Ronaldo
-
వాళ్లతో పోలిస్తే ఐపీఎల్లో క్రికెటర్లు సంపాదించేదెంత.. ఆడుకోనివ్వండి..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందించాడు. ఈ విషయంలో లాయిడ్ ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు. ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. మైఖేల్ జోర్డన్ లాంటి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్ లాయిడ్ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. -
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
FIFA: విజేత అర్జెంటీనా మాత్రం కాదు.. 'అంత కుళ్లెందుకు'
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ రొనాల్డో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2022 గెలుచుకునేది ఎవరనే దానిపై అంచనా వేశాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా మాత్రం టైటిల్ కొట్టే అవకాశం లేదని.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఫ్రాన్స్ మరోసారి కప్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రొనాల్డో పేర్కొన్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. మంగళ, బుధవారాల్లో రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా, క్రొయేషియా తలపడుతుండగా.. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, ఆఫ్రికన్ సెన్సేషన్ మొరాకో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో రొనాల్డో ఇంటర్య్వూలో మాట్లాడాడు. ''మెస్సీ ఈసారైనా తన వరల్డ్‌కప్ కల నెరవేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. సెమీఫైనల్లోనే క్రొయేషియా చేతుల్లో అర్జెంటీనా ఓడిపోయే అవకాశం ఉంది. అయితే ఒక కపట వ్యక్తిలాగా ఉంటూ అర్జెంటీనా గెలిస్తే సంతోషిస్తానని చెప్పను. నేను ఫుట్‌బాల్‌ను రొమాంటిక్ యాంగిల్లో చూస్తా. ఎవరు ఛాంపియన్ అయినా సంతోషమే. అయితే మొదటి నుంచి నా ఫేవరెట్స్ లిస్ట్‌లో బ్రెజిల్, ఫ్రాన్సే ఉన్నాయి. ఇప్పుడు బ్రెజిల్ లేదు.. లిస్ట్‌లో ఉన్న ఫ్రాన్స్ రోజురోజుకు ఫెవరెట్ అనే ట్యాగ్‌ను మెరుగుపరచుకుంటూ వస్తోంది. ఇప్పటికీ ఆ టీమ్‌నే నేను ఫెవరెట్స్ అని చెప్పగలను. ఇక రెండో సెమీఫైనల్లో మొరాకోనే గెలవాలని అనుకుంటున్నా. కానీ అది జరుగుతుందని అనుకోవడం లేదు. ఫ్రాన్స్ టీమ్ చాలా బలంగా ఉంది. డిఫెన్స్, అటాక్, మిడ్‌ఫీల్డ్ ఇలా ఏది చూసుకున్నా ఫ్రాన్స్ బలంగా కనిపిస్తోంది" అని రొనాల్డో పేర్కొన్నాడు. చదవండి: క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్ 'మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.. చర్చ అవసరమా?' -
FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే
మొత్తం 20 ప్రపంచకప్‌లు... విజేతలుగా నిలిచిన 8 జట్లు ... ఎందరో సూపర్ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. కార్లోస్ ఆల్బర్టో, రోజర్ మిల్లా, బాబీ చార్ల్టన్, థియరీ హెన్రీ, ప్లాటిని, జిదాన్, ఒలివర్ కాన్, క్లిన్స్మన్, లోథర్ మథియాస్, రుడ్ గలిట్, జొహన్ క్రఫ్... ఇలా ఎందరో మైదానంలో బంతితో విన్యాసాలు చేయించారు. కానీ కొందరు మాత్రం వీరందరికంటే కచ్చితంగా పై స్థానంలో ఉంటారు. తమదైన ప్రత్యేకతతో ఆటను శాసించిన వీరు, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్–5 వరల్డ్ కప్ స్టార్స్‌ను చూస్తే... - కరణం నారాయణ పీలే (బ్రెజిల్) ఫుట్‌బాల్ పేరు చెప్పగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే పేరు ఉంటుంది. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్ పీలేనే కావడం విశేషం. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించాడు. స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. కెరీర్ మొత్తంలో నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించాడు. డీగో మారడోనా (అర్జెంటీనా) పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ’గా నిలిచిన ఆటగాడు డీగో మారడోనా. దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్ అభిమానులందరి హృదయాలు గెల్చుకున్నాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కి చేర్చిన అతను 1994 వరల్డ్ కప్ సమయంలో డ్రగ్స్ వాడినట్లుగా తేలింది. నాలుగు ప్రపంచకప్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేసిన మారడోనా ఉజ్వల కెరీర్ ముగిసిన తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టినా... ప్లేయర్‌గా అవి అతని గొప్పతనాన్ని తగ్గించలేవు. ఫ్రాంజ్ బెకన్‌బాయర్ (పశ్చిమ జర్మనీ) జర్మనీ అందించిన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడు. మూడు ప్రపంచకప్‌లు ఆడిన అతను తన శైలి, నాయకత్వ పటిమతో ‘ది ఎంపరర్’గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా, మేనేజర్‌గా రెండు సార్లు ప్రపంచకప్‌ను అందుకున్న ఇద్దరు ఆటగాళ్లలో బెకన్‌బాయర్ ఒకడు. 1974లో సొంతగడ్డపై కెప్టెన్ హోదాలో బెకన్‌బాయర్ తొలి మ్యాచ్ నుంచే జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫైనల్లో జర్మనీ 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు. అనంతరం 1990లో బెకన్‌బాయర్ కోచ్‌గా ఉన్న పశ్చిమ జర్మనీ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. గెర్డ్ ముల్లర్ (పశ్చిమ జర్మనీ) ‘ద నేషన్స్ బాంబర్’ అనే నిక్‌నేమ్ ఉన్న గెర్డ్ ముల్లర్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్ కొట్టిన ముల్లర్ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1974లో సొంతగడ్డపై ప్రపంచకప్ ఫైనల్లో ముల్లర్ చేసిన గోల్‌తో జర్మనీ రెండోసారి విజేతగా నిలిచింది. కెరీర్ ఆసాంతం ముల్లర్ ‘ఫెయిర్ ప్లేయర్’గా గుర్తింపు పొందడం విశేషం. రొనాల్డో (బ్రెజిల్) ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్లో పీలే తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్లేయర్ రొనాల్డో లూయీ డి లిమా. మూడుసార్లు ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, రెండు సార్లు ‘గోల్డెన్ బాల్’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్ కప్ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టి రెండోస్థానంతో కెరీర్‌ను ముగించాడు. చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్ -
FIFA World Cup: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లెవరంటే?
మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్ చేసిన నోటితోనే గోల్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్‌కప్ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్ కంటే కాస్త ఎక్కువే క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. మాములు ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్ సమరానికి(ఫిఫా వరల్డ్‌కప్) సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్‌ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్‌కప్ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం. మిరొస్లావ్ క్లోజ్ ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా జర్మనీ స్ట్రైకర్ మిరొస్లావ్ క్లోజ్ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లలో 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. క్లోజ్ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈ 24 మ్యాచ్‌లలో 63సార్లు అతడు గోల్డ్పోస్ట్పై దాడి చేసి 16 గోల్స్ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్‌గా మలిచాడు. రొనాల్డో లూయిస్ నజారియో డె లిమా మిరొస్లావ్ క్లోజ్‌కు ముందు అత్యధిక గోల్డ్స్ రికార్డు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ టీమ్‌లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్‌లలోనే 15 గోల్స్ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్‌లలోనే 8 గోల్స్ చేసిన గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్ ఖాతాలో ఐదో టైటిల్ వచ్చి చేరింది. గెర్డ్ ముల్లర్ జర్మనీ లెజెండరీ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ 14 వరల్డ్‌కప్ గోల్స్ చేశాడు. కేవలం రెండు వరల్డ్‌కప్‌లలో అతడు ఇన్ని గోల్స్ చేయడం విశేషం. 1970 వరల్డ్‌ప్‌లో 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్ చేసినన్ని గోల్స్ మరే ఇతర వరల్డ్‌కప్‌లో ఏ ఆటగాడు కూడా చేయలేదు. జస్ట్ ఫాంటెయిన్ ఫ్రాన్స్ స్ట్రైకర్ ఫాంటెయిన్కు ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో ఏకంగా 13 గోల్స్ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్‌కప్ ఇదే కావడం గమనార్హం. పీలే బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే వరల్డ్‌కప్‌లలో 12 గోల్స్ చేశాడు. అతడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్ బూట్ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్ చేయడంతోపాటు ఆరు గోల్స్ కావడంలో సాయపడ్డాడు. ఇప్పుడు ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ థామస్ ముల్లర్, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సురెజ్, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్ ఖాతాలో 10 గోల్స్ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు. -
కోక్ బాటిల్ వ్యవహారంతో కోట్లు హాంఫట్, మరి ఈ బీర్ బాటిల్ సంగతేంటి?
మ్యూనిచ్: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ప్రజలకు హాని కలిగించే పానీయాలపై బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. యూరో 2020లో భాగంగా రెండు రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న కోకాకోలా బాటిల్‌ను తీసి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కోలా వద్దు, నీళ్లే ముద్దు అన్న అతని సందేశం కోకాకోలా కంపెనీకి సుమారు రూ.30 వేల కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా కూడా రొనాల్డో రూట్లోనే వెళ్లాడు. నిన్న జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన పోగ్బా.. తన ముందు ఉన్న హైనెకెన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టాడు. మరి పోగ్బా చేసిన ఈ పని వల్ల సదరు బీర్ కంపెనీకి ఎంత నష్టం వాటిల్లబోతుందో లెక్కకట్టే పనిలో పడ్డారు మార్కెట్ నిపుణులు. After #POR captain Cristiano Ronaldo and his Coca Cola removal, #FRA’s Paul Pogba makes sure there’s no Heineken on display 🍺 #EURO2020 pic.twitter.com/U9Bf5evJcl — Sacha Pisani (@Sachk0) June 16, 2021 కాగా, ఇస్లాం మతాన్ని ఆచరించే పోగ్బాకు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదు. ఈ విషయాన్ని అతను చాలాసార్లు బహిరంగా ప్రస్తావించాడు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆల్కహాల్ ఉత్పత్తి అయిన బీర్ బాటిల్‌ను పక్కకు పెట్టడం ద్వారా మందుపై తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రత్యక్షంగా బహిర్గతం చేశాడు. పోగ్బాలా ఇస్లాంను ఆచరించే మరికొందరు క్రీడాకారులు సైతం మద్యం ఉత్పత్తుల ప్రమోషన్‌కు దూరంగా ఉంటారు. ఇంగ్లీష్ క్రికెటర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, దక్షిణాఫ్రికా మాజీలు హాషిమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్‌లు మద్యం కంపెనీల పేర్లను తమ దుస్తులపై ధరించేందుకు సైతం ఇష్టపడరు. హైనెకెన్ బేవరేజ్ కంపెనీ ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020కి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: రొనాల్డో చర్య.. కోకా కోలాకు భారీ డ్యామేజ్.. మరి ఆ యాడ్! -
రొనాల్డొ ‘ధనా’ధన్!
ట్యూరిన్ (ఇటలీ): అది వరల్డ్ కప్ కానీ, ప్రపంచవ్యాప్త లీగ్‌లు కానీ ఫుట్‌బాల్ అంటేనే ‘ధనా’ధన్! ఎటుచూసినా కోటాను కోట్ల డబ్బు ప్రవహిస్తుంటుంది. ఇక ఇందులో ఆటగాళ్ల ‘విలువ’ గురించి చెప్పేదేముంటుంది. పైగా క్రిస్టియానో రొనాల్డో వంటి ఆల్‌టైమ్ దిగ్గజం విషయంలో ప్రతిదీ సంచలనమే. అలాంటి మరో ఘటనే ఇది. ఇటీవలే రూ. 846 కోట్ల బదిలీ ఒప్పందంతో స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన యువెంటస్ క్లబ్‌కు మారిన ఈ పోర్చుగల్ సారథి... ఆ క్లబ్ జట్టు తరఫున బరిలో దిగకుండానే తన ధరలో సగం మొత్తం సంపాదించి పెట్టేశాడు. అదీ ఒక్క రోజులోనే కావడం విశేషం. క్రిస్టియానో రొనాల్డొ పేరును కుదించి, దానికి అతడి నంబరును జోడించి యువెంటస్ క్లబ్ ‘సీఆర్7’ పేరిట జెర్సీలను సోమవారం అమ్మకానికి పెట్టింది. ఇంకేం... 5 లక్షల 20 వేల జెర్సీలు హాట్‌కేకుల్లా ఎగిరిపోయాయి. వీటిలో 20 వేల జెర్సీలను అభిమానులు యువెంటస్ అధికారిక స్పాన్సర్ ఆడిడాస్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయగా, 5 లక్షల జెర్సీలకు ఆన్లైన్లో ఆర్డరిచ్చారు. తద్వారా ఒక్క రోజే 5 కోట్ల 40 లక్షల యూరోలు (రూ. 420 కోట్లు) సమకూరాయి. వీటిలో యువెంటస్ ప్రామాణిక షర్ట్ విలువ 104 యూరోలు (రూ. 8,300) కాగా, రెప్లికా షర్ట్ 45 యూరోలు (రూ. 3,600) ఉంటుంది. 2016 సీజన్ మొత్తంలో అమ్ముడైన యువెంటస్ జెర్సీలే 8.50 లక్షలు కావడం గమనార్హం. మరోవైపు రొనాల్డొ బదిలీ ఫీ -
సాకర్ వర్ల్డ్ కప్ నేడు క్వార్టర్ ఫైనల్స్
-
కవాని లేకపోతే కష్టమే!
క్వార్టర్ ఫైనల్స్ తొలి రోజు రెండు దక్షిణ అమెరికా జట్ల కోసం సవాల్ ఎదురు చూస్తోంది. బ్రెజిల్, ఉరుగ్వేలు బెల్జియం, ఫ్రాన్స్‌లతో తలపడబోతున్నాయి. పోటీ తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు కానీ మా పొరుగు దేశపు రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్ల సేవలకు దూరం కానున్నాయి. కోచ్ టిటె మార్గదర్శనంలో కాస్మిరో బ్రెజిల్ డిఫెన్స్‌లో కీలకంగా మారాడు. జట్టు రక్షణశ్రేణిలో ప్రభావం చూపాడు. గత మ్యాచ్‌లో రెండు కార్డులు అందుకోవడంతో బెల్జియంతో మ్యాచ్‌కు దూరం కావడం బ్రెజిల్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. మరో వైపు ఉరుగ్వే స్టార్ ఎడిన్సన్ కవాని కూడా గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదని నాకు తెలిసింది. ఒక వేళ ఇదే జరిగితే ఇద్దరు అటాకింగ్ ఆటగాళ్లలో ఆ జట్టు ఒకరిని కోల్పోయినట్లే. నాలుగేళ్ల క్రితం పూర్తిగా నెమార్పై ఆధారపడినదానితో పోలిస్తే ఈ సారి బ్రెజిల్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే కాదు... నెమార్, కౌటిన్హోలతో కూడిన వారి అటాక్ మరింత పదునెక్కుతోంది. గత మ్యాచ్‌లో విలియన్ కూడా రాణించాడు. తొలి మ్యాచ్‌లో మినహా గత మూడు మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా ఇవ్వని డిఫెన్స్‌ను ప్రశంసించవచ్చు. 4–2–3–1తో టిటె పాటిస్తున్న వ్యూహంలో అంతా బాగుంది. అయితే ఒక ప్రధాన ఆటగాడు దూరమైన నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి. 0–2తో వెనుకబడి కూడా జపాన్‌పై గెలవడంతో వరుసగా నాలుగు విజయాలు పూర్తి చేసుకున్న బెల్జియంలో ఆత్మవిశ్వాసం నిండుగా కనిపిస్తోంది. ఎడెన్ హజార్డ్, డి బ్రూయిన్లాంటి మిడ్‌ఫీల్డర్లు, లుకాకు స్థాయి స్ట్రయికర్‌తో పటిష్టంగా ఉంది. పైగా మానసికంగా దృఢంగా ఉండటం జట్టును తిరుగులేనిదిగా మార్చింది. డిఫెన్స్ అంత గొప్పగా లేకపోయినా బ్రెజిల్‌ను ఒక ఆటాడించగలదు. 3–4–2–1 ఫార్మేషన్లో బెల్జియం బ్యాక్‌లైన్ బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ విభాగంలో ప్రత్యర్థి తమపై ఒత్తిడి పెంచకుండా ఆ జట్టు చూసుకోవాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను ఇంటికి పంపించిన జట్లు మరో క్వార్టర్ ఫైనల్లో తలపడుతున్నాయి. మెస్సీ జట్టు అర్జెంటీనాను ఫ్రాన్స్, రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను ఉరుగ్వే ఓడించడంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించలేదు. కేవలం ఒక్క ఆటగాడిపైనే ఆధారపడిన ఆ టీమ్‌లపై సమష్టి ఆటతో ఈ రెండు జట్లు విజయం సాధించాయి. గతంలో నేను చెప్పినట్లు బలమైన మిడ్‌ఫీల్డ్, అటాకింగ్ కలగలిపి ఫ్రాన్స్‌ను దుర్భేద్యంగా మార్చాయి. చిన్న అవకాశాలను కూడా అద్భుతంగా వాడుకోగల ఇద్దరు స్ట్రయికర్లు ఉన్న ఉరుగ్వే ప్రత్యర్థికి అంత తొందరగా లొంగే రకం కాదు. కవానీ గాయం ఉరుగ్వేనుబాధించేదే. అతను లేకుండా అటాక్ బలహీనంగా మారిపోతుంది. సురెజ్‌తో అద్భుత సమన్వయం ఉన్న కవాని లేకపోతే కోచ్ ఆస్కార్ తన 4–1–2–1–2 వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. వారి డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ ఇలాంటి మ్యాచ్‌లో ప్రధాన ఆటగాడు లేకపోతే చాలా కష్టమే. ఫ్రాన్స్ బలమంతా మిడ్‌ఫీల్డర్లే. ఆ భాగంలో మెరుగ్గా ఉంటే జట్టు గెలవగలదు. ఎంబాపెలాంటి ఆటగాడు వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది. అతనికి మంచి స్వేచ్ఛనివ్వడంతో తన వేగంతో అర్జెంటీనాపై అద్భుతం చేసి చూపించాడు. ప్రత్యర్థి దృష్టంతా అతనిపైనే ఉంటుంది కాబట్టి ఉరుగ్వేతో ఎంబాపెకు అంత సులభమైన అవకాశాలు రాకపోవచ్చు. అన్ని అంశాలను బట్టి చూస్తే ఫ్రాన్స్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉరుగ్వే కూడా ఎక్కడ తగ్గకుండా ఆడటం ఖాయం. -
రొనాల్డో మాయ...
సమకాలీన ఫుట్‌బాల్‌లో తనను గొప్ప క్రీడాకారుడిగా ఎందుకు పరిగణిస్తారో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో నిరూపించాడు. మాజీ విశ్వవిజేత స్పెయిన్‌తో జరిగిన ప్రపంచకప్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో రొనాల్డో అంతా తానై తన జట్టును ముందుండి నడిపించాడు. ఓటమి తప్పదనుకున్న స్థితిలో 25 గజాల దూరం నుంచి ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్‌గా మలిచి చివరకు పోర్చుగల్‌కు ‘డ్రా’నందం కలిగించాడు. సోచి (రష్యా): ప్రొఫెషనల్ లీగ్‌లలో క్లబ్ జట్ల తరఫున ఎన్నో అద్భుత గోల్స్ చేసిన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అసలు సమరంలోనూ సత్తా చాటుకున్నాడు. వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడుతోన్న ఈ మేటి ఫార్వర్డ్ ప్లేయర్ స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపమే ప్రదర్శించాడు. ఒకవైపు స్పెయిన్ జట్టంతా ఆడుతున్నట్లు అనిపించగా... మరోవైపు రొనాల్డో ఒక్కడే పోర్చుగల్‌ను నడిపించాడు. ఈ క్రమంలో రొనాల్డో ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో విజృంభించడంతో స్పెయిన్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 3–3తో ‘డ్రా’గా ముగించింది. ఫలితం తేలకపోవడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో 4వ, 44వ, 88వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. స్పెయిన్ జట్టుకు డిగో కోస్టా 24వ, 55వ నిమిషాల్లో రెండు గోల్స్ అందించగా... 58వ నిమిషంలో నాచో మరో గోల్‌ను సాధించాడు. తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఈనెల 20న మొరాకోతో పోర్చుగల్.... ఇరాన్‌తో స్పెయిన్ తలపడతాయి. తాను ఆడిన గత మూడు ప్రపంచకప్‌లలో (2006, 2010, 2014) కేవలం ఒక్కో గోల్ మాత్రమే చేసిన రొనాల్డో ఈసారి మాత్రం తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 33 ఏళ్ల ఈ రియల్ మాడ్రిడ్ క్లబ్ ప్లేయర్ నాలుగో నిమిషంలోనే బోణీ చేశాడు. ‘డి’ బాక్స్‌లో రొనాల్డోను స్పెయిన్ ప్లేయర్ నాచో మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. రొనాల్డో ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 20 నిమిషాల తర్వాత స్పెయిన్ స్కోరును సమం చేసింది. తొలి అర్ధభాగం ముగిసేందుకు మరో నిమిషం ఉందనగా గోల్ పోస్ట్ దిశగా రొనాల్డో బలంగా కొట్టిన కిక్‌ను స్పెయిన్ గోల్‌కీపర్ అడ్డుకోకపోవడంతో పోర్చుగల్ ఖాతాలో రెండో గోల్ చేరింది. రెండో అర్ధ భాగంలో స్పెయిన్ జోరు పెంచింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పోర్చుగల్ దాడులను నిలువరిస్తూ విజయం దిశగా సాగిపోయింది. ఇక స్పెయిన్ ఖాతాలో విజయం చేరుతుందనగా అద్భుతం చోటు చేసుకుంది. 88వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచాడు. ►1 ప్రపంచకప్ చరిత్రలో ‘హ్యాట్రిక్’ సాధించిన పెద్ద వయస్కుడిగా రొనాల్డో (33 ఏళ్ల 130 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు నెదర్లాండ్స్ ప్లేయర్ రాబ్ రెన్సెన్బ్రింక్ (30 ఏళ్ల 335 రోజులు) పేరిట ఉండేది. 1978 ప్రపంచకప్‌లో ఇరాన్‌పై రెన్సెన్బ్రింక్ ఈ ఘనత సాధించాడు. ►4 నాలుగు వేర్వేరు ప్రపంచకప్‌లలో కనీసం ఒక గోల్ చేసిన నాలుగో ప్లేయర్‌గా రొనాల్డో గుర్తింపు పొందాడు. గతంలో మిరోస్లావ్ క్లోజ్, ఉవీ సీలార్ (జర్మనీ), పీలే (బ్రెజిల్) మాత్రమే ఈ ఘనత సాధించారు. ►51 ప్రపంచకప్ చరిత్రలో ఇది 51వ హ్యాట్రిక్. వ్యక్తిగతంగా రొనాల్డో కెరీర్లోనూ ఇది 51వ హ్యాట్రిక్ కావడం విశేషం. ►1 పోర్చుగల్ తరఫున ఆడుతూ డైరెక్ట్ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచడం రొనాల్డో కెరీర్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 45వ ప్రయత్నంలో రొనాల్డో ఇలా చేశాడు. ►1 వరుసగా ఎనిమిది పెద్ద టోర్నీల్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్‌గా రొనాల్డో నిలిచాడు. 2004 యూరో టోర్నీ మొదలుకొని ప్రస్తుత ప్రపంచ కప్ వరకు అతని ఖాతాలో గోల్స్ చేరాయి. -
రెండు మేటి... రెండు పోటీ!
అటువైపు మాజీ చాంపియన్ స్పెయిన్... ఇటువైపు రొనాల్డో సైన్యం పోర్చుగల్... ఈ రెండు గట్టి జట్ల కారణంగా ఫిఫా ప్రపంచకప్–2018 గ్రూప్ ‘బి’ ఆసక్తికరంగా మారింది. మిగతా గ్రూప్‌లలో ప్రమాదకర ప్రత్యర్థులు తర్వాతి దశలో ఎదురయ్యే అవకాశం ఉంది. ‘బి’లో మాత్రం స్పెయిన్, పోర్చుగల్ మధ్య లీగ్ దశలోనే హోరాహోరీ సమరం తప్పదు. దీంతో మొత్తం ఎనిమిది గ్రూప్‌ల్లో ఇందులోనే పోటీ ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నది. ఇరాన్, మొరాకోలు సంచలనాలు సృష్టిస్తేనే తప్ప... 1, 2 స్థానాలు యూరప్ జట్లవేనని చెప్పొచ్చు. రొనాల్డోపైనే భారం! జట్టంతా ఒక ఎత్తు. రొనాల్డో ఒక్కడే ఒక ఎత్తు. దీన్నిబట్టే ప్రపంచ కప్‌లో పోర్చుగల్ ప్రయాణం అతడిపై ఎంతగా ఆధారపడి ఉందో చెప్పొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్న ఈ సూపర్ స్టార్ చిరకాల కోరిక నెరవేరేందుకు ఇదే చివరి అవకాశం. భిన్న దేశాల ఆటగాళ్లుండే లీగ్‌లలో అద్భుతంగా రాణించే రొనాల్డోకు... జాతీయ జట్టులో మాత్రం ఇంతకాలం సరిజోడైన ఆటగాళ్లు లేరు. దీంతో పోర్చుగల్ అతడే ఒక సైన్యంగా బరిలో దిగాల్సి వచ్చేది. అయితే, దృఢమైన డిఫెండర్ పెపె, బంతిని చక్కగా అందించే జావో మౌంటిన్హో, కొత్త కెరటం ఆండ్రె సిల్వలతో ఈసారి కొంత మార్పు కనిపిస్తోంది. రొనాల్డోకు దాడులకు వీరి ఆట తోడైతే తిరుగుండదు. అనుభవజ్ఞులుండటంతో కొంత ఆశలు రేపుతోంది. రొనాల్డో లేకుండా కూడా తాము టైటిల్స్ గెలవగలమని 2016 యూరోపియన్ చాంపియన్ షిప్లో పోర్చుగల్ నిరూపించింది. నాడు స్టార్ ఫార్వర్డ్ గాయంతో దూరమైనప్పటికీ ఈ జట్టు... ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించడం గమనార్హం. కీలకం: రొనాల్డో, పెపె. 33 ఏళ్ల వయసులో రొనాల్డో తన అనుభవాన్నంతా రంగరించి ఆడాల్సిన అవసరముంది. కప్ అందిస్తే మాత్రం ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిపోతాడు. కోచ్: శాంటోస్. 2014లో బాధ్యతలు స్వీకరించాడు. జట్టుకు దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను సృష్టించాడు. ఇది రొనాల్డో పనిని సులువు చేయనుంది. ప్రపంచ ర్యాంక్: 4 చరిత్ర: ఏడు సార్లు క్వాలిఫై అయింది. 1966లో మూడో స్థానంలో, 2006లో నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఇరాన్ రాణించేనా? ఆసియా నుంచి ఈసారి తొలి బెర్త్ దక్కించుకున్న జట్టు ఇరాన్. వరుసగా రెండోసారి క్వాలిఫై అయింది. మొదటి అర్హత రౌండ్లో 18 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. రెండో రౌండ్లో ఓ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2014లో ఒక్క విజయం కూడా లేకుండానే కప్ నుంచి నిష్క్రమించింది. కీలకం: సర్దార్ అజ్మన్. 22 ఏళ్ల ఈ ఫార్వర్డ్ 2015 ఆసియా కప్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చాడు. కోచ్: కార్లోస్ క్విరెజ్. పోర్చుగల్ దేశస్తుడు. 2014కు ముందునుంచి కొనసాగుతున్నాడు. తాము రష్యా వెళ్తున్నది విహార యాత్రకు కాదంటూ ప్రకటించాడు. ప్రపంచ ర్యాంక్: 36 చరిత్ర: ఐదోసారి బరిలో నిలిచింది. ఎన్నడూ గ్రూప్ దశ దాటలేదు. 1978లో 14వ స్థానంలో నిలవడమే మెరుగైన రికార్డు. ముందడుగేస్తే గొప్పే... ఆఫ్రికా ఉత్తర ప్రాంత దేశమైన మొరాకో 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. హకీమ్ జియెచ్, యూనెస్ బెల్హాండా వంటి ప్రతిభావంతులైన యువకులతో ఆసక్తి రేపుతోంది. అయినా దిగ్గజ జట్లను దాటుకుని ముందుకెళ్లాలంటే శక్తికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కోచ్ హెర్వ్ రెనార్డ్. జియెచ్ మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినా, ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవాలి. కీలకం: నబిల్ దిరార్. గత సీజన్లో ఫ్రెంచ్ లీగ్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కోచ్: హెర్వ్ రెనార్డ్. ఫ్రాన్స్ దేశస్తుడు. జట్టులో క్రమశిక్షణ, విజయ కాంక్ష పెంచాడు. మెరుపు దాడులతో పాటు, చక్కటి డిఫెండింగ్ వ్యవస్థను రూపొందించాడు. గతంలో జాంబియా, ఐవరీకోస్ట్ జట్లను తీర్చిదిద్దాడు. ప్రపంచ ర్యాంక్: 42 చరిత్ర: ఇప్పటివరకు ఆరుసార్లు క్వాలిఫై అయింది. 1986లో 11వ స్థానంలో నిలవడమే గొప్ప ప్రదర్శన. టికి టకా ఎందాకనో! టికి టకా...ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్పెయినే. తక్కువ దూరం పాస్‌లతో ఆకట్టుకునే ఈ తరహా ఆటతో 2010లో జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది. కానీ, తర్వాత నుంచి అనూహ్యంగా వెనుకబడింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగి... 23వ స్థానంతో దారుణ పరాభవం పాలైంది. 2016లో యూరో కప్‌నూ నిలబెట్టుకోలేకపోయింది. అయితే, సెర్గియో రామోస్, గెరార్డ్ పికె వంటి డిఫెండర్లు, స్ట్రయికర్ అల్వారో మొరాటా, డిగో కోస్టా, గోల్ కీపర్ డేవిడ్ డె గీతో పాటు నాణ్యమైన మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్లున్నందున ఈసారి ముందడుగు వేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. కీలకం: 34 ఏళ్ల ఆండ్రెస్ ఇనెస్టా. 2010 ప్రపంచకప్‌లో గోల్‌తో కప్ సాధించి పెట్టాడు. ఈసారి ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కోచ్: జులెన్ లొప్టెగ్యు. మాజీ గోల్ కీపర్ అయిన ఇతడు జట్టులో పునరుత్తేజం నింపాడు. తన ఆధ్వర్యంలోనే స్పెయిన్... 10 క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది. ఇటలీని ఏకంగా 3–0తో ఓడించింది. ప్రపంచ ర్యాంక్: 8 చరిత్ర: 14 సార్లు క్వాలిఫై అయింది. 2010 చాంపియన్. 1950లో 4వ, 2002లో 5వ స్థానంలో నిలిచింది. 2014లో 23వ స్థానంలో నిలవడం జట్టు చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం. -
అణువంత దేశాలు... ఆటలో చిరుతలు!
మారడోనా... జినెదిన్ జిదాన్.. రొనాల్డో... మిరొస్లావ్ క్లోజ్! ...తమ తమ దేశాలకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించిన స్టార్లు. మనందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేర్లు కూడా. జార్జి బెస్ట్... ర్యాన్ జిగ్స్... ఇయాన్ రష్... జారి లిట్మనెన్! ...మరి వీరెవరో తెలుసా? కనీసం ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఆ అవకాశమే లేదు! కానీ, వీరూ ఫుట్‌బాలర్లే! పై వరుసలో చెప్పుకున్నంత గొప్పవారు కాకున్నా తేలిగ్గా తీసిపారేసే వారైతే కాదు. అయితే, వీరి గురించి ఎక్కడా, ఎప్పుడూ చెప్పుకోరేం? కనీసం లీగ్‌ల్లో అయినా ప్రస్తావన రాదేం? ఎందుకంటే... వీరి దేశాలు ప్రపంచకప్‌కు ఎన్నడూ అర్హత సాధించలేదు కాబట్టి. అయినా, మహా సంగ్రామానికి అర్హత పొదండం అంత ఆషామాషీ కాదు కదా? అందుకనే ఈ స్టార్లు సూపర్ స్టార్లు కాలేకపోయారు. మరోవైపు కొన్ని చిన్న దేశాలు మాత్రం ఈ విశ్వ క్రీడా సంబరంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆట గొప్పదా? దేశం గొప్పదా? అంటే... ఆటతో దేశం గొప్పతనాన్ని చాటడం గొప్ప అంటున్నాయి. ఇంతకీ ఆ దేశాలేమంటే...! సాక్షి క్రీడా విభాగం: ‘అదంతా అలా సాగిపోయింది. అయినా ఎలాంటి బాధ, విచారం లేదు. ఆటలోని పోటీతో పాటు ఆటగాళ్లందరిపైనా నాకు గౌరవం ఉంది. ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం అంత సులువు కాదు’ ఈ మాటలన్నది లైబీరియన్ మాజీ ఫుట్‌బాలర్, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు జార్జ్ వీ. ఫిఫా ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్, బ్యాలెన్ డి ఓర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెల్చుకున్న ఆటగాడీయన. కానీ లైబీరియా ప్రపంచ కప్‌లో ఎన్నడూ ఆడకపోవడంతో పేరు బయటకు రాలేదు. కెరీర్ ముగిశాక రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆటగాడిగా ఈయన గురించి వెదికితే ఏకంగా అధ్యక్షుడిగా కనిపించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ద్వారా తమ చిన్న దేశానికి సాధ్యమైనంత పేరు తెచ్చానన్న సంతృప్తిలో ఉన్నారీయన. మేటి ఆటగాళ్లయిన బెస్ట్ (ఉత్తర ఐర్లాండ్), జిగ్స్, రష్ (వేల్స్), లిట్మనెన్ (ఫిన్లాండ్) సైతం జార్జ్ వీ కోవలోకే వస్తారు. వీరి దేశాలు చిన్నవి అయినందునే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం ఉంది. కానీ, కొంత అదృష్టం లేకపోవడం కూడా ఓ కారణమనే చెప్పాలి. ఆసియా ఆటకు అంతా కలిసొస్తేనే... కొన్ని చిన్న దేశాలు అర్హత సాధించలేకపోయినంత మాత్రాన పెద్ద దేశాలే ఫుట్‌బాల్‌ను శాసిస్తున్నాయని చెప్పడానికీ వీల్లేదు. ఆ మాటకొస్తే ఆసియాలో కోట్ల కొద్దీ జనాభా ఉన్న చైనా (2002), భారత్ (1950), ఇండోనేసియా (1938) ఒక్కొక్కసారి మాత్రమే అర్హత సాధించాయి. వివిధ కారణాలతో భారత్ ఈ అవకాశాన్నీ వదులుకుంది. చైనా 16 ఏళ్లుగా క్వాలిఫై కావడం లేదు. ఇక ఆసియా–యూరప్‌ల మధ్య ఉండే టర్కీది చిత్రమైన కథ. ఆ జట్టు 1948 తర్వాత 2002 కప్‌నకు అర్హత సాధించి, ఏకంగా మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఈసారి మాత్రం బెర్త్ సంపాదించలేకపోయింది. ఆఫ్రికా... ఎదుగుతున్నా ఎదురుచూపే! దక్షిణ అమెరికా, యూరప్ తర్వాత ఫుట్‌బాల్‌కు ప్రాణం పోస్తున్నది ఆఫ్రికా ఖండమే. 1998, 2002లో అర్హత సాధించిన దక్షిణాఫ్రికా 2010లో ఆతిథ్యం కూడా ఇచ్చింది. తర్వాత మాత్రం ఊసులో లేదు. సెనెగల్ కొన్నిసార్లు సంచలనాలు సృష్టించింది. ఈసారి దాంతోపాటు ఈజిప్ట్, మొరాకో, నైజీరియా, ట్యునీషియా పోటీ పడుతున్నాయి. ఇదే ఖండంలోని మాలి, సూడాన్‌లలోనూ సాకర్‌కు క్రేజ్ ఉంది. అయినా అరంగేట్రం కలగానే ఉంటోంది. కాంగోకు 1974 ప్రపంచకప్పే మొదటిది, చివరిది. ఉరుగ్వే దూకుడు... పరాగ్వే పరుగులు... బ్రెజిల్, అర్జెంటీనా వంటి దిగ్గజ దేశాల ఖండం దక్షిణ అమెరికా. వీటి సమీపంలో కేవలం 34 లక్షల జనాభా ఉన్న దేశం ఉరుగ్వే, 70 లక్షల జనాభా ఉన్న దేశం పరాగ్వే. ఉరుగ్వే రెండుసార్లు ప్రపంచ చాంపియన్. 20 ప్రపంచకప్లకుగాను 11 సార్లు క్వాలిఫై అయింది. ‘దేశం చిన్నదా? పెద్దదా? ఎంత జనాభా ఉన్నారు? అన్నది ప్రతిభకు అడ్డంకి కాదు. మా దేశంలో ఆట పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది’ అంటున్నాడు డిఫెండర్ విక్టోరినో. ‘గొప్ప చరిత్ర, అభిమానుల మద్దతున్న దేశం తరఫున ఆడుతుంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అది ఫుట్‌బాల్ పట్ల ఉన్న నిజమైన ఆసక్తి’ అని అతడి సహచరుడు గిగో పెరెజ్ చెబుతున్నాడు. ఇక పరాగ్వే 2011 కోపా అమెరికా టైటిల్ విజేత. ఏడుసార్లు కప్‌నకు అర్హత సాధించింది. ఈసారి విఫలమైనా ఆ దేశ స్థాయికిది గొప్పే. యూరప్ జట్టయిన డెన్మార్క్ 1986లో అరంగేట్రం చేసి... అప్పటి నుంచి మంచి ప్రతిభనే కనబరుస్తోంది. ‘50 లక్షల జనాభా ఉన్న మా దేశం చాలా చిన్నది. ప్రపంచకప్ గెలవాలంటే ఏడు పెద్ద జట్లను ఓడించాలి. కోటి జనాభా ఉన్న దేశాలకంటే మేం ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిం చాం’ అనేది డెన్మార్క్ ఫార్వర్డ్ నిక్లస్ బెన్ట్నర్ అభిప్రాయం. కేవలం 3 లక్షల 50 వేల జనాభా ఉన్న ఐస్లాండ్... 40 లక్షల జనాభా ఉన్న పనామా తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించి సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. ప్రపంచ కప్‌నకు అర్హత పొందిన అతి తక్కువ జనాభా ఉన్న దేశంగా ఐస్లాండ్ కొత్త రికార్డు కూడా నెలకొల్పింది. ‘ఫుట్‌బాల్ చిన్న దేశాలను పెద్దదిగా చేస్తుంది’... ఇది కామెరూన్ లెజెండ్ రోజర్ మిల్లా మాట. అవును పై ఉదాహరణలతో నిజమేననిపిస్తోంది కదా! -
ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో
పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు. అంతేకాకుండా రియల్ మాడ్రిడ్ జట్టుకు లా లీగా (స్పానిష్ లీగ్), చాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ను అందించాడు. తన అద్భుత ప్రతిభతో వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు పోర్చుగల్ అర్హత సాధించడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. -
కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు. స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్‌కు వచ్చింది. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది. ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్‌ల సరసన నిలుస్తుంది. సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..? యూరో ఫైనల్ నేడు ⇒ తొలి టైటిల్‌పై పోర్చుగల్ గురి ⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం ⇒ రొనాల్డో, గ్రిజ్మన్లపైనే దృష్టి రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్‌గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్‌గా నిలపాలని గ్రిజ్మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్‌కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు. 2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్‌లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్‌లో పోర్చుగల్‌ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడగా జిదానే ఏకైక గోల్‌తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది. పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్‌తో అందరికన్నా ముందున్న గ్రిజ్మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్‌ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్‌లో వేల్స్‌పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్‌లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్‌కు ఇబ్బందులు తప్పవు. -
రొనాల్డో గర్జించాడు
యూరో ఫైనల్లో పోర్చుగల్ 2-0తో వేల్స్‌పై విజయం రొనాల్డో గర్జించాడు. అవును.. క్లబ్‌కు మాత్రమే బాగా ఆడతాడనే అపవాదును తునాతునకలు చేస్తూ ఇదిగో ఇదీ నా సత్తా అంటూ విమర్శకులకు తన కిక్ పవర్ ఏమిటో చూపాడు. ఇప్పటిదాకా ఆడిందేమిటని ఆడిపోసుకున్న వారే వహ్వా.. రొనాల్డో అని మనస్ఫూర్తిగా అనేలా సింహగర్జన చేశాడు. వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో అతడి విశ్వరూపం చూసి మ్యాచ్ ఆద్యంతం ఈ స్టార్ నామస్మరణతో స్టేడియం మోతెక్కింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతా తననెందుకు కీర్తిస్తారో చాటుకుంటూ... కీలక సమయంలో గోల్ చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే రెండో గోల్ అందేలా కృషి చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అటు గ్యారెత్ బేల్ ఎంత ప్రయత్నం చేసినా తన జట్టు వేల్స్ అద్భుత ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. లియోన్: సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈసారి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరైన సమయంలో జూలు విదిల్చి స్థాయికి తగ్గ ఆటతీరుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. యూరో కప్‌లో భాగంగా బుధవారం వేల్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 2-0తో నెగ్గిన పోర్చుగల్ ఫైనల్లో ప్రవేశించింది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నిర్ణీత సమయంలో పోర్చుగల్‌కు దక్కిన తొలి విజయమిదే. ఫ్రాన్స్, జర్మనీ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం పోర్చుగల్ టైటిల్ కోసం పోరాడుతుంది. జట్టు తరఫున రొనాల్డో (50వ నిమిషంలో), నాని (53వ ని.) గోల్స్ చేశారు. యూరో కప్‌లో పోర్చుగల్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2004లో ఫైనల్‌కు చేరి గ్రీస్ చేతిలో ఓడింది. మరోవైపు మ్యాచ్‌లో పట్టు కోసం విశ్వప్రయత్నం చేసినా వేల్స్ ఫలితం సాధించలేకపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ తన ప్రయత్నాలను గోల్స్‌గా మలచలేకపోవడంతో వేల్స్ సూపర్ జర్నీ సెమీస్‌లో ముగిసింది. మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్సే నిషేధం కారణంగా మ్యాచ్‌కు దూరమవడం కూడా ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 16వ నిమిషంలోనే పోర్చుగల్ తొలి గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. వేల్స్ పెనాల్టీ ఏరియాలో కుడివైపు నుంచి మరియో ఆడిన షాట్ గోల్‌పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. మరోవైపు బేల్ 23వ ని.లో సెంటర్‌లైన్ కుడివైపు నుంచి గోల్ పోస్ట్‌లోకి బంతిని షూట్ చేసినా అది నేరుగా గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 44వ ని.లో ఎడ్రియన్ సిల్వా ఎడమ వైపు నుంచి వేల్స్ గోల్ పోస్ట్ ముందుకు క్రాస్ షాట్ ఆడగా.. రొనాల్డో బంతిని హెడర్ చేశాడు. అయితే బంతి గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లడంతో గోల్రాలేదు. ద్వితీయార్ధం 53వ నిమిషంలో పోర్చుగల్ బోణీ చేయగలిగింది. రఫెల్ గురేరో అందించిన కార్నర్ షాట్‌ను పెనాల్టీ ఏరియాలో మెరుపులా పైకి ఎగిరిన రొనాల్డో హెడర్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు నిమిషాలకే సాంచెస్ ఇచ్చిన పాస్‌ను రొనాల్డో గోల్ పోస్ట్‌వైపు ఆడగా.. అక్కడే ఉన్న నాని డైవ్ చేస్తూ ఎడమ కాలితో బంతిని నెట్లోకి పంపాడు. దీంతో పోర్చుగల్‌కు 2-0 ఆధిక్యం లభించింది. తర్వాత 63వ ని.లో రొనాల్డో ఫ్రీకిక్ గోల్‌పోస్ట్ రాడ్ పైనుంచి వెళ్లింది. చివర్లో వేల్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పోర్చుగల్ కీపర్ పాట్రికియో వమ్ము చేయడంతో ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. యూరో కప్‌ల్లో అత్యధిక గోల్స్ (9) చేసిన ఆటగాడు రొనాల్డో. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం మైకేల్ ప్లాటిని సరసన నిలిచాడు. -
రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్
లియోన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఎట్టకేలకు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో మెరిశాడు. టోర్నీ ఆరంభం నుంచి స్థాయికి తగిన ప్రదర్శన చేయడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న రొనాల్డో.. బుధవారం రాత్రి వేల్స్‌తో జరిగిన కీలక సెమీస్‌లో సత్తా చాటడంతో పోర్చుగల్ యూరో కప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. దీంతో.. సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని భావించిన వేల్స్‌కు నిరాశే మిగిలింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ 50వ నిమిషంలో రొనాల్డో అద్భుతమైన హెడ్డర్‌తో పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం రొనాల్డో షాట్‌ను నాని గోల్‌గా మలచడంతో 2-0తో పోర్చుగల్ విజయం సాధించింది. గురువారం రాత్రి ఫ్రాన్స్, జర్మనీల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో పోర్చుగల్ ఫైనల్లో తలపడనుంది. -
పోర్చుగల్ గట్టెక్కింది
యూరో సెమీస్‌లో రొనాల్డో సేన క్వార్టర్స్‌లో పోలాండ్ ఓటమి పెనాల్టీ షూటౌట్‌తో తేలిన ఫలితం యూరో నాకౌట్ మ్యాచ్‌లో అతి పిన్న వయసులో గోల్ చేసిన ఆటగాడిగా సాంచెజ్ (18 ఏళ్ల 317 రోజులు) నిలిచాడు. పోర్చుగల్‌కు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. ఈసారి యూరోలో ఒక్కసారి కూడా నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవకపోయినా, నాకౌట్‌కు చేరిన ఆ జట్టు ఇప్పుడు కూడా అదే తరహాలో ముందంజ వేసింది. పెనాల్టీ షూటౌట్లో పోలాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగు పెట్టింది. మ్యాచ్ ఆద్యంతం రొనాల్డోను వెనక్కి నెడుతూ కుర్రాడు సాంచెజ్ తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకోగా... పోలాండ్ స్టార్ లెవెండోస్కీ గోల్ చేసినా నిరాశే మిగిలింది. మార్సెల్లీ : గత ఐదు యూరోలలో నాలుగోసారి పోర్చుగల్ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో పోర్చుగల్ 5-3 తేడాతో పోలాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో షూటౌట్‌ను నిర్వహించారు. ఇందులో పోర్చుగల్ ఐదు సార్లూ సఫలం కాగా, పోలాండ్ ఆటగాడు బ్లాజికోస్కీ నాలుగో షాట్‌ను పోర్చుగల్ గోల్ కీపర్ పెట్రీసియో అడ్డుకున్నాడు. అంతకు ముందు నిర్ణీత సమయంలో పోలాండ్ తరఫువ లెవెండోస్కీ (2వ నిమిషం), పోర్చుగల్ తరఫున రెనాటో సాంచెజ్ (33వ నిమిషం) గోల్స్ సాధించారు. మెరుపు ఆరంభం పోలాండ్‌కు లెవెండోస్కీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాచ్ 100వ సెకన్లోనే అతను గోల్ నమోదు చేశాడు. మిడ్ఫీల్డ్నుంచి ఇచ్చిన పాస్‌ను సోరెస్ సరిగా అందుకోలేకపోవడంతో బంతి గ్రాసికీ వైపు చేరింది. అతను కొట్టిన లో క్రాస్ షాట్‌ను లెవెండోస్కీ గోల్‌గా మలిచాడు. యూరో చరిత్రలో ఇది రెండో వేగవంతమైన గోల్ కావడం విశేషం. గత అక్టోబర్ తర్వాత ఈ స్టార్ ఆటగాడు తొలిసారి అంతర్జాతీయ గోల్ సాధించాడు. ఈ సమయంలో రొనాల్డో చురుగ్గా ఆడి రెండు సార్లు పోస్ట్‌పై దాడి చేశాడు. అయితే గోల్ సాధ్యం కాలేదు. 17వ నిమిషంలో లెవెండోస్కీ కొట్టిన మరో చక్కటి షాట్‌ను కీపర్ పెట్రీసియో అడ్డుకున్నాడు. 28వ నిమిషంలో రొనాల్డోను పాజ్దాన్ దురుసుగా అడ్డుకోవడంతో పోర్చుగల్ పెనాల్టీకి డిమాండ్ చేసింది. అయితే రిఫరీ దానిని తోసిపుచ్చాడు. సూపర్ సాంచెజ్ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన సాంచెజ్ మైదానంలో చెలరేగాడు. కుడి వైపునుంచి నాని ఇచ్చిన పాస్‌ను అందుకున్న అతను పోలాండ్ రక్షణ శ్రేణిని ఛేదించి దూసుకుపోయాడు. మెరుపు వేగంతో కొట్టిన షాట్‌ను క్రైచోవిక్, కీపర్ ఫాబియాన్స్కీ ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పది నిమిషాల తర్వాత రొనాల్డో కొట్టిన షాట్ బయటి నెట్‌కు తగులుతూ వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా మరో రెండు సార్లు సునాయాస అవకాశాలు వచ్చినా రొనాల్డో సఫలం కాలేకపోయాడు. అదనపు సమయం 10వ నిమిషంలో పోలాండ్ ఆటగాడు మిలిక్ కూడా అవకాశం చేజార్చాడు. అదనపు సమయంలోనూ గోల్స్ రాకపోవడంతో... ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఇందులో పోలాండ్ ఆటగాడు బ్లాజికోస్కీ విఫలమయ్యాడు. షూటౌట్ సాగిందిలా... పోర్చుగల్ స్కోరు పోలాండ్ రొనాల్డో 1-1 లెవెండోస్కీ సాంచెజ్ 2-2 మిలిక్ మౌటిన్హో 3-3 కామిల్ గ్లిక్ నాని 4-3 బ్లాజికోస్కీ రికార్డో 5-3 - ఫలితం తేలిపోవడంతో పోలాండ్ ఐదో షాట్‌ను తీసుకోలేదు -
రొనాల్డో <vs> లెవెండోస్కీ
నేడు పోర్చుగల్, పోలాండ్ క్వార్టర్స్ మ్యాచ్ మరో గోల్ చేస్తే రొనాల్డో కొత్త చరిత్ర యూరో కప్ మార్సెల్లీ: క్లబ్ స్థాయిలో తిరుగులేని సూపర్ స్టార్లు... యూరోపియన్ ఫుట్‌బాల్‌లోనూ హేమాహేమీలే... కానీ తమ దేశాల తరఫున ఇంతవరకు అనుకున్న స్థాయిలో మాత్రం ఆడలేకపోయారు. ఒకరు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అయితే... మరొకరు పోలాండ్ ఆటగాడు రొబెర్టో లెవెండోస్కీ... ఇప్పుడు ఈ ఇద్దరికి మరో అవకాశం వచ్చింది. యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నేడు (గురువారం) ఇరుజట్ల మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇరువురూ తమ జట్లను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేని పోర్చుగల్... ప్రిక్వార్టర్స్‌లో క్రొయేషియాపై మాత్రం నెగ్గింది. అయితే నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేయకుండా పూర్తిగా రక్షణాత్మక ధోరణితో ఆడిందనే విమర్శలను ఎదుర్కొంది. అయితే క్వార్టర్స్ మ్యాచ్‌లో తమ ప్రదర్శనతో వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని రొనాల్డో బృందం భావిస్తోంది. అలాగే యూరో చరిత్రలో అత్యధిక గోల్స్ (9) చేసిన మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్) రికార్డును సమం చేసేందుకు రొనాల్డో ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను పూర్తి చేయాలని అతను తహతహలాడుతున్నాడు. పోర్చుగల్ తరఫున సాంచెస్, పెపె, గోమెస్, నాని, మారియో వంటి ఆటగాళ్లు చెలరేగితే... పోలాండ్‌కు కష్టాలు తప్పవు. ప్రిక్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లో స్విట్జర్లాండ్‌ను ఓడించిన పోలాండ్ తొలిసారి యూరో టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకుంది. దీంతో మరో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్‌కు చెక్ పెట్టాలని ఆటగాళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గోల్ కూడా చేయని లెవెండోస్కీ షూటౌట్లో మాత్రం అదరగొట్టాడు. దీంతో మరోసారి అతనిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖాముఖి రికార్డులో పోర్చుగల్, పోలాండ్ 10 సార్లు తలపడ్డాయి. పోర్చుగల్ నాలుగు మ్యాచ్‌ల్లో, పోలాండ్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. నేటి రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
వచ్చే ఏడాది భారత్‌కు రొనాల్డో!
మకావు: ఐఎస్ఎల్ మ్యాచ్‌ను తిలకించేందుకు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో... వచ్చే ఏడాది భారత్‌కు రానున్నా డు. తన స్నేహితుడు, జట్టు మాజీ సహచరుడు రొబోర్టో కార్లోస్ ఈ మేరకు అతన్ని ఆహ్వానించాడు. ‘భారత్‌కు వెళ్లడం నాకు చాలా ఇష్టం. ఐఎస్ఎల్ మ్యాచ్‌ను చూడాలని ఉంది. కానీ ఈ ఏడాది కుదరడం లేదు. బ్రెజిల్‌కు తిరి గి వెళ్లాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది కచ్చితంగా భారత్‌కు వచ్చి మ్యాచ్ చూస్తా’ అని ఆసియా పోకర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొం టున్న రొనాల్డో వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌లో మళ్లీ ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పోకర్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకున్నానని చెప్పిన ఈ బ్రెజిలియన్.. మైదానంలో ఉండే భావోద్వేగాలను మిస్సవుతున్నానని వెల్లడించాడు. 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడిన రొనాల్డో... రెండుసార్లు బ్రెజిల్‌కు వరల్డ్‌కప్ అందించాడు. -
మెస్సీ, రోనాల్డో కంటే అతనే బెస్ట్!
గోథెన్ బర్గ్(స్వీడన్): తన దృష్టిలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ, పోర్చుగల్ దిగ్జజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డ్ లు అత్యుత్తమ ఆటగాళ్లు కానేకాదని బ్రెజిల్ లెజెండ్ రాబొర్టో కార్లోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచమంతా వారిద్దర్ని అత్యుత్తమ ఆటగాళ్లుగా భావిస్తున్నా.. వారు తమ తమ జట్లుకు సాధించి పెట్టింది ఏమీ లేదంటూ కార్లోస్ ఎద్దేవా చేశాడు. ఐసీఎల్(ఇండియన్ సూపర్ లీగ్)లో ఢిల్లీ డైనమాస్ కు ఆటగాడిగా, మేనేజర్ గా కొనసాగుతున్న కార్లోస్.. తన దృష్టిలో ఫుట్ బాల్ లో చెప్పుకోదగిన ఆటగాడు ఎవరైనా ఉంటే అది నెయమార్ మాత్రమేని స్పష్టం చేశాడు. 'లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డ్ లు గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచలోని ఫుట్ బాల్ అభిమానులు అనుకుంటారు. నా దృష్టిలో వారికంటే నెయమార్ ఓ గొప్ప ఆటగాడు. బ్రెజిల్ ను నెయమార్ అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లడమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది' అని కార్లోస్ తెలిపాడు. -
మా అమ్మ నన్ను చంపాలనుకుంది
రొనాల్డో... ప్రపంచ ఫుట్ బాల్ ఫ్యాన్స్ అందరూ రొనాల్డో అంటే పడిచస్తారు. కానీ రొనాల్డో తల్లి మాత్రం ఆ బిడ్డ వద్దనుకుంది. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. గర్భస్రావం చేయించుకునేందుకు ప్రయత్నించింది. చివరికి భారీ వ్యాయామాలు చేసి, వేడి ఆల్కహాల్ తాగి గర్భం పోగొట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ రియల్ మాడ్రిడ్ ఆటగాడైన రొనాల్డో మహా గట్టిపిండం. ఇంత చేసినా గర్భస్రావం జరగలేదు. వదిలించుకోవాలని విదిలించుకున్నా అతను తల్లి గర్భాన్ని వదల్లేదు గాక వదల్లేదు. అలా పోరాటం చేయడం, పోరాడి గెలవడం రొనాల్డోకి చిన్నప్పుడే అలవాటైపోయిందని తల్లి డోలోరెస్ అవియెరో అంటున్నారు రొనాల్డో తల్లి తన జీవిత గాథను మదర్ కరేజ్ అన్న పేరిట పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకంలోనే ఈ సంఘటనను ఆమె రాసింది. పుట్టకముందే బిడ్డను తాను చంపాలనుకున్న విషయం తాను రోనాల్డోకి చెప్పానని, అప్పుడప్పుడూ అతను తనను ఈ విషయంలో ఆటపట్టిస్తూంటాడని కూడా తల్లి తన ఆత్మకథలో రాసింది. ఆ తల్లి ప్రయత్నాలు విఫలం కావడం వల్లే మనకి రొనాల్డో వంటి అద్భుతమైన ఫుట్ బాల్ ఆటగాడు దొరికాడు. -
సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...
భలే ఆప్స్ సాకర్ మానియా ఆరంభమైంది. బ్రెజిల్లో రొనాల్డో, మెస్సీల చమత్కారాలు, స్కోరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బోలెడు అప్లికేషన్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. స్కోర్లతోపాటు మ్యాచ్‌లు, క్రీడాకారులకు సంబంధించిన లోతైన విశ్లేషణలు అందించేందుకు ఈఎస్పీఎన్ ఒక అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. మీకు ఇష్టమైన జట్టును ఎంచుకుని వాటి వివరాలను అలర్ట్‌ల రూపంలో పొందవచ్చు. ఇక ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీని నిర్వహిస్తున్న ఫీఫా కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వివరాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా ఫీఫా 14, వన్ఫుట్బాల్బ్రెజిల్, ట్రావెల్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఎడిషన్, ద స్కోర్ పేర్లతో కూడా అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లు సాకర్ సంబరాన్ని మీ చేతుల్లోకి తెస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఎంజాయ్ ‘ద బ్యూటిఫుల్ గేమ్’!