చిక్కడపల్లి (హైదరాబాద్) : ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థిని మెడలో నుంచి తులం బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన డాక్టర్ బిందుమాధవి(23) సివిల్స్ పరీక్షల కోసం సిద్ధం అయ్యేందుకు గత కొంత కాలంగా దోమలగూడలోని సాయి కౌసల్యా అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.
సోమవారం ఉదయం ఆమె స్కూటీపై ఆంజనేయస్వామి గుడికి వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొలుసు దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు, సీ.సీ.పుటేజీలు చూస్తున్నామని చెప్పారు.
చిక్కడపల్లిలో చైన్‌స్నాచింగ్
Published Mon, Jun 13 2016 6:31 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement