ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్.. మొరాకో, స్పెయిన్‌లు చివరి ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీంతో ప్రీక్వార్టర్స్ దశ ముగియనుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉంటే ఈసారి ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు వస్తున్న వేళ కచ్చితంగా టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో అర్జెంటీనా ముందుకు సాగుతుంది. డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు మూడు గోల్స్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది గోల్స్ కొట్టాడు.
ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉన్న నాలుగు జట్ల పేర్లను రివీల్ చేశాడు. మెస్సీ ఏంచుకున్న నాలుగు జట్లలో అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్‌లు ఉన్నాయి. ''నేను ఆడుతుంది అర్జెంటీనాకు కావడంతో మా జట్టు తొలి ఫెవరెట్ అని చెప్పలేను. అర్జెంటీనా ఎప్పుడూ బెస్ట్ టీమ్స్‌లో ఒకటిగా ఉంటుంది. మేము బెస్ట్ టీమ్స్‌లో ఒకటని మాకు తెలిసినా.. దానిని ఫీల్డ్‌లో నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో దానిని మరోసారి నిరూపించుకున్నాం.
మాకంటే బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్‌లు బాగా ఆడుతున్నాయి. కామెరూన్ చేతుల్లో ఓడినా బ్రెజిల్ కూడా బాగా ఆడుతోంది. ఇప్పటికీ ఫేవరెట్స్‌లో ఒకటి. ఫ్రాన్స్ కూడా బాగానే ఉంది. జపాన్ చేతుల్లో ఓడినా స్పెయిన్‌నూ తక్కువ అంచనా వేయలేం. వాళ్లు ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ల నుంచి బాల్‌ను దూరంగా తీసుకెళ్లడం కష్టం. స్పెయిన్ టీమ్ బాల్‌ను ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకుంటారు. వాళ్లను ఓడించడం కష్టం" అని పేర్కొన్నాడు.
చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment