cockroach
-
'కాక్రోచ్'.. ఓ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తీస్తున్న కొత్త సినిమా 'కాక్రోచ్'. విజయదశమి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే వయలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని అంటున్నారు. పాత కొత్త నటీనటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.(ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతూ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
బాబోయ్ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.బొద్దింకను ఎలా గుర్తించారు?ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు. -
ఇంటిప్స్: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?
రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం. పరిష్కార మార్గాలు.. కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మూలల్లో బోరిక్ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇవి చదవండి: హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో? -
బొద్దింకలు, చీమలతో విసిగిపోయారా? ఇవిగో చిట్కాలు!
వేసవికాలం వచ్చిందంటే చీమలు, బొద్దింకల బెడద ఎక్కువవుతుంది. వేసవిలోనే ఈ సమస్య ఎందుకుపెరుగుతుందో తెలుసా? మరి వీటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అనేక ఇతర జంతువుల వలె, చీమలు కూడా గడ్డకట్టే శీతల ఉష్ణోగ్రతల నుంచి బయటికొస్తాయి. శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. కొద్దిగా వాతావరణం మారగానే బొద్దింకలు, చీమలు, ఇతర కీటకాలకు ఆహారం కోసం బయటికి రావడం మొదలు పెడతాయి. ఉష్ణోగ్రత వేడెక్కడం ప్రారంభించిన తర్వాత, చీమలు కొత్త గూళ్ళు నిర్మించడం ప్రారంభిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన చీమలు మరింత చురుకుగా జతకడతాయి. సంతానం ఉత్పత్తి చేస్తాయి. ఇది సహజ జీవన చక్రంలో భాగం మాత్రమే. నీరు, వేడి లేదా ఆహారం కోసం వెతుకులాటలో చీమలు, బొద్దింకలు ఈ విషయంలో 'మాస్టర్స్’ అని చెప్పొచ్చు. చీమలు, బొద్దింకల నివారణకు రసాయనాలు, పాయిజన్‌తో నిండిన హిట్, బోరాక్స్ పౌడర్, ఇతర స్ప్రేలతో పోలిస్తే కొన్ని సహజ నివారణ పద్ధతులు పాటించడం ఉత్తమం. వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులు ఉంచండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన బొద్దింకలు, చీమలకు పడదు అందుకే అవి ఉన్నచోటికి సాధారణంగా రావు. దోసకాయ ముక్కలుగానీ, దోసకాయ తొక్కలుగానీ చీమల రంధ్రాల దగ్గర ఉంచండి. అలాగే బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు, ఇతర కీటకాలకు ఈ వాసన పడదట. వైట్ వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు. ఇంకా ఈగలు, బొద్దింకలు వంటి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పొడి , పుదీనా ఆకులను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. చీమల సమస్యకు కాఫీ పొడి చల్లినా కూడా ఫలితం ఉంటుంది. చెత్త డబ్బాలు తరచుగా క్లీన్ చేయంగా, ఓపెన్‌గా గాకుండా బిగుతుగా ఉండేలా మూతలు పెట్టాలి. నోట్: ఈగలు, చీమలు, బొద్దింకలు, బల్లులు ఇలాంటివి మన వంట ఇంటి ముఖం చూడకుండా ఉండాలంటే. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు, పండ్లపై మూతలు కచ్చితంగా పెట్టాలి. వంట ఇంటి సింక్‌లో గంటల తరబడి అంట్ల గిన్నెలను వదిలేయ కూడదు. రాత్రి పూట అసలు వదిలేయ కూడదు. సాధ్యమైనంతవరకు ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. -
ఊపిరితిత్తుల్లో బొద్దింక..కంగుతిన్న వైద్యులు!
ఊపిరితిత్తుల్లో బొద్దింక! అదెలా సాధ్యం అనిపిస్తోంది కదూ. కానీ ఇది నిజం వైద్యులే ఆ బొద్దింకను గుర్తించి కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కేరళకి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మాములుగానే తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ సమస్య ఉన్నటుండి ఒకరోజు మరింత దారుణంగా ఉంది. ఇక అతడు తాళ్లలేక ఆస్పత్రిని ఆశ్రయించాడు. శ్వాసకోశ సమస్యలున్న ఆ వ్యక్తి ఆస్పత్రి చేరేటప్పటికీ పరిస్థితి మరింత దిగజారి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడమే చాల కష్టతరమయ్యింది. ఎందువల్ల ఇలా జరిగింది? అని పల్మనాలజీ వైద్య బృందం అతడికి పలు వైద్య పరీక్షలు చేశారు. చివరికి స్కానింగ్‌లో సుమారు 4 సెంటిమీటర్ల బొద్దింక ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల అతడి శ్వాసకోశ సమస్యలు మరింత జఠిలంగా మారాయని తెలుసుకున్నారు. ఇక వెంటనే వైద్యులు దాదాపు ఎనిమిది గంటలు శ్రమించి అతడికి సర్జరీ చేసి ఊపరితిత్తుల్లో ఉన్న బొద్దింకను తొలగించారు. అయితే ఇలా బొద్దింక వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. మరీ అతని ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా చేరిందని వైద్యులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆ రోగికి ఉన్న శ్వాసకోస సమస్యలు కారణంగా మెడలో శ్వాసనాళం అమర్చి దాని గుండా ఆక్సిజన్ని తీసుకునే ఏర్పాటు చేశారు వైద్యులు. అయితే అతడు రాత్రి పడుకునేటప్పుడూ ఆ ట్యూబ్‌ని మూసేయడం మరిచిపోవడంతో బొద్దింక లోపలకి ప్రవేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు డాక్టర్లు. (చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!) -
బొద్దింకను చంపబోయి.. ఏకంగా ఇంటినే తగలబెట్టాడు
రాజమౌళి ఈగ సినిమా గుర్తుంది కదా.. అందులో విలన్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చివరకు ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు. సరిగ్గా ఇలాంటి సీన్ జపాన్‌లో రిపీట్ అయ్యింది. బొద్దింకను చంపే ప్రయత్నంలో ఓ వ్యక్తి ఏకంగా ఇంటిని తగటబెట్టాడు. ఏమైందంటే.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి బొద్దింక చొరబడింది. దీంతో ఎలాగైనా దాని భరతం పడదామని, పెద్ద మొత్తంలో బొద్దింకల్ని చంపే స్ప్రేను పిచికారీ చేశాడు. అంతే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఒక్కసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై స్పై చేయడంతో మంటలు చెలరేగాయి. ఈ ధాటికి అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించగా, సదరు వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఎలక్ట్రికల్ అవుట్లెట్ల దగ్గర పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది. పిచికారీ స్ప్రేలల్లో ప్రొపేన్, బ్యూటేన్తో పాటు ఆల్కహాల్ వంటి మండే స్వభావం ఉన్న ప్రొపెల్లెంట్లు ఉంటాయని, వీటి వల్ల ఒక్కోసారి ఇలా పేలుడు జరిగే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది. -
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం..
భోపాల్: వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన నాటినుండి ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగానో, సౌకర్యాల విషయంలోనే ఎదో ఒక విధంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ ట్రైన్ మరోసారి ట్రెండింగ్ అయ్యింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ అభాగ్యుడికి ఫుడ్ పార్సిల్ లో బొద్దింక రావడంతో రైలు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పైన పటారం లోన లొటారం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సరికొత్త హంగులతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ రైళ్ళలో అంతా అత్యాధునికమేనని ప్రచారం చేస్తుండటంతో ఆహారం కూడా హైజీనిక్ గా ఉంటుందని భావించి ఫుడ్ ఆర్డర్ చేశాడో అభాగ్యుడు. తీరా ఆర్డర్ వచ్చాక ఆత్రుతతో ఓపెన్ చేసి చూస్తే రోటీలకు బొద్దింక అతుక్కుని ఉంది. దీంతో రోటీలకంటే ముందు ఖంగుతిన్న ప్రయాణికుడు సుబోధ్ పహాలాజన్ ఈ ఉదంతం మొత్తాన్ని ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోటీకి అతుక్కున్న బొద్దింక ఫోటో తోపాటు వందే భారత్ రైలులో నాకు ఒక బొద్దింక వచ్చిందని క్యాప్షన్ కూడా రాశారు. దీనికి రైల్వే కేటరింగ్ సేవ వారు స్పందింస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. మీ పీఎన్ఆర్ నెంబరు ఫోన్ నెంబరు మాకు డైరెక్ట్ మెసేజు పంపగలరు అని కోరుతూనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl — pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023 ఇది కూడా చదవండి: మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు -
సిరులు కురిపించే బొద్దింకల పెంపకం.. హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న కాక్రోచ్ స్నాక్స్!
ప్రపంచం చాలా విశాలమైనది. ఇక్కడ కనిపించే వింతలకు, విశేషాలకు కొదవేలేదు. అలాగే ఇక్కడ రకరకాల జీవజాతులున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆహార అభిరుచులు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. కొందరు శాకాహారులుగా జీవనం సాగిస్తుండగా, మరికొందరికి మాసం లేనిదే ముద్దదిగదు. కొన్ని దేశాల్లో పాములను ఇష్టంగా తింటారు. మరికొన్ని దేశాల్లో పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. చేపలు, కోళ్ల పెంపకం గురించి మనకు తెలిసిందే. ఇదేవిధంగా కొన్ని దేశాల్లో పాములు, పురుగుల పెంపకం కొనసాగుతుంటుంది. తేనెటీగల పెంపకం మాదిరిగానే చైనాలో భారీ ఎత్తున బొద్దింకల పెంపకం సాగుతుంటుంది. ఇది వినగానే మనకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇక్కడి ప్రజలలో చాలామంది బొద్దింకల స్నాక్స్ తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. పిల్లల చేత కూడా బొద్దింకల స్నాక్స్ తినిపిస్తారు. బొద్దికలు, ఇతర కీటకాలలో ప్రొటీన్ అధిక మోతాదులో ఉండటాన్ని గుర్తించిన చైనావాసులు వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. చైనాలోని షిచాంగ్ పట్టణంలో భారీ స్థాయిలో బొద్దింకల పెంపకం సాగుతోంది. ఈ వీటి పెంపకం కోసం కలపతో ప్రత్యేకమైన బోర్డులను తయారుచేస్తారు. వీటిలో ప్రత్యేకమైన పద్ధతులలో బొద్దింకలను పెంచుతారు. ప్రస్తుతం చైనాలో వేల సంఖ్యలో బొద్దింకల ఫార్మ్లున్నాయి. వీటి నిర్వాహకులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు! -
Warangal: బిర్యానీలో బొద్దింక
సాక్షి, వరంగల్: వరంగల్ హంటర్ రోడ్డులోని అవంత గ్రాండ్ హోటల్ నిర్వాహకుల అజాగ్రత్త వల్ల బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవంత గ్రాండ్ హోటల్‌కు బిర్యానీ తినేందుకు కొంత మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. వారికి వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీంతో బల్దియా ఎంహెచ్ఓ రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. బల్దియా అధికారులు అక్కడికి చేరుకుని బిర్యానీని పరిశీలించి హోటల్ నిర్వాహకులకు రూ.15వేల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఆ తర్వాత అదే యువకులపై హోటల్ నిర్వాహకులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు ప్రత్యక్షం.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే.. -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు
బాసర(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్ నిర్వాహకులు. మీడియాలో వరుస కథనాలతో సీరియస్ అయిన సర్కార్... మెస్ నిర్వహణపై కలెక్టర్ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ట్రిపుల్ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
చిక్కడపల్లి: వెజ్ బిర్యానీలో బొద్దింక..
Cockroach Found In Biryani: వెజ్ బిర్యానీలో బొద్దింక కనిపించడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేసిన ఘటన చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో నివసించే గణపతిశాస్త్రి నందినిసుధా హోటల్లో గురువారం వెజ్ బిర్యానీ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా అందులో బొద్దింక కనిపించింది. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జీహెచ్ఎంసీ హెల్ప్ విభాగం అధికారులు ఆ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే హోటల్‌ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
గులాబ్ జామూన్లో బొద్దింక.. రూ.55 వేల పరిహారం
సాక్షి, బనశంకరి: బెంగళూరులో ఓ రెస్టారెంట్లో కస్టమర్‌కు బొద్దింక పడిన గులాబ్ జామూన్ ఇచ్చినందుకు రూ.55 వేల భారం పడింది. 2016లో రాజణ్ణ అనే వ్యక్తి గాంధీనగరలోని కామత్‌హోటల్‌లో జామూన్ తీసుకున్నారు. అందులో చనిపోయిన బొద్దింక కనబడింది. దానిని అతడు మొబైల్లో వీడియో తీస్తుండగా రెస్టారెంట్ సిబ్బంది మొబైల్‌ను లాక్కోవడానికి యత్నించారు. ఈ తతంగంపై అతడు ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. రెండేళ్లయినా సమాధానం రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, వినియోగదారుల ఫోరంలోనూ కేసు వేశాడు. ఫోరం విచారణ జరిపి బాధితుడు రాజణ్ణకు రూ.55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది. చదవండి: (తల్లీకొడుకు ప్రాణాలు తీసిన బజ్జీలు) -
‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’
మన దగ్గర వచ్చే కొన్ని సినిమాలు, సీరియల్స్‌లోని సన్నివేశాలు చూస్తే ఓవరాక్షన్కే.. ఓవరాక్షన్ నేర్పించే సత్తా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఏ సీరియల్, ఏ సినిమా అనే టాపిక్ వద్దు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ హిందీ సిరీయల్‌కు సంబంధించిన సీన్ చూస్తే.. మీకు కడుపులో తిప్పుతుంది. యాక్ థూ ఇదేం దరిద్రం అని తిట్టుకోకమానరు. ఆ ఓవర్‌యాక్షన్ సీన్ వివరాలు.. (చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్) కొన్నేళ్ల క్రితం హిందీలో టెలికాస్ట్ అయిన ‘దిల్ సే ది దువా సౌభాగ్యవతి భవా’ సీరియల్లోని సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిలో హీరో-హీరోయిన్ల ఫస్ట్ నైట్ సన్నివేశం వస్తుంది. హీరో ప్రేమగా హీరోయిన్ను దగ్గరకు తీసుకునే సమయంలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆమె ఒంటి మీదకు బొద్దింక ఎక్కుతుంది. దాన్ని చూసి హీరోయిన్ తన మీద పాము పడ్డట్లు ఫీలై భయంతో అల్లంత దూరం పారిపోతుంది. (చదవండి: ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ) ఇక మన హీరో గారు ఆ బొద్దింకను దొరకబుచ్చుకుని.. తన భార్యను భయపెట్టినందకు ప్రతీకారంగా.. దాన్ని చంపాలనుకుంటాడు. కానీ హీరోయిన్ వారించడంతో ఆగిపోతాడు. ఆ సమయంలో అతడికి ఓ తింగరి ఆలోచన వస్తుంది. బొద్దింక మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం భార్య తన కోసం తెచ్చిన పాలల్లో దాన్ని వేసి.. శుభ్రంగా తాగి.. తృప్తిగా బ్రేవ్మంటాడు. (చదవండి: భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా) ఈ సన్నివేశం చూసి అటు హీరోయిన్‌కి ఇటు వీడియో చూస్తున్న మనకు ఒకేసారి కళ్లు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు సీరియల్ దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి.. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు చూస్తే మా జీవితం మీద మాకే విరక్తి కలుగుతుంది.. యాక్ థూ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. -
మున్సిపల్ కమిషనర్ నాన్‌వెజ్ ఆర్డర్ .. బిర్యానీలో బొద్దింకలు..
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్):‘చలో.. నడుబై మస్తు బిర్యానీ తిందాం..’ అంట పేరున్న హోటళ్లలో చాలామంది దావత్‌లు చేసుకోవడం సాధారణమైంది. పెద్దపెద్ద బిల్డింగ్‌లలో, హైఫై ఏర్పాట్లతో, ‘గ్రాండ్’గా ఉన్న పేర్లను చూసి పోతుంటారు. ఫైవ్‌స్టార్ రేంజ్లో ఆర్డరు తీసుకోవడం చూసి సంబరపడతారు. ‘ఆ.. రెండు చికెన్, ఒకటి మటన్ బిర్యానీ తీసుకురా.. చికెన్ల లెగ్‌పీస్ ఉండాలె..’అని ఆర్డర్లు ఇస్తుంటారు. ఇక ఆ తర్వాత హోటల్ వాళ్లు పైపై మెరుగులు అద్ది, వేడివేడీగా వడ్డిస్తారు. నచ్చిన తిండి ముందుకు వచ్చింది కదా.. అని ఏమాత్రం చూసుకోకుండా తింటే.. ఇక అంతే సంగతులు. మీ అదృష్టం కొద్ది అందులో ఏ పురుగులో, బొద్దింకలో ఫ్రీగా రావచ్చు. లేదంటే కుళ్లిన చికెన్, మురిగిన మటనే రంగులు అద్దుకుని మీకు అందవచ్చు. ఇదేంటీ.. ఇలా అంటారా..! జిల్లాకేంద్రంలో ఇలాగే జరిగింది. అదికూడా పోయిపోయి సాక్షాత్తు మున్సిపల్ అధికారులకే ఎదురు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలా వెళ్తే.. ఏదో అలా.. సిబ్బంది కలిసి మధ్యాహ్న భోజనం చేద్దామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది స్థానిక మంచిర్యాల రోడ్డులో బయటకు ఆకట్టుకునేలా ఉన్న ఓ ‘గ్రాండ్’ హోటల్ కు వెళ్లారు. నాన్‌వెజ్ తినేందుకు ఆర్డర్ ఇచ్చారు. వారు ఇచ్చిన ఆర్డర్ మేరకు వేడీగా బిర్యానీలు వచ్చేశాయి. వాటిని తింటూ ఉంటే.. ముందుగా ఒకరికి ఓ పురుగు వచ్చింది. సర్లే.. ఏదో వచ్చిందనుకున్నారు. కాసేపటికే మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఇందులో ఏదో తేడా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. అంతే.. అక్కడి వాతావరణం, ఫ్రిజ్‌లలో ఎప్పుడో నిల్వ చేసిన నాన్‌వెజ్‌లను చూసి అవాక్కయ్యారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తే.. అందులో కుళ్లిన చికెన్, మటన్, రెండుమూడు రోజుల క్రితం చేసి పెట్టిన లెగ్‌పీసులు నిల్వ చేసి ఉంచారు. పేరుకే పెద్ద హోటళ్లు.. జిల్లాలో చాలా హోటళ్లలో ఇదే తీరు ఉంది. పేరుకేమో పెద్ద హోటళ్లు కానీ.. లోపల కిచెన్లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు. మున్సిపల్ అధికారులు పరిశీలింన సదరు ‘గ్రాండ్’లో హోటల్ కిచెన్‌రూం మధ్యలో నుం ఓపెన్ డ్రెయినేజీ ఉంది. వండిన బిర్యానీ పాత్రను దానిపైనే ఉంచారు. పక్కనే చెత్త, మురికిని పట్టించుకోకుండా అలాగే వండిన పదార్థాలను పెట్టేశారు. ఇక ఫ్రిజ్‌లలో కుక్కిన నాన్‌వెజ్‌ను చూస్తే ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు కుళ్లిపోయి. వాటినే కట్‌చేసి కస్టమర్లకు వండిస్తుండటం గమనా ర్హం. ఇక్కడే కాదు.. చాలా హోటళ్లల్లోన ఇలాంటి పరిస్థితే ఉంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిన్న హోటళ్లలో మరీ దారుణంగా కనీస పరిశుభ్రతను పాటించడం లేదు. కల్తీ నూనెలను, కుళ్లిన పదార్థాలకు రంగులు అద్దుతూ వడ్డిం చేస్తున్నారు. తమ విధుల ప్రకారం తరచూ తనిఖీలు చేస్తే మున్సిపల్ అధికారులకు ఇలా ఎదురయ్యేది కాదని పలువురు సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడం కొసమెరుపు. చర్యలు తప్పవు.. ప్రతి హోటల్లో కచ్చితంగా పరిశుభ్రత పాటించా లి. నిల్వ చేసినవి కాకుండా తాజా పదార్థాలతో వండినవే ప్రజలకు అందించాలి. లేనిపక్షంలో కఠిన చ ర్యలు తప్పవు. మంచిర్యాలరోడ్డులో గల హో టల్లో కిచెన్‌ను సీజ్ చేశాం. ర.50వేల ఫైన్‌కూడా వేశాము. యాజవన్యం సదరు జరిమానాను చెల్లించారు. –బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
Tokyo Olympics: అనుకోని అతిథి.. కెమెరాలన్ని దానివైపే
టోక్యో: కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గ్రౌండ్లన్ని వెలవెలబోతున్నాయి. మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నప్పటికి అభిమానుల గోలలు, ఈలల సందడి కనిపించడం లేదు. అయితే అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లో ఒక బొద్దింక ప్రత్యక్షమైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హోర్డింగ్‌పై బొద్దింక పాకుతుండడం కనిపించింది. ఇంకేముంది మ్యాచ్‌ను కవర్ చేస్తున్న అర్జెంటీనా కెమెరామన్ మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింకను చూపించాడు. ఆటగాళ్ల నుంచి కెమెరాను మరో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్లో సంచరిస్తున్న బొద్దింకను లైవ్‌లో చూపించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ఈరోజు మ్యాచ్‌కు అనుకోని అతిథి స్టేడియానికి వచ్చింది.. మీరంతా తప్పక చూడాలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు అతను షేర్ చేసిన వీడియోనూ 70 లక్షల మంది చూడగా.. 65వేల రీట్వీట్లు వచ్చాయి. లైవ్‌లో ప్రసారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నప్పటికి ఆ అతిథి మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ?? pic.twitter.com/KQmuQPPJAt — man (@s6ntispam) July 26, 2021 -
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు
బ్యాంకాక్: మనిషి జీవితంలో ఆస్తులు సంపాదించడం ఎంత కష్టమో.. ఒక్కసారి అనారోగ్యం పాలైతే అన్నేళ్లు సంపాదించుకున్న ఆస్తులన్ని హరించుకుపోవడమే కాక.. కొత్తగా అప్పుల పాలవ్వడం కూడా అంతే సహజం. ఏం చేస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉండరు.. సదుపాయాలుండవు.. చేతిలో రూపాయి లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రులు దరిదాపులకు కూడా రానివ్వవు. మనుషులమయ్యిండు సాటివారి పట్ల ఏమాత్రం మానవత్వం చూపించని రోజలు ఇవి. అలాంటిది ఇక మూగజీవులను పట్టించుకుంటామా.. అయితే అందరు ఇలానే ఉంటారా అంటే కాదు.. అక్కడక్కడ మానవత్వం మెండుగా ఉన్న వారు.. తోటి వారి గురించి ఆలోచించే వారు ఉంటారు. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి. ఇతగాడు గాయపడిన బొద్దింక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడి మంచి మనసు చూసి కదిలిపోయిన డాక్టర్ ఆ బొద్దింకను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే, అది మనుషుల హాస్పిటల్ కాదులెండి.. పశువుల ఆస్పత్రి. ఆ వివరాలు.. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది. దాని పరిస్థితి చూసి దను మనసు కరిగిపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అదేంటీ ఇతడు బొద్దింకను తీసుకొచ్చారని.. అక్కడ ఎవరూ ఎగతాళి చేయలేదు. ఆ హాస్పిటల్‌లోని డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించాడు. దానికి ఉచితంగా వైద్యం చేస్తానని దనుకు మాటిచ్చాడు. ఈ అరుదైన ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ బొద్దింక బతికేందుకు 50-50 చాన్సులు మాత్రమే ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ‘‘ఇది జోక్ కాదు. ఇది ప్రతి జీవి పట్ల కరుణ, జాలిని సూచిస్తుంది. ప్రతి జీవి ప్రాణం విలువైనదే. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచానికి దయ కలిగిన మనుషులు ఎంతో ముఖ్యం’’ అని పేర్కొన్నాడు. ‘‘ఇప్పటివరకు బొద్దింకను రక్షించమని ఎవరూ రాలేదు. ఇలా జరగడం నా సర్వీసులో ఇదే మొదటి సారి. ముఖ్యంగా.. ఇలాంటి చిన్న జీవికి ఎప్పుడూ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని బతికించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే.. అంత చిన్న జీవికి ఆక్సిజన్ అందించడం అంత సులభం కాదు. అందుకే దాన్ని ఆక్సిజన్ కంటైనర్‌లో పెట్టాం. దానివల్ల కనీసం అది ఊపిరి పీల్చుకుని బతికే అవకాశాలు ఉంటాయని భావించాం. ఆ బొద్దింక ప్రాణాలతో బయటపడిన తర్వాత.. నువ్వే బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను. ఇందుకు అతడు అంగీకరించాడు’’ అని డాక్టర్ తెలిపాడు. అయితే, ఆ బొద్దింక బతికిందా.. లేదా చనిపోయిందా అనేది మాత్రం ఆయన తెలపలేదు. ఈ సంఘటన పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న జీవి పట్ల ఎంతో గొప్ప ఉదారత చూపావు.. నీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట -
లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్
వాషింగ్టన్: న్యూస్ రిపోర్టర్‌గా లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత ఈజీ కాదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయాలి. ఒక్కోసారి అనుకోని పరిణామాలు జరిగి రిపోర్టర్స్ తమ ఏకాగ్రతను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలదన్నట్లు సీరియస్ అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ఇంట్లోని పెంపుడు జంతువులో లేక ఇతర జంతువులేవైనా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపిస్తే రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలైనా.. దానిని చూసే వారికి మాత్రం నవ్వు తెప్పించడం ఖాయం. తాజాగా సీఎన్ఎన్ రిపోర్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనూ రాజు అనే వ్యక్తి సీఎన్ఎన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజు వాషింగ్టన్ డీసీలో తన లైవ్ బైట్‌కు సిద్ధమయ్యాడు. దర్జాగా సూట్ వేసుకొని వార్తలు చదివేయడానికి ప్రిపేర్ అయ్యాడు. కెమెరాను చూస్తూ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సూట్‌పై ఒక పరుగు పాకుతుండడం కెమెరాకు చిక్కింది. రాజు దానిని గ్రహించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఆ పురుగు అతని మెడ వద్దకు రావడంతో లైవ్‌లో ఉన్నానన్న విషయం మరిచిన రాజు పురుగును అవతలికి విసిరేశాడు. ఆ తర్వాత పక్కనున్న వారిని '' అలాంటి పురుగులు నా జట్టులో ఉన్నాయా '' అంటూ అడిగాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉండడంతో అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. ఈ వీడియోను స్వయంగా రాజు తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ Had an unwelcome visitor try to crawl into my live shot earlier. pic.twitter.com/Pu68z0cWSN — Manu Raju (@mkraju) May 27, 2021 -
బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట
బొద్దింక ఏమిటి.. పద్దెనిమిది ఇళ్లు మార్పించడం ఏమిటన్న డౌట్ వస్తోందా? నిజమే.. కొత్తగా ఓ పెళ్లయిన జంట బొద్దింకతో పడ్డ అవస్థలు, తర్వాతి చిక్కులు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ కారణం కూడా చాలా సింపులే.. ముందు అసలు కథేమిటో తెలుసుకుందామా? మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు 2017లో ఓ అమ్మాయితో పెళ్లయింది. హాయిగా కొత్త కాపురం పెట్టారు. ఓ రోజు ఆమె కిచెన్‌లో పనిచేసుకుంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టింది. వెళ్లి చూస్తే భయంతో గజగజా వణికిపోతూ కనిపించింది. మళ్లీ కిచెన్‌లోకి వెళ్లనంటే వెళ్లబోనంటూ మొండికేసింది. మరెట్లా అంటే.. ఇల్లే మార్చేద్దామన్నది. సరేనని ఇల్లు మారారు. మళ్లీ అదే సీన్.. మళ్లీ కిచెన్.. గట్టి కేక, భయం, వణుకు.. ఇలా మూడేళ్లలో ఒకటీ రెండు కాదు ఏకంగా 18 ఇళ్లు మార్చాల్సి వచ్చింది. ప్రతిచోటా కిచెన్‌లో ఆమె భయపడి కేక పెట్టినది బొద్దింకలను చూసే. ఇలా భయపడటంతో వదిలేయకుండా చేతికందిన వస్తువు తీసి విసరడం, బొద్దింకలు తాకిన వస్తువులను బయటపడేయడం మొదలుపెట్టింది. అసలు తాము వెళ్లిన ప్రతిచోటా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో, ఏం చేయాలో, ఆమెకు బొద్దింకలంటే ఉన్న భయాన్ని (ఫోబియాను) ఎలా పోగొట్టాలో అర్థంగాక సదరు భర్త తలపట్టుకుంటున్నాడట. -
ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!
బీజింగ్: ఇంట్లో బొద్దింక కనబడితేనే ఒకింత కలవరానికి గురవుతాం. ముఖ్యంగా అమ్మాయిలు వాటిని చూసి చెవులు చిల్లులు పడేలా గోల చేస్తారు. కానీ, చెన్ అమ్మాయి చెవిలో మాత్రం ఓ బొద్దింక ఏకంగా గూడే కట్టేసుకుంది. చెవిలోకి ఎప్పుడు చొరబడిందో ఏమోగానీ, రోజూ వింత శబ్దాలతో ఆ యువతిని బొద్దింక హడలు కొట్టించేది. దాని చర్యలతో ఆమెకు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించేది. దాంతో చెవిలో దుమ్మూధూళీ ఉండొచ్చని ఆమె ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేసేది. అయినా, చెన్కు ఉపశమనం లభించకపోగా నొప్పి మరింత ఎక్కువైంది. చివరకు ఆమె డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. చెన్ చెవిలో బొద్దింక ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆ బొద్దింక బతికే ఉందని తెలియడంతో డాక్టర్లు ఒకింత ఆశ్చర్యం, ఆందోళనకు గురయ్యారు. (ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు) ఒటోస్కోప్ విధానం ద్వారా ఎట్టకేలకు యువతి చెవిలో నుంచి బొద్దింకను డాక్టర్లు బయటకు తీశారు. బొద్దింక ఇంకొన్ని రోజులు చెవిలోనే ఉండి ఉంటే.. కర్ణభేరీకి రంధ్రం చేసి తలలోకి ప్రవేశించేదని డాక్టర్లు పేర్కొన్నారు. చెన్ నిద్రించే సమయంలోనే బొద్దింక చెవిలో దూరి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా! పురుగులు, పాములు, బళ్లుల్ని సైతం వేయించుకు తినే చైనాలో. ఇదిలాఉండగా.. ఇళ్లల్లో తరచుగా క్రిమివినాశకాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చెవిలో ఏదైనా ఉందనే సందేహం కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు. (చదవండి: డబ్ల్యూటీవోకు చైనా: భారత్‌కు అనుకూలించే విషయాలివే!) -
బొద్దింకలను చావగొట్టేందుకు వెళ్లి..
-
ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు
మెల్బోర్న్: చెవిలో విపరీతమైన దురద, నెప్పి రావడంతో ఓ యువకుడు వైద్యుల ను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం అతడి చెవిలో 26 బొద్దింకలున్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది. లీ(19)కి ఒక రోజు రాత్రి కుడి చెవిలో భరించలేని దురద వచ్చింది. వెంటనే వేలు పెట్టి చూడగా విపరీతమైన నొప్పి మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం వారు అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని గుర్తించారు. లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర చర్మం పాడైందని వివరించారు. అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని పేర్కొన్నారు. -
బొద్దింకలతో కొత్త చాలెంజ్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్నే ఏలుతోంది.. ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అయిపోతారో తెలియదు.. ఏ అంశం వైరల్ అవుతుందో తెలియదు.. అదంతా సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుంది. అదీ సోషల్ మీడియా మహిమ. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్.. ఇలా చాలా చాలెంజ్‌లు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అయిపోయాయి. ఇప్పుడేమో తాజాగా మరో చాలెంజ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బొద్దింక తెలుసు కదా.. దాన్ని ముఖంపై పెట్టుకుని సెల్ఫీ దిగి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయాలి. బొద్దింకను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.. అలాంటిది ముఖంపై వేసుకుని ఫొటో దిగడమా.. వాక్ అనుకోకండి. అదే మరి చాలెంజ్ అంటే.. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే.. గత నెలలో మయన్మార్‌కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు పెద్ద బొద్దింకను ముఖం మీద పెట్టుకుని ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టాడు. అంతే ఒక్కరోజులో ఈ పోస్ట్‌ను దాదాపు 20 వేల మంది షేర్ చేశారు. ఇక అప్పటినుంచి మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాల్లో బొద్దింకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా అమెరికన్ జాతికి చెందిన బొద్దింకలను వాడుతున్నారు. ఈ బొద్దింకలను ఆగ్నేయాసియా దేశాల్లో ఇంట్లో పెంచుకుంటుంటారు. చూడాలి ఇంకా ఎలాంటి చాలెంజ్‌లను మనం చూడాల్సి వస్తుందో! -
సీఎం సభ.. జర్నలిస్టుల భోజనంలో బొద్దింక
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాకపట్నంలోని భీమిలిలో బాల సురక్ష వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా జర్నలిస్టులకు పెట్టిన భోజనంలో బొద్దింక రావడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. కాగా, తనపై టీడీపీయే సర్వే చేయించిందని మంత్రి గంటా చంద్రబాబుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చినరాజప్ప మధ్యవర్తిత్వం తర్వాత ఆయన భీమిలి కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వాహనంలో కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో మరో రెండు రోజుల పాటు సెలవులు పొడిగించారు. సెలవుల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బొద్దింక.. దాసోహం జగమింక..
2028.. మే 31.. ఆఫీసు ముగియగానే.. అరవింద్ గబగబా బయల్దేరాడు.. నిన్నటి నుంచి వాళ్లావిడ ఒకటే గోల.. దాన్ని తెమ్మని.. పిల్లలు కూడా మారాం చేస్తున్నారు.. నాన్నా.. ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా తీసుకురావాలి అని.. వాళ్లకది ఎంతో ఇష్టం.. చిన్నదానికైతే మరీనూ.. ఈ ఆలోచనలతోనే హడావుడిగా షాపులోకి వెళ్లాడు.. అంతా వెతికాడు.. ఒకచోట రాసి ఉంది.. మిల్క్ అని.. వెళ్లి చూస్తే.. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు అతడిని వెక్కిరించింది.. ఇప్పుడింట్లో వాళ్లకి ఏం చెప్పాలిరా దేముడా అంటూ నిట్టూర్చాడు.. రఘు కొడుకు అనురాగ్.. స్కూల్లో ఆ రోజు టీచర్ ఇచ్చిన కొత్త తెలుగు పుస్తకం తీసి.. పద్యాలు చదువుతున్నాడు.. ఎప్పుడూ తాను బెల్టు తీస్తే తప్ప.. పుస్తకం తీయని కొడుకు ఆ రోజు తీసేసరికి ఏం చదువుతున్నాడబ్బా అంటూ రఘు కూడా ఆసక్తిగా వింటున్నాడు.. ‘గరిటెడైనను జాలు బొద్దింక పాలు.. కడివెడైన నేమి గోవు పాలు..’ అంటూ పద్యం.. రఘు ముఖంలో వెయ్యి వోల్టుల కాంతి.. లెస్స పలికితివి నాయనా.. బొద్దింక పాలు ది బెస్టూ అంటూ తన భార్య బొద్దింక పాలతో చేసిన టీని చప్పరిస్తూ.. వాహ్ తాజ్ తరహాలో వాహ్ బొద్దింకా.. అంటూ రఘు మైమరిచాడు.. ఇది ప్రస్తుతానికి ఊహే.. కానీ మరికొన్నేళ్లలో నిజం కానుంది.. రేప్పొద్దున ఈ అరవింద్, రఘు ప్లేసులో మీరుండొచ్చు.. నేనుండొచ్చు.. ఎందుకంటే.. భవిష్యత్ బొద్దింక పాలదే అని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు.. ఆవు, గేదె పాలతో పోలిస్తే.. బొద్దింక పాలు అత్యధిక పోషకాలను కలిగి ఉందని.. ఇది సూపర్ ఫుడ్ అని అంటున్నారు. అలాగని ఏ బొద్దింక పడితే.. అది పనికిరాదు. పసిఫిక్ బీటిల్ బొద్దింక.. ఇది ఆస్ట్రేలియా, హవాయి, భారత్, చైనా తదితర దేశాల్లో కనిపిస్తుంది. ఇవి మిగతావాటిల్లాగ గుడ్లను పెట్టవు. మనుషుల్లాగే పిల్లలకు జన్మనిస్తాయి. అయితే, పిండం పెరుగుతున్నప్పుడు ఆడ బొద్దింక గర్భంలోని పిల్లలకు లేత పసుపు రంగులో ఉన్న పాలలాంటి ద్రవాన్ని ఆహారంగా అందిస్తుంది. ఈ పాలలో ఉండే ప్రొటీన్ క్రిస్టల్స్లోనే పోషకాల నిధి దాగుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవు, గేదె పాలతో పోలిస్తే.. ఇందులో మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉన్నాయని ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్న ప్రొఫెసర్ లియోనార్డ్ చవాస్ తెలిపారు. అన్ని రకాల అమినో యాసిడ్లు, కేలరీలు, లిపిడ్స్ ఉన్నాయని చెప్పారు. దీని వల్లే ఆ రకం బొద్దింక పిల్లల ఎదుగుదల కూడా చాలా వేగంగా ఉంటోందని చెప్పారు. ఇందులో ఉన్నన్ని పోషకాలు ఈ భూమ్మీద మరే పాలలో లేవన్నారు. బెంగళూరు కు చెందిన స్టెమ్ సెల్ బయాలజీ సంస్థ కూడా దీనిపై పరిశోధనలు చేస్తోంది. అయితే.. వాటి నుంచి పాలను సేకరించడం అత్యంత క్లిష్టమైన పని.. ఆడ బొద్దింకకు 40 రోజుల వయసు వచ్చినప్పటి నుంచి ఈ ద్రవాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అంటే.. ఆ సమయంలో దాన్ని కోసి.. ఆ ప్రొటీన్ క్రిస్టల్స్‌ను సేకరించాల్సి ఉంటుంది. 100 గ్రాముల పాల కోసం వెయ్యి బొద్దింకలు కావాల్సి ఉంటుంది. ఇక పాల పౌడర్, ఐస్‌క్రీం వంటి ఉత్పత్తులను తయారుచేయాలంటే లక్షలాది బొద్దింకలు కావాలి. ఈ నేపథ్యంలో వాటి నుంచి పాలను సేకరించేందుకు సరళమైన పద్ధతులను కనుగొనడంతోపాటు ప్రయోగశాలలో ఇలాంటి పోషకాలున్న పాలనే సృష్టిస్తే ఎలాగుంటుంది అనేదానిపైనా పరిశోధనలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం తొలిసారిగా ఈ బొద్దింక పాలు విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మళ్లీ ఇది వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయట. అన్నీ కలిసొస్తే.. కొన్నేళ్లలో ఇది మార్కెట్లోకి రావొచ్చని చెబుతున్నారు. కొసమెరుపు.. ఆవు పాల రుచి తెలుసు.. గేదె పాల రుచీ తెలుసు.. మరి బొద్దింక పాల రుచి ఎలాగుంటుంది.. శాస్త్రవేత్తలు దాన్ని కూడా రుచి చూశారు. అందరూ భయపడినట్లు మరీ అంత ఛండాలంగా ఏమీ లేదట. నిజం చెప్పాలంటే.. దీనికి ఓ ప్రత్యేకమైన రుచి అంటూ ఏదీ లేదని లియోనార్డ్ చెప్పారు. మరి.. బొద్దింక పాలు మార్కెట్లోకి వస్తే.. మీరు దాన్ని రుచి చూస్తారా??? – సాక్షి, తెలంగాణ డెస్క్ -
వ్యాధులను వండుతున్నారు!
అందమైన ప్యాకింగ్.. ఆకట్టుకునే ప్రచారం.. ఇవే ఇప్పుడు వ్యాపార రహస్యాలు.ఆ వస్తువులోని నాణ్యత.. తయారీ ప్రాంతంలో పాటిస్తున్న ప్రమాణాలు ఇవేవీ కనిపించకపోవడంతో ప్రజలు బోల్తా పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలో విజిలెన్స్ అధికారులుఓ ఆయిల్ ట్రేడర్ దుకాణంలో తనిఖీ నిర్వహించగా బొద్దింకలుకలగలిసి వంటనూనె గుట్టు రట్టయింది. రూ.10లక్షల విలువ చేసే సరుకును అధికారులు సీజ్ చేశారు. అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వంటనూనె తయారీదారుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో, బొద్దింకల అవశేషాలతో కూడిన నూనె తయారు చేసి, ప్రజలకు అంటగడుతున్నాడు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకెళితే... విజయకుమార్ అనే వ్యాపారి పాతూరులోని తిలక్‌రోడ్డులో వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండానే రైతుల నుంచి వేరుశనగ కొనుగోలు చేసి, స్వయంగా నూనె తయారు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి యంత్రాలను శుభ్రం చేయకుండా అలానే వినియోగిస్తున్నాడు. అపరిశుభ్రతతో ఆ పరిసర ప్రాంతం కంపు కొడుతోంది. బొద్దింకలు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. తయారు చేసిన వేరుశనగ నూనెలో బొద్దింకలు పడి మృతిచెందాయి. అయినా నిర్వాహకుడు వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. డబ్బు యావలో పడి ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించాడు. దుకాణం సీజ్ : వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ దుకాణంపై సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు హానికలిగించే రీతిలో ఆయిల్ తయారీ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్ఐ రామకృష్ణయ్య గుర్తించారు. దీంతో దాదాపు రూ. 10లక్షలు విలువజేసే వేరుశనగనూనె, పామాయిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు దుకాణాన్ని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బొద్దింకతో పబ్లిసిటీ స్టంట్.. కట్ చేస్తే..
సాక్షి, బెంగళూరు: ఓ యువకుడు బొద్దింక తెచ్చాడు.. ఎవరూ గమనించడం లేదనుకుని క్యాంటీన్లోని ఆహార పదార్థాల్లో వదిలాడు.. వంటకాల్లో బొద్దింక ఉంది.. ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినొద్దంటూ కాసేపు హల్చల్ చేశాడు.. దానికి తోడు యువకుడితో గొంతు కలిపారు అతని మిత్రులు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు వచ్చి క్యాంటీన్లోని సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు.. ఆ పని చేసింది సదరు యువకుడు, అతని స్నేహితులు అని రుజువవడంతో కటకటాల వెనక్కి చేరారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి జరిగింది. హేమంత్, దేవరాజ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు మరో ఇద్దరితో కలిసి నగరంలోని కామాక్షిపాల్యలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్లో భోజనం చేసేందుకు శుక్రవారం వెళ్లారు. చిన్నపాటి గొడవ సృష్టిద్దామనుకుని వడ్డించిన పదార్థంలో బొద్దింక వచ్చిందంటూ హోటల్ సిబ్బందితో బెదిరింపులకు దిగారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లను అక్కడ భోజనం చేయవద్దంటూ హడావిడి చేశారు. విషయం పోలీసులకు చేరడంతో హోటల్‌కు వచ్చి ఆరా తీశారు. నగర పౌర సేవా సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) సబ్సిడీ ధరలకు ఆహారం అందించేందుకు ఈ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. వారిని సంప్రదించగా ఈ గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజిని పోలీసులకు అందజేసింది. దాన్ని పరిశీలించగా హేమంత్ బొద్దింకను తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వదిలాడని నిర్ధారణ అయింది. అతనితో వచ్చిన దేవరాజ్‌కు విషయం తెలిసినా అతను కూడా హేమంత్ చర్యలను సమర్థించాడు. దీంతో హేమంత్, దేవరాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేశామని వారు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు. -
ఇందిరాక్యాంటీన్ అల్పాహారంలో బొద్దింక
జయనగర(కర్ణాటక): ఇందిరా క్యాంటీన్లో అందించే అల్పాహారంలో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. అయితే చనిపోయిన బొద్దింకను గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వేసినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 20న మాలగాళలో ఉన్న ఇందిరాక్యాంటీన్‌లో ఓ వ్యక్తి అల్పాహారం కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆహారపదార్థంలో బొద్దింక కనిపించింది. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన హేమంత్‌కుమార్ అనేవ్యక్తి ఫేస్బుక్లో అప్‌లోడ్‌చేశాడు. స్పందించిన పాలికె అధికారులు ఆ క్యాంటీన్లోని సీసీకెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు అల్పాహారంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింక వదిలినట్లు గుర్తించారు. హేమంత్‌కుమార్‌తో పాటు అల్పాహారానికి వచ్చిన నలుగురిపై పాలికె అధికారులు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా షేప్‌టాక్ అనే సంస్థ ఇందిరా క్యాంటీన్‌కు ఆహారాన్ని సరపరా చేస్తోంది. -
కాపుచ్చినో కాఫీ.. కాక్రోచ్ కాళ్లు
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు ఎదురైన చేదు అనుభవంపై ఆయన ఫేస్బుక్లో పంచకున్నారు. మెక్ డోనాల్డ్స్ లో కాఫీ ఆర్డర్ చేస్తే కాక్రోచ్ కాళ్లు ఒడ్డించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తుండడంతో మెక్ డోనాల్డ్స్ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది. బ్యాంకాక్ చెందిన నోస్టాలిక్ ఐక్ (28) స్థానిక మెక్‌డోనాల్డ్స్ లో కాపుచ్చినో కాఫీ ఆర్డర్ చేశారు. ..వేడి..వేడిగా ..నురగలతో..కమ్మని వాసనతో అదరగొట్టాల్సిన కాఫీలో...కాఫీరంగులో తేలుతూ ఏదో ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. తీరా చూస్తే... బొద్దింక కాళ్లు.. వెంటనే బాయ్‌ని పిలిచి వేరే కప్పు తెప్పించుకున్నారు. ఈసారి మరింత బెంబేలెత్తడం అతని వంతు అయింది. ఎందుకంటే.. రెండవ కప్పులో మరిన్ని బొద్దింక కాళ్లు తేలుతూ కనిపించాయి. దీంతో మండిపడిన సదరు వినియోగదారుడు ..మెక్‌డొనాల్డ్ అంటే అధిక శుభ్రానికి, ప్రమాణాలకు పెట్టింది పేరని భావించిన తనకు గట్టి షాక్ తగిలిందంటూ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించిన మెక్‌డొనాల్డ్స్ వినియోగదారుడికి క్షమాపణలు చెప్పింది. కస్టమర్ ఆరోపణను ధృవీకరించడంతోపాటు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. -
జమ్మికుంటలో బొద్దింకల బిర్యానీ?
పంచాయతీ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు జమ్మికుంట(హుజూరాబాద్) : పట్టణంలోని శ్రీ వినాయక బార్ అండ్ రెస్టారెంట్లో ఇద్దరు బిర్యానీ తినేందుకు వెళ్లగా అందులో రెండు బొద్దింకలు వచ్చాయి. బిర్యాని వండే క్రమంలో సరిగా చూడకపోవడంతో అందులో బొద్దింకలు పడ్డాయని బాధితులు ఆరోపించారు. దీనిపై బార్ యజమానిని నిలదీసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో రెండు బొద్దింకలు వచ్చాయని నగర పంచాయతీ కమిషనర్ చింత శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. -
ఆ'పరేషన్' థియేటర్..
థానే: ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం లోపిస్తే పేషెంట్లతో పాటు డాక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపరేషన్ థియేటర్లోకి బొద్దింక రావడంతో డాక్టర్ తన సహనాన్ని కోల్పోయి కొద్దిసేపు ఆపరేషన్ ఆపేసి.. ఆస్పత్రిలో బొద్దింకలు తిరగడాన్ని మొబైల్లో చిత్రించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర థానేలో ఓ ఆస్పత్రిలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొన్ని నిమిషాల్లోనే పేషెంట్‌కు ఆపరేషన్ చేసి ఆస్పత్రిలో కొనసాగుతున్న పారిశుధ్యలోపాన్ని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదుచేశారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా డాక్టర్ సంజయ్ బరన్వాల్ పనిచేస్తున్నారు. గత శుక్రవారం కాలు ఫ్రాక్చర్ అయిందని 45 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన ఓ సీరియస్ కేసు ఆస్పత్రికి వచ్చింది. జూనియర్ డాక్టర్లతో కలిసి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ బరన్వాల్ సర్జరీ చేస్తున్నారు. ఇంతలో కొన్ని బొద్దింకలు ఆ రూమ్‌లో తిరగడం ఆయన గమనించారు. అవి తమ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని కాసేపు ఆపరేషన్ నిలిపివేసి.. ఈ విషయాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత విజయవంతంగా పేషెంట్‌కు సర్జరీ పూర్తిచేశారు. 500 పడకల సామర్థ్యం ఉన్న ఈ హాస్పిటల్‌ను థానే మునిసిపల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నారు. గతంలో తాను ఎన్నో పర్యాయాలు పారిశుద్ధ్యం అంశంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. తమ సర్జరీలు సక్సెస్ అయినా వారిలో 25 శాతం షేషెంట్లకు కీటకాల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని సీనియర్ సర్జన్ బరన్వాల్ మండిపడ్డారు. సిబ్బంది కొరతే వీటికి ప్రధాన కారణమని వివరించారు. హాస్పిటల్ డీన్ మైత్రాను ఈ విషయంపై సంప్రదించగా.. ఆమె నుంచి స్పందనరాలేదు. -
భవిష్యత్తులో బొద్దింక పాలు?
హెల్త్ ల్యాబ్ బొద్దింక క్షీరదం కాదు. కానీ వరి, సోయా బీన్స్, హెంప్ల నుంచి పాల వంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లే... బొద్దింక నుంచి కూడా పాలను తీయగలిగితే..! అది భవిష్యత్తులోని కొన్ని ఆహార అవసరాలు తీరుస్తుందనే ఆశతో ఉన్నారు పరిశోధకులు. ‘పసిఫిక్ బీటిల్ కాక్రోచ్’ (డిప్లోప్టెరా పంక్టేటా) అనే బొద్దింకలలో ఒక ప్రజాతి అయిన దీని నుంచి పాల నుంచి సేకరించే అవకాశాలను వెతుకుతున్నారు. తన పిల్లలకు జన్మనిచ్చాక, వాటిని సాకడం కోసం ఇది పాలవంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రజాతికి చెందిన బొద్దింకలు. ఆ ద్రవంలో చక్కెర, కొవ్వులు, ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ వంటివి ఎక్కువని తేలింది. దీని నుంచి లభ్యమయ్యే క్యాలరీలు కూడా ఎక్కువే. దాంతో ఈ తరహా ఆహారం (న్యూట్రిషన్) కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇదే విషయం ఐయూసీఆర్జే అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యింది. బొద్దింకల నుంచి పాల సేకరణ అనేది ఇప్పుడు సేకరిస్తున్న పాల (డెయిరీ) ఉత్పాదనలా జరగడానికి ఆస్కారం లేదు. ఆ ద్రవంలోని రసాయనాల సమ్మేళనాలను పరిశీలించి, ఆ కెమికల్ కాంపౌండ్లనే మళ్లీ పరిశోధనశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేయాలనీ, ఆ ఫార్ములా తెలిశాక పులియడానికి ఉపయోగపడే ‘ఈస్ట్’జీవులను ఇప్పుడు సృష్టిస్తున్నట్లుగానే బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఇది ఒక ఎత్తయితే ఆ ఉత్పాదనను ప్రజలు ఆదరిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న. -
పకోడిలో బొద్దింక
ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు దేశాయిపేట రోడ్డులోని ఓ రెస్టారెంట్లో ఘటన తనిఖీలు మరచిన అధికారులు పోచమ్మమైదాన్ : మేడి పండు చూడు మేలిమై ఉండు. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్నట్లుగా ఉంది బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే తినుబండారాల పరిస్థితి. నాణ్యతలేని ఆహారlపదార్థాలు, పురుగులతో కూడిన తినుబండారాలు విక్రయిస్తూ వినియోగదారుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు హోటళ్ల యాజామాన్యాలు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్లో ఆదివారం పకోడిలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన రాజు తన మిత్రులతో కలిసి ఆదివారం శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉల్లి పకోడిని ఆర్డర్ ఇవ్వగా, బేరర్ తెచ్చి టేబుల్‌పై పెట్టాడు. పకోడి మధ్యలో చూడగా బొద్దింక కనిపించింది. విషయాన్ని బార్ యాజమాన్యానికి చెప్పగా వారు పట్టించుకోలేదు. పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజు వెంటనే ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి జ్యోతిర్మయికి ఫోన్లో సమాచారం అందించి, వాట్సప్‌లో ఫొటో పంపారు. ఫిర్యాదు చేసినా తనిఖీలు శూన్యం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలలో పలు హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు, తినుబండారాల్లో పురుగులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో తనిఖీ చేసిన సంఘటనలు ఎక్కడా కానరావడం లేదు. నెలవారీ మామూళ్లకు కక్కుత్తి పడి తనిఖీలకు వెనకాడుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయమై శ్రీలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో పకోడిలో బొద్దింక వచ్చిన సంఘటన ఏమీ జరగలేదని తెలిపారు. -
‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్!
బెంగళూరు : బొద్దింక ద్వారా ఆహారమా.. ఆ మాట వింటేనే ఏదోలా ఉంది కదూ..! వాటిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటిది వాటిని తినడమా..? కానీ బొద్దింకలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు. బొద్దింకల కడుపులో మనకెంతో మేలు చేసే ప్రొటీన్లు ఉన్నాయని బెంగళూరులోని ఇన్‌స్టెమ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఆ చిన్న బొద్దింకలోని ఒక్కో ప్రొటీన్ స్ఫటికాల్లో పాలలో ఉన్న శక్తి కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్త సంచారీ బెనర్జీ పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ స్ఫటికాల్లో ప్రొటీన్లతోపాటు కొంతమేర కొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ‘ప్రొటీన్లలో దాదాపు మనకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్ ఉంటాయని తెలిసిందే. ఎలాగూ ఈ స్ఫటికాల జన్యుక్రమం మొత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి దాని ఆధారంగా సూపర్ ఆహారాన్ని ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల ద్వారా పెద్ద ఎత్తున తయారు చేయొచ్చు’ అని సంచారీ వివరంచారు. పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!
వాషింగ్టన్: కొత్త పరిసరాలను కనుక్కోవడానికి ఎలుకలు, బొద్దింకలు తమ మెదళ్లలో ఉన్న గ్లోబల్ పొషిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వంటి విధానాన్ని ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవులలాగే వివిధ జంతువులు కూడా ఈ పద్ధతిని వినియోగిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. బొద్దింకలు తమని తాము ఎలా నావిగేట్ చేసుకుంటాయన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. క్షీరదాలు కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు, ఏ దిశలో వెళ్లాలో తెలియక చుట్టూ మార్గాన్ని వెతుక్కుంటాయనని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ రిజ్మన్ తెలిపారు. మానవుడితోపాటు క్షీరదాలన్నీ మెదడు సంకేతాలపై ఆధారపడి సాగుతాయన్నారు. -
ఇంటి సౌఖ్యం... మన బాధ్యత
ఇంటిప్స్ ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే ఈ చిట్కా ఉపయోగించండి. బిర్యానీ ఆకును పౌడర్‌గా వేసి బొద్దింకలు వచ్చే చోట చల్లండి. ఆ వాసనకే అవి చచ్చిపోతాయి. {ఫిజ్‌లో క్రిములు చేరకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే చాలు. దాన్ని చిన్న బౌల్లో పోసి ఫ్రిజ్‌లో స్ప్రే చేయాలి. అలా చేస్తే అది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా దుర్వాసన రాకుండా చూస్తుంది. ఇంట్లో చీమల్ని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అవి బారులు బారులుగా ఉన్న చోట కొద్దిగా మిరియాల పొడి చల్లితే చాలు.ఆ ఘాటు వాసనకు అవి దూరంగా వెళ్లిపోతాయి.పండ్లు, కూరగాయలపై ఉండే రసాయనిక మందులు ఊరికే నీళ్లతో కడిగితే పోవు. అందుకే ఉప్పు కలిపిన నీటితో వాటిని కడిగితే ఆ కెమికల్స్ పూర్తిగా తొలగిపోతాయి. -
బొద్దింకలు ఓడిస్తాయా?
నేతల నాలుక పదును ఎంతటిదో ఎన్నికలలో తెలిసిపోతుంది. టర్కీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ పార్లమెంటుకు ఇవాళ (జూన్ 7) ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు తాయిప్ ఎర్దోగన్ స్థాపించిన ఏకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (దీని నేత కెమాల్ కిలిక్దారోగ్లు) పోటీ పడుతున్నాయి. ఎర్దోగన్ గడచిన ఆగస్ట్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికై కొత్తగా కట్టించిన అధ్యక్ష భవనంలో అడుగుపెట్టాడు. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా ఉంది. ప్రజాధనం నీళ్లలా వెచ్చించి 1,500 గదులతో భవనం కట్టించారని కెమాల్ విమర్శలకు దిగుతున్నాడు. అంతేకాదు, ఇందులో టాయిలెట్ సీట్లు కూడా బంగారంతో చేయించారని కెమాల్ దుమ్మెత్తాడు. దీనితో ఎర్దోగన్, ‘దమ్ముంటే అధ్యక్ష భవంతికి వచ్చి ఆ ఆరోపణను రుజువు చేయాలనీ, అవే కనిపిస్తే రాజీనామా చేస్తా’ననీ చెబుతున్నారు. ఎర్దోగన్ ప్రధాని పదవిలో ఉండగానే కొత్త భవనం కట్టించాడు. ‘పాత భవనం నిండా బొద్దింకలు, అందుకే కొత్తది అవసరమైంద’ని ఆయన మొన్ననే ఓ చానల్ వాళ్లకి చెప్పాడు. ఇంతకీ అధికార ఏకే పార్టీ గెలుపు సులభం కాదని సర్వేలు ఘోషిస్తున్నాయట. టర్కీ అధ్యక్షుడు బొద్దింకల చేతిలో ఓడిపోతాడో ఏమో! -
బొద్దింక..ఇంకా..ఇంకా..
కుక్కలను, పిల్లులను పెంచుకోవడం కామన్.. పావురాలు, చిలుకలను పెంచుకోవడమూ చూశాం.. ఆఖరికి కాకులను కూడా పెంచుకుంటారు.. కాని బొద్దింకలను... బొద్దింకలా కష్టమే అంటారు కదా..! కాని మిషిగాన్‌కు చెందిన కైల్ కేండిలియన్ మాత్రం ఎగిరి గంతేస్తాడు. ఎందుకంటే అతనికి బొద్దింకలంటే చాలా ఇష్టం మరి.. అందుకే వాటిని తన బెడ్రూమ్లో పెంచుకుంటున్నాడు. ఏకంగా 130 జాతులకు చెందిన దాదాపు 2 లక్షల బొద్దింకలు తన గదిలో ఉన్నాయట.. వీటి కోసం ప్రత్యేకంగా అలమరాలు కూడా తయారుచేయించాడట.. అంతేకాదు వాటినిఅమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. ఎంత తెలివో ఆనందానికి ఆనందం.. పైగా డబ్బు బోనస్! -
ఆహారంలో బొద్దింక.. ఐఆర్సీటీసీకి రూ.లక్ష జరిమానా!
న్యూఢిల్లీ:రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారంలో నాణ్యత లోపించడంతో ఐఆర్సీటీసీకి(ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) రూ.లక్ష జరిమానా పడింది. ట్రైన్లలో సరఫరా చేస్తున్న ఆహారాన్ని గత వారం పర్యవేక్షించిన అధికారులకు బొద్దింక కనబడటంతో ఈ జరిమానాను విధించారు. కోల్ కతా రాజధాని రైల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహారంలో బొద్దింక ఉండటాన్ని గుర్తించి అవాక్కయ్యారు. దీంతో ఈ ఆహారాన్నిసరఫరా చేస్తున్న ఐఆర్సీటీసీ రూ.లక్ష జరిమానా విధించారు. జూలై 23 వ తేదీన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన రైల్వే అధికారులు 13 రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఇందుకు గాను ఐఆర్సీటీసీ మరియు తొమ్మిది కేటరింగ్ సెక్షన్లకు రూ.11.50 లక్షల జరిమానాను విధించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
బొద్దింకలతో భలే వ్యాపారం..
బీజింగ్: బొద్దింక కనిపించడం ఆలస్యం కొందరు వెంటనే దాన్ని చంపేస్తుంటారు. కానీ, యూన్మెక్సియా అనే 37 ఏళ్ల చైనా మహిళ మాత్రం మురిపెంగా బొద్దింకలను పెంచుతుంది. అలా ఒకటీ, రెండూ కాదు లక్ష బొద్దింకలు ఆమె ఇంట్లో పెరుగుతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని సికియాన్ కౌంటీలో ఉండే మెక్సియా బొద్దింకలను పెంచుతూ వాటిని ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటోంది. ఈమె పెంచే బొద్దింకలను మందుల తయారీలో వాడుతుంటారు. దీంతో వాటిని కేజీ 100 డాలర్లు (5,900 రూపాయలు) చొప్పున విక్రయిస్తూ తాను అచ్చమైన వ్యాపారవేత్తనని మెక్సియా నిరూపించుకుంటోంది. బొద్దింకలను ముందుగా నీటిలో ముంచి వాటి ప్రాణాలను తీసిన తర్వాత సూర్యరశ్మికి ఎండబెట్టి, ప్యాక్ చేసి ఫార్మా కంపెనీలకు పంపుతూ ఉంటుంది. తన దగ్గర బొద్దింకలు కొన్ని రోజులే ఉన్నా... వాటిని సొంత పిల్లల్లా చూసుకుంటానని మెక్సియా చెబుతోంది. రోజంతా బొద్దింకలను పెంచే ఇంట్లోనే గడిపి, ఏ రాత్రో తన ఇంటికి వెళ్లడం ఆమె దినచర్య. -
బైపీసీలో కోతలకు చెల్లు
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : బైపీసీ గ్రూపు చదివే విద్యార్థులు జీవులను కోసి ప్రయోగాలు చేసే పద్ధతికి ఇంటర్మీడియట్ బోర్డు స్వస్తి పలికింది. 2014 వార్షిక ప్రయోగ పరీక్షల నుంచే దీన్ని అమలు చేయనుంది. వచ్చే ఏడాది నుంచి తరగతి గదుల్లోనూ జీవులను కోయరాదని, నమూనాలతో విద్యార్థులకు వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. జీవుల శరీర నిర్మాణం, అవయాల అమరికపై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కప్ప, బొద్దింక, వానపాము లాంటి చిన్న జీవులను కోసి ప్రయోగ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది జిల్లాలో 18 వేల మంది, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాదాపు 1050 వరకు విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. రైతులకు మేలు చేసే వానపాములను ప్రయోగ పరీక్షల సమయంలో వేల సంఖ్యలో కోయాల్సి ఉంది. నీటి వనరులలో క్రిమికీటకాలను తిని కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే కప్పలు కూడా చనిపోవాల్సి వస్తుంది. ప్రయోగాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. జీవవైవిద్యానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు, జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపద్యంలో జీవుల కోత ప్రయోగాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజ్ఞాకళాశాల ప్రిన్సిపాల్ హేమలత న్యూస్‌లైన్ తో వివరించారు. ఇక నమూనాలే దిక్కు ఇంటర్మీడియట్ జంతుశాస్త్ర ప్రయోగాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఆ అంశాలపై విద్యార్థులకు అవగాహన, పరీక్షల నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని కళాశాలలకు ఆదేశాలు వచ్చాయి. అవయాలను పోలిన కృత్రిమ నమూనాలతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రయోగ పరీక్షలో వానపాము, బొద్దింక, కప్ప నమూనాలు పరిశీలించి పలు భాగాల పటాలు గీసి అవయవాలను గుర్తించాల్సి ఉంటుంద ని ఆదేశాలు కళాశాలకు అందాయి.