![Ronaldo as world's best footballer - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/24/ronold.jpg.webp?itok=z3lxFdWn)
పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు.
అంతేకాకుండా రియల్ మాడ్రిడ్ జట్టుకు లా లీగా (స్పానిష్ లీగ్), చాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ను అందించాడు. తన అద్భుత ప్రతిభతో వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు పోర్చుగల్ అర్హత సాధించడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment