ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాకపట్నంలోని భీమిలిలో బాల సురక్ష వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా జర్నలిస్టులకు పెట్టిన భోజనంలో బొద్దింక రావడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.
కాగా, తనపై టీడీపీయే సర్వే చేయించిందని మంత్రి గంటా చంద్రబాబుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చినరాజప్ప మధ్యవర్తిత్వం తర్వాత ఆయన భీమిలి కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వాహనంలో కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు.
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో మరో రెండు రోజుల పాటు సెలవులు పొడిగించారు. సెలవుల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment