chikkadpally
-
హైదరాబాద్ : చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత..నిరుద్యోగులపై లాఠీచార్జ్ (ఫొటోలు)
-
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులపై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ లైబ్రరీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ ప్రయోగించారు.కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
HYD: చిక్కడపల్లి సమీపంలో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వీఎస్టీలోని ఓ గోదాంలో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కాగా, గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!
చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు. కొంతకాలం నుంచి బాగ్‌లింగంపల్లిలోని మానస ఎన్‌క్లేవ్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్‌లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్‌కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ -
చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని..
సాక్షి, హైదరాబాద్: ఓ అరుదైన నార్త్ అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షినీ నగర వాసులు కాపాడారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షానికి ఉన్న పతంగి మంజాకి చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి దాహాన్ని తీర్చారు. చదవండి: వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే? వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్‌గా గుర్తించారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు. -
చిక్కడపల్లి: వెజ్ బిర్యానీలో బొద్దింక..
Cockroach Found In Biryani: వెజ్ బిర్యానీలో బొద్దింక కనిపించడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేసిన ఘటన చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో నివసించే గణపతిశాస్త్రి నందినిసుధా హోటల్లో గురువారం వెజ్ బిర్యానీ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా అందులో బొద్దింక కనిపించింది. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జీహెచ్ఎంసీ హెల్ప్ విభాగం అధికారులు ఆ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే హోటల్‌ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
8 ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు...అందుకే పథకం ప్రకారం
సాక్షి, ముషీరాబాద్: తన భార్యను తీసుకెళ్లాడనే కక్ష్యతో సంవత్సరాల తరుబడి వేచి చూసి, చివరికి కొడుకునే రెక్కీకి పంపించి, ఆ తర్వాత కుమారుడు, మరో బంధువుతో కలిసి తనకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. నిందితులను చిక్కడపల్లి పోలీసులు పంజాబ్‌లో శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యనగర్‌లో ఒక ఫాస్ట్‌పుడ్ నిర్వాహకున్ని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. దీనిని చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. శనివారం చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు పంజాబ్ రాష్ట్రానికి చెంది, హర్వేస్టర్ మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సర్వన్ సింగ్ (42) బల్జిత్ కౌర్ (32)ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకు సోదరుడు అయ్యే సత్నాం సింగ్‌కు వరుసకు వదిన అయ్యే బల్జిత్ కౌర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా ఆమెతో కలిసి 8 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. వీరిద్దరు వివాహం చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. నారాయణగూడలో పంజాబ్ ఫుడ్‌హౌస్ పేరుతో దుకాణం నిర్వహిస్తూ బాగ్ లింగంపల్లిలోని సూర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే తన భార్యను తీసుకెళ్లిన సత్నాం సింగ్‌పై సర్వన్‌సింగ్ 8 ఏళ్లు గడిచినా కక్ష్య చల్లారలేదు. అతన్ని చంపడానికి వేచి చూస్తున్నాడు. పైగా తన 15 ఏళ్ల కుమారుడికి సత్నాం సింగ్‌పై ద్వేషాన్ని నూరిపోశాడు. తన దగ్గరి బంధువుల ద్వారా సత్నాం సింగ్ ఆచూకీని తెలుసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకుని తన కుమారుడ్ని రెక్కీకి పంపించాడు. మార్చి 7, 2021లో హైదరాబాద్ వచ్చిన కుమారుడు తల్లి బల్జిత్ కౌర్‌ను కలిసి తనను పనికి కుదిర్చుకోవాలని కోరాడు. దీనితో పనితో పాటు తన నివాసంలో ఉండే విధంగా అవకాశం కల్పించింది. అయితే కుమారుడు పంజాబ్‌లో ఉన్న తండ్రి సర్వన్ సింగ్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను తెలుపుతున్నాడు. బల్జిత్ కౌర్ అఫ్జల్‌గంజ్‌లోని అశోక్ బజార్లో గల గురుద్వారాకు తరచూ వెళ్లి సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటు అక్కడే క్వార్టర్స్‌లో నిద్రపోయేది. ఈ సమయంలో ఇంట్లో సత్నాం సింగ్ ఒంటరిగా ఉండేవాడు. ఈ విషయంపై పక్కా సమాచారంతో మార్చి 29న పంజాబ్ నుంచి మరో బంధువు హర్షదీప్‌సింగ్‌తో కలిసి సర్వన్‌సింగ్ సికింద్రాబాద్ మార్చి 31వ తేదీకి వచ్చారు. రాత్రి సికింద్రాబాద్‌లోనే బస చేసిన వారు ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కుమారుడు వచ్చి కలిశాడు. వారిని తనతో పాటు సూర్యనగర్‌కు తీసుకెళ్లి సత్నాం సింగ్ ఇంటిని చూపించాడు. సమయం కోసం నారాయణ గూడ చౌరస్తాలో క్రౌన్ కేఫ్ హోటల్లో వేచిచూశారు. రాత్రి 11.30 గంటల తర్వాత ఫాస్ట్‌పుడ్ మూసివేసిన సత్నాం సింగ్ ఇంటికి వచ్చిన నిద్రపోయాడు. ఈ విషయాన్ని తన తండ్రికి సమాచారం అందించడంతో బంధువు, కుమారుతో కలిసి నిద్రపోతున్న సత్నాం సింగ్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సరిగ్గా గొంతు తెగక్కపోవడంతో ఇంట్లో కత్తితో కుమారుడు పూర్తిగా గొంతుకోసి సంఘటనా స్థలం నుంచి పంజాబ్‌కు వెళ్లిపోయారు. భార్య బల్జిత్ కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి ఏసీసీ, శ్రీధర్, ఇన్స్పెక్టర్ శివ శంకర్రావు, అదనపు ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో పంజాబ్‌కు ప్రత్యేక టీంను పంపించి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ ఆర్.కోటేశ్, కానిస్టేబుళ్లు పి.శ్రీకాంత్, సి.సందీప్, పి.రామాంజనేయ ప్రసాద్‌లను అభినందించి, రివార్డులను ప్రకటించారు. ( చదవండి: నీళ్లకు డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి ) -
కొత్త ట్విస్ట్: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని సూర్యానగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సద్నామ్సింగ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇతడితో సహజీవనం చేస్తున్న వదిన కుమారుడే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఘాతుకానికి సహకరించిందీ అతడి సమీప బంధువులే అని తేల్చారు. మధ్యప్రదేశ్ నుంచి త్రుటిలో తప్పించుకున్న నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పంజాబ్‌కు చెందిన సద్నామ్సింగ్ అవివాహితుడు. అక్కడ ఉండగానే తన అన్న భార్య బల్జీత్ కౌర్‌తో ప్రేమాయణం సాగించాడు. ఆపై ఇద్దరూ కలిసి స్వస్థలం వదిలేసి నగరానికి వచ్చేశారు. బల్జీత్ కౌర్ తన భర్తతో పాటు కుమారుడు నిషాంత్ సింగ్‌ను కూడా వదిలిపెట్టి సద్‌నామ్‌సింగ్‌తో వచ్చేసింది. వీరిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయం చాన్నాళ్ల పాటు పంజాబ్‌లోని కుటుంబికులకు తెలియలేదు. ఇటీవల వీళ్లు హైదరాబాద్‌లో నివసిస్తున్నారనే విషయం తెలుసుకున్నారు. బల్జీత్ కౌర్ చేసిన పనితో ఆమె భర్త తీవ్రంగా కుంగిపోయాడు. ఇవన్నీ చూసిన నిషాంత్ సింగ్ కక్ష పెంచుకున్నాడు. నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద సద్నామ్సింగ్ ఫాస్ట్‌పుడ్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం నిషాంత్ సింగ్‌కు తెలిసింది. దీంతో ఉపాధి కోసమంటూ హైదరాబాద్‌కు వచ్చి ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో చేరాలని పథకం వేశాడు. గతంలో ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్లిన నిషాంత్ సింగ్.. ప్రస్తుతం సద్నామ్సింగ్, బల్జీత్ కౌర్‌లకు ఏడేళ్ల కుమారుడు ఉన్న విషయం తెలుసుకున్నాడు. గత నెలలో మరోసారి వచ్చిన నిషాంత్ తన చిన్నాన్నకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. తన కుమారుడు సిటీకి వచ్చి సద్నామ్సింగ్ వద్దే పని చేస్తూ, వారి ఇంట్లోనే ఉండటాన్ని బల్జీత్ కౌర్ ఇబ్బందిగా భావించింది. దీంతో గత నెల 10న తన ఏడేళ్ల కుమారుడిని తీసుకుని అఫ్జల్‌గంజ్ గురుద్వారకు వెళ్లిపోయింది. తల్లి వెళ్లిపోవడంతో అదే అదనుగా భావించిన నిషాంత్‌సింగ్ ఇంట్లో ఉన్న సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం వేశాడు. తానొక్కడినే అతడిని చంపలేననే ఉద్దేశంతో సమీప బంధువుల సహాయం కోరాడు. దీంతో పంజాబ్‌లోని అతడి మేనత్త కుమారుడితో పాటు బంధువులు గత బుధవారం సిటీకి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అదను చూసుకుని ఈ ముగ్గురూ కలిసి సద్‌నామ్‌సింగ్‌ను హత్య చేశారు. చేతులు కట్టేసి, గొంతు కోసి చంపారు. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి బల్జీత్ కౌర్ గురుద్వారలో ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తొలుత విషయాలు దాచాలని ఆమె ప్రయత్నించినా చివరికి నోరు విప్పింది. ఈ నెల 1న ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి ప్రత్యేక బృందం వెళ్లేసరికి వాళ్లు తప్పించుకున్నారు. దీంతో మరో రెండు బృందాలు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. చదవండి: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం -
తాళం ఉన్నఇంట్లో 35 తులాల బంగారం చోరీ
చిక్కడపల్లి : తాళాలు పగులగొట్టి దొంగలు 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీవెంక టేశ్వర గుడి సమీపంలోని సోప్ ఫ్యాక్టరీ లైన్లో ఉండే రాజేష్ కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వె ళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీ రువాలో ఉన్న 35 తులాల బంగారు నగలు, రూ 5 వేలు కని పించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిక్కడపల్లిలో చైన్‌స్నాచింగ్
చిక్కడపల్లి (హైదరాబాద్) : ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థిని మెడలో నుంచి తులం బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన డాక్టర్ బిందుమాధవి(23) సివిల్స్ పరీక్షల కోసం సిద్ధం అయ్యేందుకు గత కొంత కాలంగా దోమలగూడలోని సాయి కౌసల్యా అపార్ట్మెంట్లో ఉంటోంది. సోమవారం ఉదయం ఆమె స్కూటీపై ఆంజనేయస్వామి గుడికి వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొలుసు దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు, సీ.సీ.పుటేజీలు చూస్తున్నామని చెప్పారు. -
వాటీజ్ గుడ్...?
చిక్కడపల్లి లాంటి చోట ఓ క్లర్కు సూర్యారావు లాంటి చిన్న గుమస్తా చాలీచాలని జీతంతో మిడుకుతుంటాడు. ఓ చిట్టీ మీద రూమ్ అద్దె, పాలు, పచారీ సరుకులు, బియ్యం, ఉప్పులూ పప్పులతో పాటు చివర్లో సుఖం అని కూడా రాసుకుంటాడు. అన్నిటికీ పక్కన రేట్లు వేసుకుని ఒబ్బిడిగా బతుకుతుంటాడు. చివర్లో సుఖం కోసం ఓ వేశ్యని బుక్ చేసుకుంటాడు. ఆవిడ నెలకి రెండుసార్లు వచ్చి పోతుంటుంది. ప్రభుత్వం వారు బడ్జెట్ పెట్టినందువల్ల సరుకుల రేట్లన్నీ పెరుగుతాయి. ఒకనాడు వచ్చినావిడ వెళ్లే ముందు చీర సవరించుకుంటూ.. ‘‘యావండీ.. అన్ని రేట్లూ పెరిగాయి. మీ ఇంటికి వచ్చిపోవడానికి బస్సుచార్జీలు కూడా పెంచేశారు. నాక్కూడా మీరు రేటు పెంచాలండీ’’ అంటుంది. మన క్లర్కు రావు మటుకు తలపెకైత్తి ‘‘ఇక నుంచి నెలకు ఒకేసారి రా’’ అని చెప్తాడు. అదీ కథ. పోస్టు కార్డు మీద రాసే కథల పోటీలో చంద్రకి మొదటి బహుమతి వచ్చినట్టు గుర్తు. బడ్జెట్ అంటే గవర్నమెంటువారు మన వాకిట్లోకీ, నట్టింట్లోకీ, వంటగదీ, పడగ్గదిలోకీ తోసుకొచ్చే బాలక్రిష్ణ లాటిదనమాట. అది మన తిండీ తిప్పల్నీ, నవ్వులూ, ఏడుపుల్నీ కంట్రోల్ చేసే యంత్రం. పెద్దమాటగా చెప్పాలంటే రాజ్యాంగయంత్రం. ఒకప్పుడు ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్‌కి క్యూబన్ స్టార్ డెరైక్టర్ వచ్చాడు. ఆయన ఫిలిం ఉత్తమ చిత్రంగా ఎన్నికైనందున రిపోర్టర్లంతా చుట్టూ చేరి చాలా ప్రశ్నలేశారు. వర్ధమాన దేశాల్లో డెరైక్టర్లకు సినిమా సబ్జెక్టుల కొరత ఉందని విలేకరులు బెంగపడ్డారు. వెంటనే ఆయన ‘‘సబ్జెక్టులకు లోటేముంది. ఈ పూట మీరు ఎన్ని అన్నం ముద్దలు మింగాలో మీ ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ విషయం మీదే సినిమా తియ్యొచ్చు.’’ అన్నాడు. అలాగని ఈ పేపరు చదవడం ముగించి వేంటనే షార్ట్ ఫిలిం లాగుదామని తొందరపడి పోకండి. నెహ్రూ గారి కాలంలో ‘శంకర్స్ వీక్లీ’ అనే కార్టూన్ మ్యాగజీన్ ప్రతివారం వచ్చేది. ఎడిటర్ శంకర్ నెహ్రూకి వీరాభిమాని. కాని కార్టూన్లలో చురకలుండేవి. బడ్జెట్‌కు ముందు పెట్టుబడిదార్లను తృప్తిపరచడం కోసం నెహ్రూ తంటాలు పడుతుంటాడు. టాటాబిర్లాలిద్దరూ మూతి ముడుచుకుని వెనక్కి తిరిగి నుంచునుంటారు. నెహ్రూ తన ఆర్థికమంత్రితో కలిసి ఒక బంగారుపళ్లెంలో కేబినెట్ మినిస్టర్‌ను తీసుకొచ్చి సమర్పిస్తాడు. టాటాబిర్లాలకు ఏమాత్రం గిట్టదు. ఎలాగైనా వాళ్లని మెప్పించాలని వరసగా ఒక్కొక్క మినిస్టర్‌నే తెచ్చి తాకట్టు పెట్టుకున్నా వాళ్లిద్దరూ మొహం మాడ్చుకునే ఉంటారు. చివరికి నెహ్రూనే స్వయంగా పళ్లెంలో కూచుని దాని అంచులు పట్టుకుని సమర్పించుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరి మొహాలు వికసించి నవ్వుతారు. ‘ప్రభుత్వమంటే కొద్దిమంది పెట్టుబడిదార్ల వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ’ మాత్రమేనన్నాడు కారల్ మార్క్స్. వాళ్ల జమాఖర్చులే బడ్జెట్ అనుకోవచ్చు. మార్క్స్ చెప్పినంతటి చిక్కుముడి లేకుండా భారీ బిజినెస్మేన్సే పార్టీలను కొని, టికెట్లు కొని డెరైక్టుగా మంత్రులైపోతున్నారు గనక వాళ్ల తరఫున వేరే గవర్నమెంట్ పని చెయ్యాల్సిన ముచ్చటే లేదు. వీళ్లే గవర్నమెంటు. రిలయన్స్ లాంటి వాళ్లిచ్చిన వేలకోట్లతో, రిలయన్స్ మీడియా ప్రచారహోరులో గెలిచినవాళ్లు ఆ కంపెనీ గీసిన గీత దాటుతారనుకోవడం వెర్రేకాదు సర్రియలిజం కూడాను. అమెరికాలో ఒకప్పుడీ మాట ప్రచారంలో ఉండేది. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ జనరల్ ఎలక్ట్రిక్(జి.ఇ.) ఈజ్ గుడ్ ఫర్ అమెరికా’’ఇప్పుడు మనమూ చక్కగా అనుకోవచ్చు. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ రిలయన్స్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా’’ ... ఛీర్స్! మోహన్ఆర్టిస్ట్