
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ లైబ్రరీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ ప్రయోగించారు

కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు

లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు

లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది



















