
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ రొనాల్డో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2022 గెలుచుకునేది ఎవరనే దానిపై అంచనా వేశాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా మాత్రం టైటిల్ కొట్టే అవకాశం లేదని.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఫ్రాన్స్ మరోసారి కప్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రొనాల్డో పేర్కొన్నాడు.
ఇక ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. మంగళ, బుధవారాల్లో రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా, క్రొయేషియా తలపడుతుండగా.. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, ఆఫ్రికన్ సెన్సేషన్ మొరాకో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో రొనాల్డో ఇంటర్య్వూలో మాట్లాడాడు.
''మెస్సీ ఈసారైనా తన వరల్డ్‌కప్ కల నెరవేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. సెమీఫైనల్లోనే క్రొయేషియా చేతుల్లో అర్జెంటీనా ఓడిపోయే అవకాశం ఉంది. అయితే ఒక కపట వ్యక్తిలాగా ఉంటూ అర్జెంటీనా గెలిస్తే సంతోషిస్తానని చెప్పను. నేను ఫుట్‌బాల్‌ను రొమాంటిక్ యాంగిల్‌లో చూస్తా. ఎవరు ఛాంపియన్ అయినా సంతోషమే. అయితే మొదటి నుంచి నా ఫేవరెట్స్ లిస్ట్‌లో బ్రెజిల్, ఫ్రాన్సే ఉన్నాయి.
ఇప్పుడు బ్రెజిల్ లేదు.. లిస్ట్‌లో ఉన్న ఫ్రాన్స్ రోజురోజుకు ఫెవరెట్ అనే ట్యాగ్‌ను మెరుగుపరచుకుంటూ వస్తోంది. ఇప్పటికీ ఆ టీమ్‌నే నేను ఫెవరెట్స్ అని చెప్పగలను. ఇక రెండో సెమీఫైనల్లో మొరాకోనే గెలవాలని అనుకుంటున్నా. కానీ అది జరుగుతుందని అనుకోవడం లేదు. ఫ్రాన్స్ టీమ్ చాలా బలంగా ఉంది. డిఫెన్స్, అటాక్, మిడ్‌ఫీల్డ్ ఇలా ఏది చూసుకున్నా ఫ్రాన్స్ బలంగా కనిపిస్తోంది" అని రొనాల్డో పేర్కొన్నాడు.
చదవండి: క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్