
సాక్షి, బనశంకరి: బెంగళూరులో ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు బొద్దింక పడిన గులాబ్ జామూన్ ఇచ్చినందుకు రూ.55 వేల భారం పడింది. 2016లో రాజణ్ణ అనే వ్యక్తి గాంధీనగరలోని కామత్‌హోటల్‌లో జామూన్ తీసుకున్నారు. అందులో చనిపోయిన బొద్దింక కనబడింది.
దానిని అతడు మొబైల్‌లో వీడియో తీస్తుండగా రెస్టారెంట్ సిబ్బంది మొబైల్‌ను లాక్కోవడానికి యత్నించారు. ఈ తతంగంపై అతడు ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. రెండేళ్లయినా సమాధానం రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, వినియోగదారుల ఫోరంలోనూ కేసు వేశాడు. ఫోరం విచారణ జరిపి బాధితుడు రాజణ్ణకు రూ.55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment