ప్రతీకాత్మక చిత్రం
Cockroach Found In Biryani: వెజ్ బిర్యానీలో బొద్దింక కనిపించడంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేసిన ఘటన చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో నివసించే గణపతిశాస్త్రి నందినిసుధా హోటల్‌లో గురువారం వెజ్ బిర్యానీ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా అందులో బొద్దింక కనిపించింది.
చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు ..
హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జీహెచ్‌ఎంసీ హెల్ప్ విభాగం అధికారులు ఆ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే హోటల్‌ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క!
Comments
Please login to add a commentAdd a comment