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది

భారత​ మహిళల హాకీ జట్టు తొలి విజయం
►టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫూల్‌ ఏలో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-0 తేడాతో గెలుపొందింది. ఆటలో వచ్చిన ఏకైక గోల్‌ భారత్‌ నుంచి నవనీత్‌ కౌర్‌ ఆట 25వ నిమిషంలో వచ్చింది. ఈ మ్యాచ్‌ విజయానికి ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చెందిన భారత మహిళల జట్టు క్వార్టర్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే లీగ్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి మ్యాచ్‌ను గెలవడంతో పాటు మిగతా జట్ల ఓటములపై టీమిండియా వుమెన్స్‌ ఆధారపడాల్సి ఉంది.

100 మీటర్ల హీట్‌ రేసులో ద్యుతిచంద్‌ విఫలం
►ఒలింపిక్స్‌లో భాగంగా 100 మీటర్ల హీట్‌ విభాగంలో భారత మహిళ అథ్లెట్‌ ద్యుతిచంద్‌ నిరాశపరిచింది. హీట్‌ 1 విభాగంలో 100 మీ రేసును ఆమె 11.54 సెకన్లలో పూర్తి చేసి 7వ స్థానంలో నిలిచింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం
►బాక్సింగ్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా కొత్త చరిత్ర సృష్టించింది. బాక్సింగ్‌లో సెమీస్‌కు చేరి నూతన అధ్యాయాన్ని లిఖించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లవ్లీనా 69 కేజీల విభాగంలో అదరగొట్టింది. మాజీ వరల్డ్‌ చాంపియన్‌,  చైనీస్‌ తైపీ ప్లేయర్‌ చెన్‌ నైన్‌ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకుపోయింది. తద్వారా భారత బాక్సింగ్‌ కేటగిరీలో కనీసం కాంస్యం పతకం ఖాయమైంది.

ప్రీక్వార్టర్స్‌లో వెనుదిరిగిన సిమ్రన్‌జిత్‌ కౌర్‌
►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో భారత బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ నిరాశపరిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన  సుదాపోర్న్‌ సీసోండీతో జరిగిన బౌట్‌లో 0-5 తేడాతో పరాజయం పాలైంది.

భారత మహిళా షూటర్లకు నిరాశ
►టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్లకు నిరాశే ఎదురైంది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 290 పాయింట్లతో మనుబాకర్‌ 15వ స్థానంలో.. 286 పాయింట్లతో సర్నబోత్‌ రహీ 32వ స్థానంలో నిలిచింది. దీంతో వారిద్దరు ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు.

ఆర్చరీ: క్వార్టర్స్‌కు చేరిన దీపికా కుమారి
►ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్స్‌కు చేరుకుంది. రౌండ్‌ ఆఫ్‌ 8లో భాగంగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్‌ విజేత పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది. పెరోవాతో జరిగిన మ్యాచ్‌లో 5 సెట్లలో దీపిక రెండు సెట్లను గెలవగా... పెరోవా రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అవడంతో స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. ఆ తరువాత జరిగిన షూట్ అవుట్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా 7 పాయింట్లు మాత్రమే కొట్టగా... దీపిక 10 పాయింట్లతో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను కైవసం చేసుకుంది. 

ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌:
మహిళల వ్యక్తిగత రికర్వ్‌ విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్‌: దీపిక కుమారి*సెనియా పెరోవా (రష్యా); ఉదయం గం. 6 నుంచి; క్వార్టర్‌ ఫైనల్‌ (దీపిక గెలిస్తే): ఆన్‌ సాన్‌ (కొరియా) లేదా రెన్‌ హయకావా (జపాన్‌); ఉదయం గం. 11:30 నుంచి... సెమీఫైనల్‌ మధ్యాహ్నం గం. 12:15 నుంచి; కాంస్య పతకం కోసం మధ్యాహ్నం గం. 1:00 నుంచి; స్వర్ణ, రజత పతకం కోసం మధ్యాహ్నం గం. 1:15 నుంచి 

షూటింగ్‌
మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌: మనూ భాకర్, రాహీ (ఉదయం గం. 5:30 నుంచి); ఫైనల్‌ (మనూ, రాహీ అర్హత సాధిస్తే): ఉ. గం. 10.30 నుంచి .. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌: మనూ భాకర్, రాహీ (ఉదయం గం. 5:30 నుంచి); ఫైనల్‌ (మనూ, రాహీ అర్హత సాధిస్తే): ఉ. గం. 10.30 నుంచి

బాక్సింగ్‌: మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌: సిమ్రన్‌ జిత్‌ కౌర్‌*సుదాపోర్న్‌ సీసోండీ (థాయ్‌లాండ్‌); ఉదయం గం. 8:18 నుంచి; మహిళల 69 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: లవ్లీనా బొర్గోహైన్‌*నియెన్‌ చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) ఉదయం గం. 8:48 నుంచి 

అథ్లెటిక్స్‌: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ రౌండ్‌–1 హీట్‌: అవినాశ్‌ సాబ్లే ఉదయం గం. 6:17 నుంచి; పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌ రౌండ్‌–1 హీట్‌–5: జాబిర్‌ ఉదయం గం. 8:27 నుంచి; మహిళల 100 మీటర్ల రౌండ్‌–1 హీట్స్‌: ద్యుతీ చంద్‌ ఉదయం గం. 8:45 నుంచి; మిక్స్‌డ్‌ 4*400 మీటర్ల రిలే రేస్‌ రౌండ్‌–1 హీట్‌–2: సాయంత్రం గం. 4:42 నుంచి 

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌: పీవీ సింధు* అకానె యామగుచి (జపాన్‌); మధ్యాహ్నం గం. 1:15 నుంచి 

ఈక్వెస్ట్రియన్‌ : ఈవెంటింగ్‌ డ్రెస్సెజ్‌ తొలి రోజు సెషన్‌–2: ఫౌద్‌ మీర్జా మధ్యాహ్నం గం. 2 నుంచి 

గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే రౌండ్‌–2: అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌మానె ఉదయం గం. 4 నుంచి 

సెయిలింగ్‌ : పురుషుల స్కిఫ్‌ 49ఈఆర్‌ రేసు 7, 8 ,9: కేసీ గణపతి, వరుణ్‌ ఠక్కర్‌ ఉదయం గం. 8: 35 నుంచి; మహిళల రేడియల్‌ రేసు 9, 10: నేత్రా కుమనన్‌ ఉదయం గం. 8:35 నుంచి; పురుషుల లేజర్‌ రేసు 9, 10: విష్ణు శరవణన్‌ ఉదయం గం. 11:05 నుంచి  

హాకీ : మహిళల పూల్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌: భారత్‌ * ఐర్లాం డ్‌ ఉదయం గం. 8:15 నుంచి; పురుషుల పూల్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌: భారత్‌ * జపాన్‌ మధ్యాహ్నం గం. 3 నుంచి  

చదవండి:Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement